E-Paper
Advertisement

Brahmamudi Serial Today January 10th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కావ్యను కన్వీన్స్ చేసిన దుగ్గిరాల ఫ్యామిలీ

Brahmamudi Serial Today January 10th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కావ్యను కన్వీన్స్ చేసిన దుగ్గిరాల ఫ్యామిలీ
Advertisement

Brahmamudi serial today Episode:

హాస్పిటల్‌లో స్వప్న, అప్పు గొడవపడుతుంటే ఇంద్రాదేవి చూసి కోపంగా ఏయ్‌ ఆపండి అంటూ అరుస్తుంది. ఇక్కడున్న పరిస్థితి ఏంటి..? మీరు చేస్తున్నదేంటి..? ఈ ఇంటి కోడలే దుగ్గిరాల వారి ఇంటికి వంశాకురాన్ని ఇచ్చే పిల్ల అది ఇప్పుడు చావు బతుకుల్లో ఉంది. దాని ప్రాణానికి ప్రాణమైన నా మనవడు పోలీస్‌ స్టేషన్‌ లో ఉన్నాడు.. అర్థమైవుతుందా మీకు వాడే స్టేషన్‌ నుంచి వచ్చే పరిస్థితిలో లేడు.. ఇక్కడ కావ్య వాడొస్తే కానీ ఆపరేషన్‌ చేయించుకునే పరిస్థితిలో లేదు.. సమయానికి ఆపరేషన్‌ జరగకపోతే రెండు నిండు కోల్పోవాల్సి వస్తుంది అది కూడా తెలియడం లేదా మీకు దాన్ని బతిమాలో బామాలో కావ్యను ఆపరేషన్‌కు ఒప్పించడం పోయి పిల్లి ఎలుకల్నా ఇలా పోట్లాడుకుంటారా..? సిగ్గు లేదు మీకు అంటూ తిడుతుంది. ఇంతలో ఒక సిస్టర్‌ వచ్చి హలో ఎక్స్‌క్యూజ్‌ మీ ఇది హాస్పిటల్ అండి.. ఇక్కడ ఇలా గొడవ చేయకండి అంటూ చెప్పి వెళ్లిపోతుంది. ఏం లేదు సిస్టర్‌ గోడవేం చేయడం లేదు అని సుభాష్‌ చెప్తాడు.

మరోవైపు మినిస్టర్‌  ధర్మేంద్ర వైఫ్‌ తులసి కూడా ప్రెగ్నెంట్‌ గా ఉంటుంది. డాక్టర్‌ చక్రవర్తి   చెక్‌ చేసి వచ్చి ఈసారి ఎలాంటి ప్రాబ్లమ్‌ లేదని చెప్తాడు. ఎందుకైనా మంచిది ఈసారి ముందే హాస్పిటల్‌లో అడ్మిట్‌ అవ్వండి అని చెప్తాడు. గతంలో రెండు సార్లు చేసిన తప్పిదాలు ఈసారి చేయకుండా జాగ్రత్తపడదాం అంటాడు. దీంతో తులసి దర్మేంద్ర సరే అంటారు. ఇక ఐసీయూలో ఉన్న కావ్య దగ్గరకు అందరూ వెళ్తారు. వాళ్లను చూసిన కావ్య రాజ్‌ వచ్చాడా అని అడుగుతుంది.  కావ్య ఆ విషయం గురించే మాట్లాడదామని వచ్చాం నువ్వు కంగారు తగ్గించుకోమ్మా అని అపర్ణ చెప్పగానే.. కావ్య ఏడుస్తూ.. అత్తయ్యా నా కంగారు నా బాధ అన్ని అయన కోసమే అత్తయ్యా..? కళ్యాణ్‌, మామయ్య గారు కలిసి ఆయన్ని తీసుకొస్తామని చెప్పారు కదా..? మామయ్య చెప్పండి అయన ఎలా ఉన్నారు… ఎప్పుడొస్తారు..? అని అడుగుతుంది. దీంతో ఇంద్రాదేవి కావ్య వాడికేం కాలేదు.. కాదు కూడా కానీ నువ్వు ఇలా ఉంటే నీకు నీ బిడ్డకు మంచిది కాదని డాక్టర్‌ కూడా చెప్తున్నారు. నా మాట విను తల్లి.. అనగానే..

Advertisement

ముందు ఆయన ఎప్పుడు వస్తారో చెప్పు అమ్మమ్మ.. మామయ్య గారు మీరు మాట్లాడరేంటి..? అని అడుగుతుంది. దీంతో సుభాష్‌ అమ్మా కావ్య ఈ రోజే నేను కళ్యాణ్‌ వెళ్లి నువ్వు కోరుకున్నట్టేగానే రాజ్‌ను బయటకు తీసుకురావడానికి ప్రయత్నం చేశాం.. కానీ శని ఆదివారాలు కదమ్మా కోర్టుకు సెలవులు కాబట్టి బెయిల్‌ రాదు అన్నారు.. అది నీకు తెలుసు కదా..? అయినా కళ్యాణ్‌ ప్రయత్నం చేస్తా అన్నారు కాస్త ఓపిక పట్టు అమ్మ.. అని చెప్పగానే.. అపర్ణ కూడా రెండే రెండు రోజులు రాజ్‌ బయటకు వస్తాడని లాయరు గారు చెప్పారంట కావ్య వాడు వచ్చేస్తాడు.. నువ్వు కంగారు పడకు కావ్య.. అనగానే..

కానీ అప్పటి దాకా ఆపరేషన్‌ ఆపడం మంచిది కాదని డాక్టర్‌లు చెప్తున్నారు. నువ్వు కంగారు పడకుండా ప్రశాంతంగా ఆపరేషన్‌ చేయించుకోవాలి. నా ముని మనవణ్ని నాకు అందించాలి.. అని చెప్తుంది అందరూ కలిసి కావ్యను కన్వీన్స్‌ ‌చేయగానే.. కావ్య ఆపరేషన్‌కు ఒప్పుకుంటుంది. దీంతో డాక్టర్‌ చూశావా కావ్య నువ్వు సంతోషంగా అలా మాట్లాడుతుంటే నీ బీపీ కూడా డౌన్‌ అయిపోతుంది. టెస్టులు అన్ని కంప్లీట్‌ అయ్యాయి.. రిపోర్ట్స్‌ కూడా వచ్చేశాయి.. చెక్‌ చేశాను. కాకపోతే బేబీ కాస్త అండర్‌ వెయిట్‌ లో ఉంది అని చెప్పగానే.. ప్రాబ్లమ్‌ ఏమీ లేదు కదా డాక్టర్‌ అని అపర్ణ అడుగుతుంది. దీంతో డాక్టర్‌ ప్రాబ్లమ్‌ ఏమీ ఉండదు. బేబీ పుట్టగానే.. ఇంకుబేటర్‌లో పెడతాం.. టూ వీక్స్‌ లో వెయిట్‌ పెరిగేలా చేయోచ్చు.. ఇక మీరు బయటకు వెళ్లండి.. ఉదయాన్నే ఆపరేషన్‌ చేస్తాం.. అని చెప్పగానే.. అందరూ బయటకు వెళ్లిపోతారు.

Advertisement

రాత్రికి అందరూ ఐసీయూ బయట కూర్చుని రాజ్‌ బెయిల్‌ గురించి మాట్లాడుకుంటారు. రెండు రోజుల్లో రాజ్‌ను ఎలా బయటకు తీసుకొస్తావని అప్పు కళ్యాణ్‌ను అడిగితే కళ్యాణ్‌ తాను అబద్దం చెప్పానని అనడంతో కావ్య కిటికీలోంచి వింటుంది. అబద్దం ఎందుకు చెప్పావని అందరూ అడిగితే వదిన ప్రాణం కాపాడాలి అనుకున్నాను అందుకే అబద్దం చెప్పాను అంటాడు కళ్యాణ్‌. అంతా విన్న కావ్య ఏడుస్తుంటుంది. మరోవైపు స్టేషన్‌ లో ఉన్న రాజ్‌ తాను కావ్యకు డెలివరీ టైంలో పక్కనే ఉంటానని ఇచ్చిన మాట గుర్తు చేసుకుని బాధపడుతుంటాడు. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×