E-Paper
Advertisement

Brahmamudi Serial Today February 25th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: బాంబ్ బ్లాస్ట్ లో చనిపోయిన దుగ్గిరాల ఫ్యామిలీ  

Brahmamudi Serial Today February 25th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: బాంబ్ బ్లాస్ట్ లో చనిపోయిన దుగ్గిరాల ఫ్యామిలీ  
Advertisement

Brahmamudi serial today Episode:   

అందరూ కలిసి వ్యానులో శ్రీశైలం వెళ్తుంటారు. వ్యానులో అందరూ సాంగ్స్‌ వేసుకుని డాన్స్‌ చేస్తుంటారు. వాళ్ల వెనకాలే రాహుల్‌, రేఖ, స్వప్న కారులో వెళ్తుంటారు. ఇంతలో కావ్య, అప్పు వ్యాన్‌ ఆపుకుని వెనక వస్తున్న రాహుల్‌ కారు దగ్గరకు వెళ్తారు. రాహుల్‌, రేఖ షాక్‌ అవుతారు. వెంటనే రాహుల్‌ అప్పు ఏమైనా ప్రాబ్లమా అఅని అడుగుతాడు. అప్పు అవును ప్రాబ్లమే అని చెప్పగానే.. రాహుల్‌, రేఖ ఒకరి ముఖం ఒకరు చూసుకుని భయపడతారు. స్వప్న ఆశ్చర్యంగా చూస్తుంటుంది. ఇంతలో రాహుల్‌ ఏంటది ప్రాబ్లమ్‌ అని అడగ్గానే.. మేము అక్కడ ఫుల్ గా ఎంజాయ్‌ చేస్తున్నాము మీరు మాత్రం సపరేట్‌గా వస్తున్నారు అది మాకు అసలు నచ్చడం లేదు అని చెప్పగానే.. రాహుల్ అదా అంటాడు. మరి నువ్వేం అనుకున్నావు..అని అప్పు అడగ్గానే.. రాహుల్ కంగారు పడుతుంటే..

అదే వ్యాన్‌ ఆగే సరికి ఏదైనా ప్రాబ్లమ్‌ అయిందేమో అనుకున్నాం అంతే మా గురించి మీరేం ఆలోచించకండి మీరు వెళ్లి ఫుల్లుగా ఎంజాయ్‌ చేయండి అని రేఖ చెప్పగానే.. అప్పు నీ గురించి ఎవ్వరూ ఆలోచించడం లేదు.. మేము వచ్చింది మా అక్క గురించి అని చెప్పగానే.. పాప ఉంది కదే అని స్వప్న అంటుంది. కావ్య కూడా అదే కాదు పాపను రేఖ చూసుకుంటుందిలే నువ్వు కూడా మాతో రావాల్సిందే.. అంటుంది. దీంతో రాహుల్‌ అది కాదు పాప ఏడుస్తుంది కదా..? అంటాడు. దీంతో కావ్య నువ్వు కూడా పాపకు తండ్రివే కదా ఆ మాత్రం చూసుకోలేవా..? అని చెప్పగానే.. అప్పు మాత్రం బలవంతంగా నువ్వు కారు దిగు అక్కా రాహుల్‌ నువ్వు  పాపను తీసుకో అని చెప్పి స్వప్నను బలవంతంగా తీసుకుని వ్యాన్‌లోకి వెళ్తారు.

Advertisement

రాహుల్‌ కోపంగా చ వీళ్ల చావు వీళ్లు చావకుండా నా పెళ్లాన్ని కూడా తీసుకెళ్లాలా..? అని మనసులో అనుకుంటాడు. ఇంతలో రుద్రాణికి ఫోన్‌ చేస్తాడు. చెప్పు అని రుద్రాణి అడగ్గానే.. మమ్మీ మన ప్లాన్‌ ఆపడం మంచిది అనిపిస్తుంది అని రాహుల్‌ చెప్పగానే.. రుద్రాణి షాక్‌ అవుతుంది. ఏం వాగుతున్నావురా నువ్వు అని అడుగుతుంది. అవును మమ్మీ పెద్ద తప్పు జరగబోతుంది అని రాహుల్‌ చెప్పగానే.. ఏం జరగబోతుంది అని రుద్రాణి అడుగుతుంది. ఆ కావ్య, అప్పు కలిసి వాళ్లు ఎంజాయ్‌ చేయడం కోసం స్వప్నను వ్యాన్‌ ఎక్కించారు మమ్మీ. ఇప్పుడున్న సిచ్యుయేషన్‌లో స్వప్నను తిరిగి తీసుకురాలేను కాబట్టి ఈ ప్లాన్‌ను ఆపడం మంచిది అనిపిస్తుంది మమ్మీ అని చెప్పగానే. రుద్రాణి కోపంగా రేయ్‌ అనుకున్నది అనుకున్నట్టుగానే.. జరుగుతుంది రాహుల్‌.. అని చెప్పగానే.. రాహుల్‌ కోపంగా మమ్మీ అంటే రుద్రాణి కూడా కోపంగా మమ్మీ అంటావేంట్రా..? ఆ స్వప్నను నువ్వేమైనా నిజంగా ప్రేమించి పెళ్లి చేసుకున్నావా ఏంటి…? మొన్నటి వరకు దాన్ని ఎలా వదిలించుకోవాలనే కదా ఆలోచించావు.. మరి ఇప్పుడేంట్రా..? ప్రేమ పొంగిపోతుంది. అనగానే..

నువ్వు చెప్పింది నిజమే మమ్మీ కానీ అనగానే.. చూడు రాహుల్‌ ఇది కాలం మనకు ఇచ్చిన చివరి అవకాశం ఇప్పుడు నువ్వు చేసే ఈ ఒక్క త్యాగంతో నీ తలరాతే మారిపోతుందిరా..? కోట్ల ఆస్థి ఒకవైపు భార్య ఒకవైపు.. ఏది కావాలో నువ్వే తేల్చుకో అని చెప్పగానే.. రాహుల్‌ నాకు డబ్బే ముఖ్యం మమ్మీ ఇంతదూరం వచ్చాక ఇంక ఆలోచించేది ఏమీ లేదు మన ప్లాన్‌ ప్రకారం మనం వెల్తున్నాం అంతే.. అని చెప్పగానే.. రుద్రాణి హ్యపీగా అదీ నా కొడుకంటే.. ఇక నేను నడిపిస్తాను.. దూరంగా ఫాలో అవుతూ జరిగేది చూస్తూ ఉండు అని చెప్పి కాల్‌ కట్‌ చేస్తుంది. మరోవైపు వ్యాన్‌లో అందరూ సాంగ్స్‌ కు డాన్స్‌ చేస్తుంటారు. చీకటి పడుతుంది అందరూ నిద్రలోకి జారుకుంటారు.

Advertisement

ఇంతలో వ్యాన్‌ అనుకున్న చోటికి చేరగానే.. రుద్రాణి రిమోట్‌ నొక్కుతుంది. వ్యాన్‌లో ఉన్న బాంబు పేలుతుంది. వ్యాన్‌ మొత్తం కాలిపోయి అందరూ చెల్లాచెదురుగా పడిపోతారు.. అది చూసి రుద్రాణి హ్యాపీగా ఫీలవుతుంది. ఇంతలో అపర్ణ లేచి ఏడుస్తుంది. ఇంతలో రాహుల్‌ గన్‌ తీసుకుని వచ్చి అపర్ణను కాల్చబోతుంటే. రాజ్‌ వచ్చి అడ్డుపడతాడు.. ఇద్దరి మధ్య పెనుగులాట జరుగుతుంది. పెనుగులాటలో గన్‌ ఫైర్‌ అయి రాహుల్‌ చనిపోతాడు. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×