E-Paper
Advertisement

Brahmamudi Serial Today February 20th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: అప్పు, కళ్యాణ్ లను చంపేసిన రుద్రాణి 

Brahmamudi Serial Today February 20th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: అప్పు, కళ్యాణ్ లను చంపేసిన రుద్రాణి 
Advertisement

Brahmamudi serial today Episode: 

రూంలో పాపను ఆడిస్తున్న అప్పుకు ఎస్సై ఫోన్‌ చేసి ఆరోజు హాస్పిటల్‌ లో దాడి చేసిన రౌడీలను పట్టున్నాము కదా చాలా రోజులైంది వాళ్లను ఇలాగే ఉంచేస్తే విషయం సీఐ గారికి తెలుస్తుంది ఇప్పుడు ఏం చేద్దాం అని అడుగుతాడు. దీంతో వాళ్ల వెనక ఉన్నది ఎవరో చెప్పారా.? వాళ్లు అని అప్పు అడగ్గానే.. ఎవరో ఒక లేడీ తమకు డబ్బు ఇచ్చారని చెప్పారు కానీ పేరు చెప్పడం లేదు అంటాడు ఎస్సై దీంతో అప్పు అవునా..? అయితే నేను వస్తున్నాను అంటూ కాల్‌ కట్‌ చేస్తుంది. కూచి అంటూ కళ్యాణ్ ను పిలవగానే.. కళ్యాణ్‌ వెటకారంగా అంత సాగదీయకు.. ఆరోజు సగంలో ఆగిపోయిన పని ఇప్పుడు పూర్తి చేయాలి అంటావు అంతేకదా.. అనగానే.. అప్పు.. అవును అదే అంటుంది. దీంతో కళ్యాణ్‌ సరే వెళ్దాం కానీ ముందు మినిస్టర్‌ ఇంటికి వెళ్లి ఆ పని పూర్తి చేసుకుని తిరిగి వచ్చేటప్పుడు అక్కడికి వెళ్దాం అంటాడు.

దీంతో అప్పు అంత సేపు అంటే టైం అయిపోతుంది కూచి నేను ఇలా ఇంత మందిని పోలీస్ గెస్ట్‌హౌస్‌లో పెట్టి ఇన్వెస్టిగేషన్‌ చేస్తున్నానని మా సీఐ గారికి తెలిస్తే ప్రాబ్లమ్‌ అయిపోతుంది అనగానే.. నీ ప్రాబ్లమ్‌ నాకు అర్థం అవుతుంది. కానీ అందరితో కలిసి వస్తామని ఇంట్లో వాళ్లకు చెప్పాము కదా..? ఇప్పుడు వెళ్లకపోతే అమ్మకు డౌటు రాదా..? అంటాడు. దీంతో అప్పు అలుగుతూ.. ఏం నాకోసం ఆ మాత్రం మానేజ్‌ చేయలేవా..? అంటుంది. ముందైతే ఏదోలా మానేజ్‌ చేసేవాడిని కానీ మొన్న కిడ్నాప్‌ జరిగినప్పటి నుంచి మనల్ని బయటకు పంపించాలంటే అమ్మ భయపడుతుంది అంటాడు కళ్యాణ్‌.. దీంతో అప్పు బుంగమూతి పెట్టుకుని ఫ్లీజ్ కూచి అంటూ రిక్వెస్ట్‌ చేస్తుంది. దీంతో కళ్యాణ్‌ ఇంత ముద్దుగా అడిగితే కాదంటానా..? సరే పద అంటూ అప్పును తీసుకుని ధాన్యలక్ష్మీ దగ్గరకు వెళ్తారు.

Advertisement

అందరూ హాల్లో కూర్చుని మాట్లాడుకుంటుంటారు. రాజ్‌, కావ్య, అప్పు, కళ్యాణ్‌ ఇంకా రాలేందేంటని ఎదురుచూస్తుంటారు. అప్పుడే సుభాష్ ఏంటి అపర్ణ మినిస్టర్‌ గారి ఇంటికి వెళ్దామని చెప్పారు వీళ్లు ఇంకా రాలేదేంటి అంటాడు. దీంతో ఇంద్రాదేవి వస్తారు లేరా నీకు ప్రతి దానికి తొందరే.. నా మనవడికి ఏకాంతం దొరక్కా ఎన్నాళ్లయిందో వాళ్లను కూడా అర్థం చేసుకోవాలి కదా…? అనగానే.. ధాన్యలక్ష్మీ కల్పించుకుంటూ.. అత్తయ్యా కాస్త సందు దొరికితే చాలు ఏకాంతం అయస్కాంతం అంటూ అక్కడికే వెళ్తారు కదా..? అంటుంది. అది కాదే పాపను ఈ టైంలో నన్ను ఎత్తుకోమ్మన్నారు అంటే కాస్త డౌటు వచ్చింది అని ఇంద్రాదేవి చెప్తుంటే అప్పుడే రూంలోంచి బయటకు వస్తుంటారు రాజ్‌, కావ్య.. ఇంద్రాదేవి మాటలు విని హలో హలో నాన్నమ్మ నిన్నేం ఎత్తుకోమనలేదు నీకే నీ మునిమనవరాలు ముద్దొచ్చి నవ్వే లాక్కున్నావు నింద మా మీద వేస్తున్నావు అంటాడు. దీంతో ఇంద్రాదేవి అవున్రా ముద్దు వస్తుంద. నా ముని మనవరాలు నాకే కదా ముద్దొస్తుంది. పక్కింటొళ్లకు వస్తుందా..? చూడు నా బంగారు తల్లి నన్ను చూసి ఎలా నవ్వుతుందో.. అంటుంది.

దీంతో ధాన్యలక్ష్మీ  అత్తయ్యా ముని మనవరాలు అంటే ఇదొక్కతే కాదు పైన ఇంకొకతి ఉంది. ఇప్పుడు దిగుతుంది గుర్తు పెట్టుకోండి అంటుంది. దీంతో ఇంద్రాదేవి నవ్వుతూ ధాన్యం అవకాశం దొరికితే వదలవా నువ్వు నాకు అదేంతో ఇది అంతే.. అంటుంది.   ఇంతలో అప్పు, కళ్యాణ్‌ కిందకు వస్తారు. వాళ్లను చూసి అదిగో వస్తుంది నా మనవరాలు అని చెప్తుంది. వాళ్లు కిందకు రాగానే ఏరా కళ్యాణ్‌ మీరు వస్తున్నారుగా ఫంక్షన్‌ కు అని అడగ్గానే.. కళ్యాణ్‌ రావడం లేదు అన్నయ్య.. అప్పు గుడికి వెళ్దాం అంటుంది. నేను సరే అన్నాను.. అనగానే.. సరే వెళ్లి త్వరగా రండి అని చెప్తుంది ధాన్యలక్ష్మీ. వాళ్లు గుడికి వెళ్లగానే.. రాజ్‌, కావ్య అందరూ కలిసి ఫంక్షన్‌కు వెళ్తారు. అది గమనించిన రేఖ వెంటనే రుద్రాణికి ఫోన్‌ చేసి జరిగిన విషయం చెప్తుంది. మరోవైపు రౌడీల దగ్గరకు వెళ్లిన అప్పు వారి నుంచి నిజం రాబడుతుంది. అక్కడి నుంచి వెంటనే మినిస్టర్‌ ఇంటికి వెళ్లి అందరికీ చెప్పాలని బయలుదేరుతుంది.

Advertisement

మరోవైపు మినిస్టర్‌ ఇంట్లో బారసాల ఫంక్షన్‌ గ్రాండ్‌గా జరుగుతుంటుంది. మరోవైపు మినిస్టర్‌ ఇంటికి బయలుదేరిన అప్పు, కళ్యాణ్ ల కారుకు రుద్రాణి యాక్సిడెంట్‌ చేయిస్తుంది. రౌడీ రుద్రాణికి ఫోన్ చేసి అప్పు, కళ్యాణ్‌ చనిపోయారని చెప్తారు. దీంతో రుద్రాణి హ్యాపీగా ఫీలవుతుంది. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×