E-Paper
Advertisement

Brahmamudi Serial Today February 28th: ‘బ్రహ్మముడి’ సీరియల్: సాక్షి కోసం అప్పు, కావ్య సెర్చింగ్‌ – భోరున విలపిస్తున్న అపర్ణ

Brahmamudi Serial Today February 28th: ‘బ్రహ్మముడి’ సీరియల్: సాక్షి కోసం అప్పు, కావ్య సెర్చింగ్‌ – భోరున విలపిస్తున్న అపర్ణ
Advertisement

Brahmamudi serial today Episode: అప్పును టార్గెట్ చేయడం ఇక ఆపండి మేము ముగ్గురం మిమ్మల్ని టార్గెట్‌ చేస్తే మీ పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా..? అంటూ కావ్య వార్నింగ్‌ ఇవ్వడంతో రుద్రాణి విన్నావా..? అన్నయ్య ఎలా మాట్లాడుతుందో అంటుంది. దీంతో సుభాష్‌ కోపంగా ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఇది కాదు రాజ్‌ను బయటకు ఎలా తీసుకురావాలో ఆలోచించాలి. మనకు ఇంక 24 గంటల టైం మాత్రమే ఉంది. ఆ నేరస్తున్ని ఎలాగైనా పట్టుకోవాలని చెప్పి వెళ్లిపోతాడు.

కావ్య భోజనం తీసుకుని జైలుకు వెళ్తుంది. రాజ్‌ ఆలోచిస్తూ ఉంటే ధైర్యం పోయిందా అని అడుగుతుంది కావ్య. దీంతో నా ధైర్యం నా ముందే కూర్చుంది అని చెప్తాడు రాజ్‌. కావ్య మాత్రం నాకు ఎందుకో ధైర్యం తగ్గుతుంది అని బాధపడుతుంది. దీంతో రాజ్‌ ఏయ్‌ ఇలా బాధపడుతూ నన్ను జీవితాంతం జైల్లోనే కూర్చోబెడతావా ఏంటి.? నేను వెంటనే బయటకు రావాలి. మనం బూత్‌ బంగ్లాకు వెళ్లాలి. పిల్లల్ని కనాలి అంటూ భోజనం చేస్తుంటే.. కావ్య ఏదో గుర్తొచ్చినట్టు ఏవండి మీరు మామూలుగా మీకు తెలిసిన కోణంలో చెప్పారు. అది కాదు. నేరం జరిగిన కోణంలో ఆలోచించాలి.

Advertisement

మనం ఎక్కడో ఏదో వదిలేశామండి.. అదేంటో మీరు గుర్తు తెచ్చుకోవాలి. ఒక్కసారి ఏం జరిగిందో మళ్లీ జ్ఞాపకం తెచ్చుకోండి అని అడగ్గానే.. చెప్పిందే గుర్తు ఉంది కళావతి అంటాడు రాజ్‌. దీంతో అలా కాదండి మీరు కారు ఎక్కడ పెట్టి వెళ్లారు.. అని అడగ్గానే.. బయటే పెట్టి వెళ్లాను అని రాజ్‌ చెప్తాడు. బయటకు రావడానికి ఎంత టైం పట్టింది. అని అడగ్గానే.. ఒక పావుగంట ఇరవై నిమిషాలు అయ్యుండొచ్చు అంటాడు రాజ్‌. దీంతో కావ్య అనుమానంగా సెక్యూరిటీ గార్డు గేటు దగ్గరే ఉన్నారు. సెక్యూరిటీని కాదని డెడ్‌ బాడీని కారులో పెట్టడం అంత ఈజీ కాదు. అయినా అ టైంలో అక్కడు ఎవరైనా అనుమానంగా కనిపించారా..? అని అడుగుతుంది కావ్య. దీంతో రాజ్‌ ఆ రోజు రాత్రి ఫ్యాక్టరీ దగ్గర జరిగింది గుర్తు చేసుకుంటాడు. ఒక తాగుబోతు వచ్చి డబ్బులు అడిగింది గుర్తు చేసుకుంటాడు.

ఇంటికి వచ్చిన కావ్య అప్పు దగ్గరకు వెళ్లి రాజ్‌ చెప్పిన తాగుబోతు గురించి చెప్తుంది. వాడిని పట్టుకుంటే ఏదైనా క్లూ దొరకొచ్చు అంటుంది. దీంతో అప్పు వాడికి నిజం తెలుసో లేదో అప్పుడే ఎలా డిసైడ్‌ అవుతాము అక్కా వాణ్ని పట్టుకుని ఎక్వైరీ చేస్తే తెలుస్తుంది కదా అంటుంది. దీంతో కావ్య దేవుడా వాడికి నిజం తెలిసి ఉండేలా చేయ్‌ సామి అని ప్రార్థిస్తుంది.

Advertisement

ఇంట్లో అందరూ కూర్చుని ఉండగా.. సుభాష్‌ వచ్చి ఇవాళ జడ్జిమెంట్‌ వచ్చే రోజు నువ్వు కోర్టుకు రావా..? అని అపర్ణు అడుగుతాడు. అపర్ణ రావాలనే ఉంది.. కానీ భయంగా ఉంది. తీర్పు ఏమోస్తుందో తెలియదు. ఒకవేళ మనకు అనుకూలంగా రాకపోతే.. వాడికి శిక్ష పడితే అది విని తట్టుకునే శక్తి నాకు లేదు అంటూ బాధపడుతుంది. ఇంతలో రుద్రాణి.. అవును పాపం ఏ తల్లికైనా కొడుక్కి శిక్ష పడుతుందంటే తట్టుకునే శక్తి ఉండదు కదా..? అంటుంది. ఇంతలో ధాన్యలక్ష్మీ.. రాజ్‌ను నిర్దోషిగా నిరూపిస్తామని కావ్య, అప్పు వెళ్లారు. వాళ్లు ఏం సాధిస్తారో తెలియదు. ఆ హంతకుణ్ని నిజంగా పట్టుకుంటారో లేదో తెలియదు. అంతా అయోమయంగా ఉంది అంటూ బాధపడుతుంది.

దీంతో ఇందిరాదేవి కోపంగా అందరూ మంచి జరగాలని కోరుకోండి. న్యాయం జరగాలని కోరుకోండి.. అన్ని వ్యతిరేకంగా మాట్లాడ్డం ఆపండి వీలైతే ఈ కన్నతల్లికి ధైర్యం చెప్పండి లేదంటే నోరు మూసుకుని ఇంట్లోనే కూర్చోండి అంటుంది. సుభాష్‌ మాత్రం అపర్ణను ఓదారుస్తాడు. ఈ ఇంట్లో ఏ సమస్య వచ్చినా అందరికన్నా ఎక్కువగా ధైర్యంగా ఉండేది నువ్వే అలాంటిది నువ్వే నెగటివ్‌గా ఆలోచిస్తే ఎలా కావ్య మీద అప్పు మీద నాకు నమ్మకం ఉంది వాళ్లు సాక్ష్యాలతో కోర్టుకు వస్తారు రా వెళదాం అంటూ అపర్ణను తీసుకుని కోర్టుకు బయలుదేరుతాడు సుభాష్‌.

అప్పు, కావ్య ఇద్దరూ కలిసి క్వాటర్‌ కమలేష్‌ కోసం వెతుకుతుంటారు. అందుకోసం ఇద్దరూ కలిసి బార్ల దగ్గరకు వైన్స్‌ దగ్గరకు వెళ్లి ఎంక్వైరీ చేస్తుంటారు. మరోవైపు కోర్టులో లాయరు రాజ్‌కు ఎలా మాట్లాడాలో చెప్తాడు. కళ్యాణ్‌ దగ్గరకు వెళ్లి అప్పు, కావ్య ఇంకా రాలేదు ఎవరో సాక్షి కోసం వెతుకుతున్నాం అన్నారు వాళ్ళను త్వరగా రమ్మని చెప్పండి అంటాడు.  ఇంతలో జడ్జి రావడంతో కోర్టులో వాదోపవాదాలు మొదలవుతాయి. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

 

ALSO READ: సకల బాధలను దూరం చేసే షణ్ముఖి రుద్రాక్ష ధారణ ఎవరు చేయాలి..?

 

Tags

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×