E-Paper
Advertisement

Brahmamudi Serial Today February 7th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రుద్రాణి ప్లాన్ సక్సెస్ 

Brahmamudi Serial Today February 7th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రుద్రాణి ప్లాన్ సక్సెస్ 
Advertisement

Brahmamudi serial today Episode:

రాజ్‌ తనకు వార్నింగ్‌ ఇచ్చిన విషయం రుద్రాణికి చెప్తాడు మినిస్టర్‌ ధర్మేంద్ర. దీంతో రుద్రాణి కోపంగా మినిస్టర్‌ ను తిడుతుంది. ఇంత జరుగుతున్నా నాకు ఎందుకు చెప్పలేదు అంటూ ప్రశ్నిస్తుంది. నువ్వు చెప్పినట్టు వాళ్లు భయపడ్డారేమో అనుకున్నాను కానీ ఇంకా వాళ్లు నిజాన్ని బయటకు తీసేదాకా వెళ్లారు అంటాడు ధర్మేంద్ర. దీంతో ఈ విషయం నాకు వదిలేయ్‌ నేను చూసుకుంటాను అని చెప్పిన రుద్రాణి వెంటనే ధాన్యలక్ష్మీకి ఫోన్‌ చేస్తుంది. ధాన్యలక్ష్మీ వెటకారంగా మాట్లాడుతుంటే.. ధాన్యలక్ష్మీ ఇంకా నా మీద కోపం తగ్గలేదా అని అడుగుతుంది. దీంతో ధాన్యలక్ష్మీ కోపం తగ్గడానికి నువ్వు చేసిన దరిద్ర్యం అంతా ఇంతా కాదు. నిజానికి నిన్ను జైళ్లో పెట్టించాలి అని తిడుతుంది ధాన్యం.

అయితే రుద్రాణి మాత్రం నీ జీవితానికి ఉపయోగపడే విషయం చెప్పడానికి ఫోన్ చేశాను చెప్పగానే..ధాన్యలక్ష్మీ కోపంగా నాకు నీ సలహాలు, హెచ్చరికలు, జాగ్రత్తలు ఏం అవసరం లేదు అసలు నాకు వినే ఉద్దేశం కూడా లేదు అని చెప్పగానే.. రుద్రాణి కోపంగా నీ కోడలి కడుపులో ఉన్న వారసుడి ప్రాణాలకు ప్రమాదమని తెలిసినా వినిపించుకోవా అంటుంది. దీంతో ధాన్యలక్ష్మీ షాక్‌ అవుతుంది. ఏం మాట్లాడుతున్నావు రుద్రాణి అంటుంది. దీంతో అవును ధాన్యలక్ష్మీ  ఆ రాజ్ కావ్యలు మినిస్టర్‌తో ఎందుకు శత్రుత్వం పెంచుకున్నారో కానీ ఆ మినిస్టర్ మాత్రం రాజ్ – కావ్యలు చేసిన తప్పు వల్ల మన కుటుంబం మీదే పగ పెంచుకున్నాడు. ఎప్పుడు ఎవరి మీద విరుచుకుపడతాడో? ఎవరి ప్రాణాలను తీస్తాడో ఎవ్వరికీ తెలియదు. మొన్న యాక్సిడెంట్ కూడా ఆ మినిస్టర్ చేయించాడని నా అనుమానం. మళ్లీ అలాంటి ప్రమాదం నీ కొడుక్కి, కోడలికి వచ్చిందనుకో.. నీ పరిస్ధితి ఏంటీ? ఆ రాజ్, కావ్యలు ఆ మినిస్టర్‌తో గొడవ పెట్టుకోకుండా నువ్వే ఆపలగవని చెప్పడంతో ధాన్యలక్ష్మీ నేనా నేనేం చేయగలను అని అడగ్గానే.. రుద్రాణి మొత్తం చెప్తుంది. ధాన్యలక్ష్మీని రెచ్చగొడుతుంది.

Advertisement

ఇక పాపకు ఆపరేషన్‌ రేపే చేస్తారని రాజ్‌, కావ్య ఇంట్లో వాళ్లకు చెప్తుంటారు. పాప ఈ ప్రమాదం నుంచి బయటపడుతుందో లేదోనని భయంగా ఉంది అంటూ కావ్య బాధపడుతుంది. దీంతో అపర్ణ.. ఓదారుస్తూ.. నువ్వు ఎన్నో అడ్డంకులు దాటుకుని ఈ బిడ్డకు జన్మనిచ్చావు.. అలాంటి నీకు బిడ్డను దేవుడు దూరం చేయడు కావ్య అంటుంది. అప్పుడే ధాన్యలక్ష్మీ వచ్చి కోపంగా వీళ్లు చేసిన నిర్వాకం వల్లే భయపడుతున్నారు తప్పించి, పాపకు చేసే ఆపరేషన్ వల్ల కాదు.. అంటూ కోప్పడుతుంది. దీంతో కావ్య ఏం జరిగింది చిన్నత్తయ్యా అని అడగ్గానే.. ధాన్యలక్ష్మీ మరింత కోపంగా చేసిన తప్పుని ఇద్దరూ కలిసి దాచారు.. ఇంట్లో మూడు యాక్సిడెంట్స్ తృటిలో తప్పిపోయాయి. వీళ్లిద్దరూ కలిసి వాడితో శత్రుత్వం పెట్టుకున్నారు.

దాంతో వాడు మనింట్లో వాళ్లని చంపాలని అనుకున్నాడు. మళ్లీ వాడి జోలికెళ్తే ఈ కుటుంబాన్ని నాశనం చేస్తానని వార్నింగ్ ఇచ్చి వెళ్లాడు.  వీళ్లు అన్నట్టు అది వ్యాపార శత్రుత్వం కాదు.. ఇంకెదో ఉంది. అందుకే వాడు కక్ష కట్టాడు.. ఈ కుటుంబం, నా కొడుకు, కోడలు ఏమైపోతారోనని భయంగా ఉంది. వీళ్లు మనకి చెప్పిందొకటి, చేస్తోందొకటి.. వీళ్లు పదే పదే ఆ మినిస్టర్‌తో గొడవ పడుతూనే ఉన్నారు. ఇప్పుడు వాడు మనందరి మీద కక్ష కట్టి తిరుగుతున్నాడు. ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు మనల్ని చంపాలని చూస్తున్నాడు . వాడి వల్ల ఈ కుటుంబానికి ప్రమాదం పొంచి లేదని రాజ్, కావ్యలను చెప్పమనండి.. వాడు నట్టింట్లో నిలబడి బెదిరిస్తుంటే మీరిద్దరూ ఏం చేశారు? ఈ ఇంట్లో ఏదైనా జరగరానిది జరిగితే దానికి ఎవరు బాధ్యత తీసుకుంటారు అంటూ ధాన్యలక్ష్మీ ప్రశ్నిస్తుంటే.. అందరూ షాకింగ్‌ గా చూస్తుంటారు. రాజ్‌, కావ్య మౌనంగా ఉండిపోతారు. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

Advertisement

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×