E-Paper
Advertisement

Brahmamudi Serial Today February 5th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: డాక్టర్ చక్రవర్తిని విడిపించిన రాజ్

Brahmamudi Serial Today February 5th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: డాక్టర్ చక్రవర్తిని విడిపించిన రాజ్
Advertisement

Brahmamudi serial today Episode:

మినిస్టర్‌ ధర్మేంద్ర భయంగా కారేసుకుని డాక్టర్‌ చక్రవర్తిని దాచిపెట్టిన తన గెస్ట్‌ హౌస్‌కు వెళ్తాడు. అక్కడి తన మనుషులతో డాక్టర్‌ ఎలా ఉన్నాడని అడుగుతాడు. చక్రవర్తి సేఫ్‌గా ఉన్నాడని చెప్తారు వాళ్లు.. దీంతో ధర్మేంద్ర ఆలోచనలో పడిపోతాడు. రాజ్‌ ఎందకు అబద్దం చెప్పాడని ఆలోచిస్తుంటే.. అప్పుడే రాజ్‌ ఫోన్‌ చేస్తాడు. ఏంటి మినిస్టర్‌ గారు నేను రాలేదని ఆలోచిస్తున్నావా? డాక్టర్ దగ్గరికని మీ వైఫ్‌ని తీసుకుని వెళ్తుంటే దారిలో ఒక చిన్న డౌట్ వచ్చింది.. నువ్వు చేసిన తప్పుకి డాక్టర్‌ చక్రవర్తికి సంబంధం ఏం ఉందని అనిపించింది.. అందుకే డాక్టర్‌ని వదిలేసి నీకు సాయం చేసిన నర్స్ నీలవేణి దగ్గరికి వెళితే నాకు కావాల్సిన సాక్ష్యాలు దొరకుతాయి.. అందుకే నీలవేణి దగ్గరికి బయల్దేరాను అని రాజ్‌ చెప్పగానే ధర్మేంద్ర షాక్‌ అవుతాడు. కంగారుగా తానూ హాస్పిటల్‌కు బయల్దేరతాడు.

అయితే రాజ్‌ మాత్రం ధర్మేంద్ర గెస్ట్‌హౌస్ బయట కారులో ఉండే ఇలా నాటకం ఆడతాడు. మినిస్టర్‌ బయటకు వెళ్లడం చూసి రాజ్‌ రౌడీల కంట పడకుండా గెస్ట్‌హౌస్‌ లోపలికి వెళ్లి డాక్టర్‌ చక్రవర్తిని అక్కడి నుంచి తీసుకెళ్లిపోతాడు. మరోవైపు నీలవేణి దగ్గరకు వెళ్లిన మినిస్టర్‌ నీలవేణిని తిడుతుంటాడు. నీకెంత ధైర్యం ఉంటే నాతో ఆటలు ఆడుతున్నావు.. ఆ రాజ్ గాడితో కలిసి నా భార్యకు నిజం చెప్పాలని అనుకుంటున్నావా..? దీంతో నీలవేణి ఏం మాట్లాడుతున్నారు సార్‌ నాకేం అర్థం కావడం లేదు అంటుంది. దీంతో ధర్మేంద్ర మరింత కోపంగా నువ్వు ఆ రాజ్ కావ్యలతో చేతులు కలపలేదా..? అంటాడు దీంతో నీలవేణి భయంగా నేను నోరు తెరిస్తే మీ చేతుల్లో చస్తానని నాకు తెలిసి కూడా ఎలా చెప్తాను సార్‌ అంటుంది నీలవేణి.. దీంతో మినిస్టర్‌ మరి మనం బిడ్డల్ని మార్చిన విషయం.. నీ పేరు ఆ రాజ్‌గాడికి ఎలా తెలిశాయి అంటూ నిలదీస్తాడు.

Advertisement

దీంతో నీలవేణి హాస్పిటల్‌ లో కావ్య తనను బెదిరించి నిజం తెలుసుకున్న విషయం చెప్తుంది నీలవేణి. కావ్య దగ్గర ఎలాంటి సాక్ష్యాలు లేవని వాళ్లు  ఎలా మీ భార్యని నమ్మిస్తారని నీలవేణి ప్రశ్నిస్తుంది. ప్రాణం పోయినా మీకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పను.. అక్కడి దాకా వస్తే నా పిల్లలని తీసుకుని ఈ ఊరు వదిలి వెళ్లిపోతానని అంటుంది నీలవేణి. అప్పుడే రాజ్‌ మళ్లీ ధర్మేంద్రకు కాల్‌ చేస్తాడు. నువ్వు ఎక్కడ తప్పు చేశావో అక్కడికే వెళ్తున్నాం వచ్చి ఆపుకో అంటాడు. దీంతో ధర్మేంద్ర మళ్లీ హాస్పిటల్ కు వెళ్తాడు. ధర్మేంద్ర వెళ్లే సరికి తులసితో డాక్టర్‌ చక్రవర్తి మాట్లూడుతూ ఉంటాడు. అది చూసి ధర్మేంద్ర షాక్‌ అవుతాడు. వెంటనే తులసి చేయి పట్టుకుని వీళ్లు చెప్పేదంతా అబద్ధం.. మనం ఇక్కడి నుంచి వెళ్లిపోదాం పద అనడంతో డాక్టర్‌ చక్రవర్తి ఏంటి సార్‌ అంత కంగారు పడుతున్నారు.. కారు నెట్టుకుంటూ వచ్చారా? బీపీ పెరిగిపోతోందా? అంటాడు. అదేమీ పట్టించుకోకుండా ధర్మేంద్ర తులసిని వెళ్దాం పద అంటూ కంగారు పెడుతుంటాడు. ఇంతలో తులసి డాక్టర్‌ చక్రవర్తిని నాకు డెలివరీ అయ్యాక ఒక్కసారి కూడా ఇంటికి రాలేదు ఎందుకు అంటూ అడగ్గానే.. ధర్మేంద్ర షాక్ అవుతాడు. ఓ సీరియస్ కేసు వస్తే వేరే హాస్పిటల్‌కి నేనే పంపించాను అని ధర్మేంద్ర చెప్తుండగానే.. తులసిని డాక్టర్‌ పిలవగానే.. లోపలికి వెళ్తుంది.

అప్పుడే కావ్య ధర్మేంద్రను తిడుతుంది. ఊపిరి పోసే తల్లి విలువ తెలియదు, ప్రాణాలు నిలబెట్టే డాక్టర్ విలువ తెలియదు నీకు .. నా బిడ్డను నాకు దూరం చేసినప్పుడు నా మనసు ఎంత తల్లడిల్లిందో ఆలోచించారా..? తప్పు నువ్వు చేసి నా ఫ్యామిలీ జోలికి వచ్చావు.. అప్పుడు కూడా నాకు ఇదే భయం కలిగింది, నువ్వు చేసిన దుర్మార్గాన్ని నీ చేతే బయటపెట్టించడానికి మాకు క్షణం కూడా పట్టలేదు. నీకిచ్చిన గడువులోగా నా బిడ్డను నా చేతుల్లో పెట్టాలని ధర్మేంద్రకు వార్నింగ్ ఇస్తుంది కావ్య. రాజ్‌ కూడా  నీ ఇంటి సంతోషం కోసం తప్పు చేశావు.. నీ భార్యకు సర్దిచెప్పుకుని మా బిడ్డను మాకు అప్పగించాలి అంటాడు రాజ్‌.. ఇంతలో డాక్టర్‌ వచ్చి పాప బాడీ ఆపరేషన్‌కు సహకరిస్తుంది అని చెప్పగానే.. అందరూ హ్యాపీగా ఫీలవుతారు. మరోవైపు అప్పుకు డెలివరీ డేట్‌ వచ్చిందని ఇంట్లో స్వీట్లు పంచుతాడు. అంతా సవ్యంగా జరిగితే తిరుపతి కొండకు వస్తానని అపర్ణ మొక్కుకుంటుంది. దీంతో ధాన్యలక్ష్మీ కూడా నేను కొండకు రావడమే కాదు స్వామి కళ్యాణ్‌, రాజ్‌లకు గుండు కొట్టిస్తానని అంటుంది. అందరూ హ్యాపీగా ఉంటారు. తర్వాత రాజ్‌తో కావ్య మినిస్టర్‌ గురించి ఆలోచిస్తుంది. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

Advertisement

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×