E-Paper
Advertisement

Brahmamudi Serial Today February 27th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: పెళ్లి చేసుకుని ఇంటికి వచ్చిన రేఖ 

Brahmamudi Serial Today February 27th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: పెళ్లి చేసుకుని ఇంటికి వచ్చిన రేఖ 
Advertisement

Brahmamudi serial today Episode:   

హాస్పిటల్ లో ఏడుస్తూ కూర్చున్న అపర్ణ దగ్గరకు డాక్టర్ వస్తాడు. సుభాష్‌కు ఎలా ఉందని అపర్ణ అడగ్గానే.. ఆయన స్పైన్‌కు ఎక్కువ ఇంజూర్‌ అయిందని ఆయన ఇక లేవలేరు.. ఆయన ఉన్నన్ని రోజులు బెడ్‌ మీదే ఉండాలి అని చెప్పగానే.. అపర్ణ ఏదైనా ఆపరేషన్‌ చేసి ఆయన లేచేలా చేయండి డాక్టర్ అని చెప్పగానే.. చేయోచ్చు కానీ చాన్సెన్స్‌ చాలా తక్కువ అని డాక్టర్ చెప్పగానే.. చేయండి డాక్టర్‌ త్వరగా చేయండి.. ఖర్చు ఎంతైనా పర్వాలేదు డబ్బుల గురించి ఆలోచించొద్దు అని చెప్తుంది అపర్ణ దీంతో మేం ఆలోచించేది డబ్బుల గురించి కాదు మేడం.. పేషెంట్ కండీషన్‌ గురించి ఒక పెద్ద యాక్సిడెంట ‌నుంచి బయట పడ్డాడు ఇమీడియెట్‌గా ఆపరేషన్‌ చేయడం కుదరదు మేడం. కొంత టైం తీసుకుని చేయాలి. ఒకవేళ అలా చేసినా కూడా తిరిగి లేచి నడుస్తాడన్న గ్యారెంటీ లేదు మేడం ఐయామ్‌ సారీ అంటూ వెళ్లిపోతాడు.

డాక్టర్‌ వెళ్లిపోగానే.. అక్కడే ఉన్న దేవుడి విగ్రహం దగ్గరకు వెళ్లి అపర్ణ ఏడుస్తూ.. ఇప్పుడు నువ్వు సంతోషంగా ఉన్నావా..? ఉంటావులే ఎందుకంటే నువ్వు అనుకున్నది పూర్తి చేశావు కదా..? అసలు మేం ఏం తప్పు చేశాము స్వామి ఇంత పెద్ద శిక్ష వేశావు.. మా కుటుంబంలో ఎవ్వరూ కూడా ఇప్పటి వరకు మోసం కానీ ద్రోహం కానీ చేయలేదు.. ఉన్న ఆస్థిని కూడా పేదవాళ్లకు పంచేయాలనుకున్నాం కదా..? అలాంటిది ఇంత అన్యాయం చేయాలని ఎలా అనుకున్నావు నువ్వు. ఒక ఆడది నవమాసాలు మోయడాన్ని కానీ ఒక బిడ్డకు జన్మను ఇవ్వడాన్ని కానీ ఎప్పుడూ కష్టం అనుకోదు. పురిటి నొప్పులను కూడా సంతోషంగా భరిస్తుంది. కానీ కడుపు కోతను మాత్రం భరించలేదు స్వామి. అలాంటిది   కొడుకుకు తలకొరివి పెట్టే దౌర్బ్యాగ్యాన్ని నా నుదుటన ఎందుకు రాశావు.. అంత పాపిస్టి దాన్నా నేను అన్ని పాపాలు చేశానా నేను. దీని కంటే నన్ను చంపేసి ఉండొచ్చు కదా స్వామి.. నన్ను బతికించి ఇంత పెద్ద శిక్ష వేశావేంటి..? ఈ భారాన్ని నేను చచ్చే వరకు ఎలా మోయగలను స్వామి.. అంటూ ఏడుస్తుంటే..

Advertisement

వెనక నుంచి రేఖ వస్తుంది. రేఖను చూసిన అపర్ణ షాక్‌ అవుతుంది.  అన్యాయం చేసింది దేవుడు కాదు అత్తయ్యా.. మా అమ్మ, అన్నయ్య.. ఆస్థి కోసం వాళ్లు ఇంతలా దిగజారిపోతారని అసలు అనుకోలేదు. తన కడుపున పుట్టినందుకు నాకు సిగ్గుగా ఉంది. నాకు తెలుసు అత్తయ్యా దీన్ని జీర్ణించుకోవడం ఎంత కష్టమో.. నాకు తెలుసు అత్తయ్యా మీ గుండెల్లో ఎన్ని అగ్ని పర్వతాలు బద్దలుతున్నాయో.. కానీ ఏం చేయగలం లైఫ్‌ ముందుకు వెళ్లాలి.. కదా..? అత్తయ్యా మిమ్మల్ని నమ్ముకుని ఇద్దరు పిల్లలు ఉన్నారు.. పైకి లేవలేని పరిస్థితుల్లో మామయ్య ఉన్నారు. వాళ్లందరికి  మీరే తోడుగా  ఉండాలి అత్తయ్యా.. మీకు తోడుగా నేను ఉంటాను.. అని చెప్తుంటే.. అపర్ణ కోపంగా ఇంక చాలు ఆపు.. నిన్ను చూస్తుంటే.. మీ అమ్మే గుర్తుకు వస్తుంది. ఆ పసిపిల్లలు ప్రాణాలు కూడా తీద్దాం అనుకుంటున్నావా..? ఇంకొక్క మాట మాట్లాడినా ఇంకొక్క నిమిషం నా కళ్ల ముందు ఉన్నా నిన్ను చంపేస్తాను.. వెళ్లిపో ఇక్కడి నుంచి అంటూ వార్నింగ్‌ ఇచ్చి డాక్టర్‌ దగ్గరకు వెళ్లిపోతుంది.

మరోవైపు జూనియర్‌ స్వరాజ్‌ ను తీసుకెళ్లిన ఫ్యామిలీ హాస్పిటల్‌ లో ట్రీట్‌మెంట్‌ ఇప్పిస్తుంది. రాజ్‌ షాకింగ్‌లో ఉన్నాడని అన్ని మర్చిపోయాడని డాక్టర్‌ చెప్తాడు. మరోవైపు డాక్టర్‌ను కలిసిన అపర్ణకు సుభాష్‌ గురించి చెప్తాడు. తర్వాత రేఖ తనను ప్రేమించి వ్యక్తి దగ్గరకు వెళ్లి తనను పెళ్లి చేసుకోమని అడుగుతుంది. ఈ పరిస్థితుల్లో నిన్ను పెళ్లి చేసుకోడని వాళ్ల అక్క వచ్చి చెప్తుంది. నీ దగ్గర ఆస్థి లేదు.. అని చెప్తారు. దీంతో మీకు కావాల్సిన ఆస్థి నేను ఇస్తాను అని రేఖ చెప్తుంది. ఆ దుగ్గిరాల సామ్రాజ్యాన్ని సొంతం చేసుకోవాలంటే నాకు మీ తోడు కావాలి అని చెప్తుంది. దీంతో ఆ అక్కాతమ్ముళ్లు సరే అంటారు. దీంతో అప్పుడే అక్కడే గుడిలో పెళ్లికి తాను రెడీ అంటుంది రేఖ. కట్‌ చేస్తే దుగ్గిరాల ఇంట్లో అపర్ణ, సుభాష్‌ బాధపడుతూ కూర్చుని ఉంటే రేఖ పెళ్లి చేసుకుని ఇంటికి వస్తుంది. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

Advertisement

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×