E-Paper
Advertisement

Brahmamudi Serial Today February 8th: ‘బ్రహ్మముడి’ సీరియల్: గోరింటాకుతో మొదలైన రగడ – కావ్యను అవమానించిన రుద్రాణి  

Brahmamudi Serial Today February 8th: ‘బ్రహ్మముడి’ సీరియల్: గోరింటాకుతో మొదలైన రగడ – కావ్యను అవమానించిన రుద్రాణి  
Advertisement

Brahmamudi serial today Episode: స్వప్నను తీసుకుని వచ్చి కూర్చో అక్కా గోరింటాకు పెడతాను అంటూ మీలో ఎవరికైనా గోరింటాకు పెట్టించుకోవాలని ఉంటే రండి అని పిలుస్తుంది కావ్య. దీంతో రుద్రాణి గోరింటాకు అంటే ఇష్టమే కానీ అది ఆరే వరకు వెయిట్‌ చేయాలంటేనే ఇరిటేటింగ్‌ గా ఉంటుంది అంటుంది. ఇందిరాదేవి వెటకారంగా వెనకటికి నీలాంటిదే పిల్లలు అంటే ఇష్టం కానీ 9 నెలలు మోయాలంటే చాలా కష్టం అందట అంటుంది. దీంతో రుద్రాణి నేనంటే ఇంట్లో వాళ్లకు ఎందుకమ్మా అంత ప్రేమ.. నేను నోరు తెరవడం ఆలస్యం అందరూ నా మీద సెటైర్లు వేయడానికి రెడీగా ఉంటారు అంటుంది.

సుభాష్‌ నీ జాతకం అలాంటిది.. అలాంటి ఘడియల్లో పుట్టావు మరి అంటాడు. ఇంతలో అపర్ణ.. ధాన్యలక్ష్మీ నీకు గోరింటాకు అంటే ఇష్టం కదా..? వెళ్లి పెట్టించుకోవచ్చు కదా..? అని చెప్పగానే ధాన్యలక్ష్మీ నేను అడిగింది నాకు ఇస్తే చాలు ఈ గోరింటాకులు, గట్రా నాకు ఏం అక్కర్లేదు అంటుంది. కావ్య ప్రేమగా అడిగింది. కావాల్సిన వాళ్లు రండి వద్దనుకున్న వాళ్లు సైలెంట్‌గా ఉండండి అంటుంది స్వప్న. ఇంతలో ఇందిరాదేవి ఏంటి నువ్వు పెట్టుకోవా..? గోరింటాకు అని అప్పును అడుగుతుంది. అప్పు నాకు అలవాటు లేదు అమ్మమ్మ అని చెప్తుంది.

Advertisement

మగరాయుడిలా పెరిగింది కదా తనకు గోరింటాకుతో పనేముంది అంటుంది రుద్రాణి. దీంతో ఇందిర కోపంగా నువ్వు నోరు మూస్తావా..? అంటూ రుద్రాణికి చెప్తూ.. నువ్వు పోలీస్‌ అయితే గోరింటాకు పెట్టుకోకూడదా..? ఎంత కాదనుకున్నా నువ్వు ఒక ఆడపిల్లవు.. గోరింటాకు పెట్టుకుంటే చేతులు చాలా బాగుంటాయి అని అప్పుకు చెప్తుంది. కావ్య దా అప్పు అని పిలిస్తే.. అప్పు, కళ్యాణ్‌ వైపు చూస్తుంది. కళ్యాణ్‌  పెట్టించుకో అన్నట్టుగా సైగ చేయగానే అప్పు వెళ్లి కావ్య దగ్గర కూర్చుంటుంది. కావ్య, స్వప్నకు అప్పుకు గోరింటాకు పెడుతుంది. కావ్య నువ్వు ఇద్దరికీ పెట్టావు కదా నేను నీకు పెడతాను అంటుంది ఇందిరాదేవి. సరే అంటుంది కావ్య.

ఇందిరాదేవి, కావ్యకు గోరింటాకు పెడుతూ.. మీ అక్క స్వప్న ఒక పాపను కని తన బాధ్యత నెరవేర్చింది. ఇక మీ ఇద్దరు ఎప్పుడు పిల్లలను కంటారో చెప్పండి.. ఎప్పుడూ పని పని అని కాకుండా కాస్త పిల్లలను కనే పని మీద దృష్టి పెట్టండి. మన ఇంట్లో రాజ్‌, రాహుల్‌, కళ్యాణ్‌ లకు ఎలాంటి భార్యలు వస్తారో.. వీళ్లు ముగ్గురు కలిసి ఉంటారో లేదో అని కాస్త భయం వేసేది. కానీ మిమ్మల్ని చూసిన తర్వాత నాకు చాలా ధైర్యం వేసింది. మీ ముగ్గురు ఓకే ఇంటి నుంచి రావడం చాలా మంచిదైంది.

Advertisement

మీరు తోడి కోడళ్ల లాగా కాకుండా ఇక్కడ కూడా అక్కా చెల్లెలులాగా చాలా ఆనందంగా ఉన్నారు. నాకు చాలా సతోషంగా ఉంది అనగానే.. రుద్రాణి వెటకారంగా అవును వాళ్లు మాత్రమే సంతోషంగా ఉంటే చాలు. మిగతా వాళ్లు ఏమై పోయినా పర్వాలేదు.. అంతేగా.. అంటుంది. దీంతో ఇందిరాదేవి  ఏంటి రుద్రాణి నువ్వు ఎదుటి వాళ్లను కాసేపు కూడా సంతోషంగా ఉండనివ్వవా..? అంటుంది. దీంతో రుద్రాణి కోపంగా అయితే మీరు మీరు బాగా రూసుకుని పూసుకోండి అంటూ వెళ్లిపోతుంది. తర్వాత అందరూ వెళ్లిపోతారు.

గోరింటాకు పెట్టుకుని రూంలోకి వెళ్లిన కావ్యను వచ్చావా..? కొంచెం ఆ వాటర్‌ బాటిల్‌ ఇవ్వు అని అడుగుతాడు. కావ్య కష్టం మీద బాటిల్‌ ఇవ్వబోతుంటే..రాజ్‌ చూసి ఏయ్‌ ఏం చేస్తున్నావు.. అయినా చేతికి గోరింటాకు పెట్టుకున్నది చెప్పొచ్చు కదా అంటాడు. నేను ఇంతకు ముందు గోరింటాకు పెట్టుకున్నది మీరు చూశారు కదా అంటూ తమరికి బెడ్‌రూంలో కూడా వర్కే కావాలి. భార్య ఏం చేస్తుంది. ఏం ఆశిస్తుంది అనేది లేదు అంటుంది. దీంతో రాజ్‌ ఏం నోరు మూసుకో.. వర్క్‌ ఉంది అంటాడు. ఇంతలో కావ్య వీపుకు దురద పెడుతుందని ఎలా అనుకుని వెళ్లి గోడకు వెళ్లి గోక్కుంటుంటే.. రాజ్‌ విచిత్రంగా చూస్తూ.. ఏయ్‌ పొలాల్లోంచి వచ్చిన గేదే చెట్టుకు రుద్దుకున్నట్టు ఏం చేస్తున్నావు అక్కడ అంటాడు. దగ్గరకు వెళ్లి ఇప్పుడేంటి వీపు గోకాలా అంటూ గోకుతాడు రాజ్‌.

అప్పు, కళ్యాణ్‌ రూంలోకి వెళ్లి అంతా తిరిగి చూస్తుంది. దీంతో కళ్యాణ్‌ ఏంటి పొట్టి మర్డర్‌ జరిగిన ప్లేస్‌లో ఇన్వెస్టిగేషన్‌ చేసే పోలీస్‌ ఆఫీసర్‌ లా అలా చూస్తున్నావు అంటాడు. దీంతో అప్పు చీచీ అదేం పోలికరా బై అలా అంటావు. నువ్వు పుట్టి పెరిగింది ఇక్కడే కదా..? నీ మెమెరీస్‌ అన్ని ఇక్కడే ఉంటాయి. అవన్నీ చూస్తూ ప్రతి సీన్‌ను రిక్రియేట్‌ చేసుకుంటున్నాను అంటుంది. పోలీస్‌వు అనిపించుకున్నావు పొట్టి అంటాడు కళ్యాణ్‌. దీంతో అప్పు నువ్వు ఇక్కడ గడిపిన క్షణాలన్నీ నీకు గుర్తు రావడం లేదా..? అని అడుగుతుంది. కళ్యాణ్‌ ఎందుకు గుర్తుకు రావు. ఆ రోజుల వేరు మనకు పెళ్లి అయ్యాక ఇంట్లో వాళ్లు ఒప్పుకోలేదని బయటకు వెళ్లిపోయం కానీ లేదంటే..మనం ఈ రూమ్‌లోనే ఉండేవాళ్లం. ఇక్కడ ప్రతి క్షణాన్ని ఆస్వాదించే వాళ్లం. కానీ ఇప్పుడు అవకాశం లేకుండా పోయింది.

అంటూ ఎమోషనల్‌ అవుతాడు కళ్యాణ్‌. దీంతో అప్పు ఒక్కసారి ఇంట్లో వాళ్లు చెప్పింది ఆలోచించు కూచి. నావల్ల నువ్వు ఇవన్నీ దూరం అవ్వడం నాకు మంచిగా అనిపించడం లేదు. వాళ్లు అడిగినట్టుగా మనం ఇక్కడే ఉండిపోదామా..? అంటుంది. కళ్యాణ్‌ లేదు పొట్టి అమ్మ మనసు నాకు బాగా తెలుసు ఈమధ్య అమ్మ చాలా మారిపోయింది. ఇంట్లో వాళ్లు మమ్మల్ని మోసం చేస్తున్నారని అంటుంది. ఆస్థి కోసమే రోజు గొడవలు జరగుతున్నాయి. ఆస్థి గురించి అడగాలని నన్ను చాలాసార్లు అడిగింది కూడా.. అందరం కలిసి ఉండాలనేదే తాతయ్య, నాన్నమ్మ ఆశ వాళ్లను బాధపెట్టే పని నేనే ఏదీ చేయను అంటాడు కళ్యాణ్‌.

రుద్రాణి, అనామికకు ఫోన్‌ చేసి ఇంట్లో అన్ని విషయాలు పూసగుచ్చినట్టు చెప్పాను. రేపు పాప బారసాల జరిగిపోతుంది. అందరూ హ్యాపీగా ఉన్నారు. నేను మాత్రం ఏ సంతోషం లేకుండా ఉండిపోయాను. చీకటి కోసం ఎదురుచూసే గుబ్లగూడలా ఆస్థి కోసం ఎదురుచూస్తున్నాను. నిన్ను నమ్ముకుని నాకు ఏంటి లాభం అంటూ నిలదీస్తుంది. దీంతో నేను కూడా అవకాశం కోసం చూస్తున్నాను. కాస్త ఓపిక పట్టండి అంటూ చెప్తుంది అనామిక. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

 

ALSO READ: సకల బాధలను దూరం చేసే షణ్ముఖి రుద్రాక్ష ధారణ ఎవరు చేయాలి..?

 

Tags

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×