E-Paper
Advertisement

Brahmamudi Serial Today February 23rd: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: దుగ్గిరాల ఫ్యామిలీని చంపేందుకు రుద్రాణి ఫ్లాన్

Brahmamudi Serial Today February 23rd: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: దుగ్గిరాల ఫ్యామిలీని చంపేందుకు రుద్రాణి ఫ్లాన్
Advertisement

Brahmamudi serial today Episode: 

రేఖ రాహుల్‌ లగేజీ సర్దుకుని కిందకు వస్తారు. తాము ఇంట్లోంచి శాశ్వతంగా వెళ్లిపోతున్నామని చెప్తారు. దీంతో అందరూ షాక్‌ అవుతారు. దీంతో రాజ్‌ మాత్రం దేనికి రాహుల్‌ ఇప్పుడు ఏమైందని అని అడగ్గానే.. రాహుల్‌ జరిగింది చాలు రాజ్‌ ఇక మా అమ్మ ఆగడాలు భరించే ఓపిక మాకు లేదు. ఇంత జరిగాక ఈ ఇంట్లో ఉండే అర్హత మాకు లేదు.. స్వప్న ఇన్నాళ్లు నువ్వు నా వల్ల  ఇబ్బంది పడ్డావు ఇప్పుడు మా అమ్మ చేసిన పనికి నాతో పాటు వీళ్లందరి ముందు నువ్వు కూడా తలదించుకోవాల్సి వచ్చింది. నేను మారాను స్వప్న కానీ మా అమ్మ మారలేదు. చివరకు నీ చెల్లినే చంపాలనుకుంది. వీళ్లందరిని క్షమించమని అడిగే అర్హత నాకు ఎలాగూ లేదు. కనీసం నువ్వైనా క్షమించి నాతో పాటు వస్తే.. ఈ దేవాలయానికి ఇంతటి మంచి మనుషులకు దూరంగా బతుకుదాం నీకు ఇష్టం అయితే నాతో రా స్వప్న అని అడగ్గానే..

రాజ్‌ కోపంగా ఎక్కడికిరా వచ్చేది. ఇప్పుడు మీరు ఇల్లు వదిలి వెళ్లడం వల్ల జరిగిన నష్టం తీరుతుందా..? అని ప్రశ్నించగానే.. రేఖ కూడా బాధపడుతున్నట్లు నటిస్తూ.. కానీ ఇక్కడే ఉంటే మా అమ్మ చేసిన పాపం గుర్తొచ్చినప్పుడల్లా మనసు కకావికలం అవుతుంది బావ అనగానే.. ఇందిరాదేవి కోపంగా చూస్తూ.. తప్పు చేసింది మీ అమ్మ దానికి మీరేం చేస్తారు. దాన్ని మేము శక్షించలేకపోవచ్చు కానీ దానికి దేవుడే ఏదో ఒకరోజు సరైన శిక్ష వేస్తాడు అంటుంది. దీంతో రాహుల్‌ దేవుడు అనేవాడే లేడు అమ్మమ్మ నిజంగా దేవుడే ఉండి ఉంటే అలాంటి తల్లి కడుపున మమ్మల్ని పుట్టించేవాడే కాదు. మా అమ్మ చేసిన పాపానికి మమ్మల్ని బలి చేసేవాడే కాదు అంటాడు. రేఖ కూడా అందుకే తప్పు ఎవరు  చేసినా శిక్ష మేము అనుభవించాలి అనుకుంటున్నాము అమ్మమ్మ అందుకే మేము వెళ్లిపోతాము అమ్మమ్మ అంటూ ఏడుస్తున్నట్టు నటిస్తుంది రేఖ.

Advertisement

ఇంతలో అపర్ణ మీరు ఎక్కడికి వెళ్లక్కర్లేదు.. మీ అమ్మ గురించి అసలు ఆలోచించక్కర్లేదు అంటుంద. కావ్య కూడా అవును రాహుల్‌ నేను ఈ ఇంటికి వచ్చినప్పటి నుంచి నాది ఒక్కటే కోరిక కష్టం వచ్చినా నష్టం వచ్చినా.. మా ముగ్గురు అక్కా చెల్లెళ్లం కలిసే ఉండాలని ఇప్పుడు మా అక్కను తీసుకుని వెళ్లి మా తోబుట్టువులను విడదీస్తావా..? అని అడగ్గానే.. రాహుల్‌ అది కాదు కావ్య అంటూ ఏదో చెప్పబోతుంటే.. రాజ్ కోపంగా ఏది కాదురా..? స్వప్న పాప, రేఖ వీళ్లందరితో వెళ్లిపోయి అయిన వాళ్లకు దూరంగా ఉండి ఎలా బతుకుదామని ఇలాంటి పిచ్చి ఆలోచనలు చేయకండి లోపలికి వెళ్లండి.. అని చెప్పగానే..

ఇందిరాదేవి కల్పించుకుని కానీ మీరు ఒకటి గుర్తుంచుకోవాలి. కలలో కూడా ఇంట్లో మీ అమ్మ పేరు ఎత్తకూడదు.. అర్థం అవుతుందా..? అని చెప్తుంది. కోపంగా ధాన్యలక్ష్మీ కూడా మీ అమ్మ ఎక్కడ ఎలా ఎదురుపడ్డా మీరు కన్నెత్తి చూడకూడదు.. మాట్లాడకూడదు.. అని వార్నింగ్ ఇస్తుంది. దీంతో రేఖ ఇంకా ఆ దుర్మార్గురాలిని చూడటం మాట్లాడటం కూడానా..? అంటుంది. ఇంతలో సుభాష్ జరిగిందేదో జరిగింది. ఇక బారసాలకు ఏర్పాట్లు చేద్దాం అమ్మ అంటాడు. దీంతో ఇందిరాదేవి బారసాల కన్నా ముందు ఇంట్లో హోమం జరిపించాలి ఏమంటావు రాజ్‌ అని అడుగుతుంది. దీంతో సరే నాన్నమ్మ ఈలోపు ట్రస్ట్‌ పనులు చేస్తాము ఒరేయ్‌ రాహుల్ రేఖ లోపలికి వెళ్లండి అని చెప్పగానే.. వాళ్లిద్దరూ లగేజీ తీసుకుని లోపలికి వెళ్తారు..

Advertisement

తర్వాత కావ్యతో రాజ్‌ అందరం కలిసి శ్రీశైలం వెళ్దామని చెప్తాడు. ఇంతమందిమి ఎలా వెళ్లాలని అడుగుతుంది. మిని బస్‌ తీసుకుని వెళ్దామని చెప్తాడు రాజ్‌. సరే అంటూ నవ్వుతుంది కావ్య. మరోవైపు రుద్రాణి, రాహుల్‌, రేఖ కలిసి మాట్లాడుకుంటారు. వాళ్లందరూ ఎంజాయ్‌ చేస్తుంటే.. మేము ఏడుస్తూ చూస్తుండాలి అంటాడు రాహుల్‌. ఫ్యామిలీ అందరూ శ్రీశైలం వెళ్తున్నారని రేఖ చెప్పగానే.. అయితే గుడ్‌ న్యూస్‌ ఇక వాళ్లకు వాళ్లే కైలాసం వెళ్లడానికి మనకు చాన్స్‌ ఇస్తున్నారు ఫ్యామిలీ మొత్తాన్ని చంపేద్దాం అని రుద్రాణి చెప్తుంది. తన ప్లాన్‌ మొత్తం రాహుల్‌, రేఖకు చెప్పి పంపిస్తుంది రుద్రాణి.

మరోవైపు దుగ్గిరాల ట్రస్ట్‌, బారసాల గ్రాండ్‌గా జరుగుతుంటాయి. ట్రస్ట్‌ బాధ్యతలు ముగ్గురు చేతుల మీదుగా జరుగుతుందని ఆ ముగ్గురు మినిస్టర్‌ ధర్మేంద్ర, సత్యమూర్తి, కళావతి అని చెప్తాడు. అందరూ హ్యపీగా ఫీలవుతారు. తర్వాత శ్రీశైలం వెళ్లడానికి వ్యాన్ వచ్చింది వెళ్లి ఆ పనులు చూడు అని చెప్పగానే.. రాహుల్‌, రేఖ వెళ్తారు. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×