E-Paper
Advertisement

Brahmamudi Serial Today February 11th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ట్రస్ట్ పెట్టాలని ఆలోచిస్తున్న రాజ్, కావ్య  

Brahmamudi Serial Today February 11th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ట్రస్ట్ పెట్టాలని ఆలోచిస్తున్న రాజ్, కావ్య  
Advertisement

Brahmamudi serial today Episode:

బెడ్‌రూంలో తన పాపతో ఆడుకుంటుంటాడు రాజ్‌. మీ అమ్మ నీ స్థానంలోకి మరోకరు వచ్చారంటే నేను తన వేదనని తెలుసుకోకుండా బాధించాను.. నీ దూరం మీ అమ్మకి భారం అవుతున్నా విభేదించాను. మీ అమ్మ మమకారం ఇప్పుడు నిన్ను నా చేతుల్లోకి రప్పించింది. నేను కళ్లు తెరవడం ఇంకాస్త ఆలస్యమైతే నేను చచ్చే వరకు నీకు క్షమాపణలు చెబుతూనే ఉండేవాడిని అంటాడు. దీంతో కావ్య నవ్వుతుంది. అప్పుడు రాజ్‌..  బిడ్డల్ని మార్చినట్లు నీకొచ్చిన అనుమానం నాకెందుకు రాలేదు కళావతి.. నిన్ను ఎంతో ప్రేమించాను… ఎప్పుడైతే పాప నీ కడుపున పడిందో అప్పటి నుంచి నా ప్రేమ పాప మీదకి వెళ్లిపోయింది. అలాంటిది నా రక్తం పంచుకుని పుట్టిన బిడ్డని ఎందుకు గుర్తుపట్టలేకపోయాను.. బిడ్డ ఊపిరి, వెచ్చదనాన్ని బట్టి ఈ బిడ్డ నాది కాదు అని చెప్పగలిగిన తల్లి మనసుకు అంత గొప్పతనాన్ని ఇచ్చిన దేవుడు… తండ్రిని మాత్రం ఇలాంటి పరిస్థితుల్లో ఉంచేశాడు అంటాడు.

దీంతో కావ్య అదేం లేదండి.. తండ్రికి కూడా బిడ్డ మనసును చూడగలిగే శక్తిని ఇచ్చాడు దేవుడు.. ఏ ఆడపిల్లకైనా అమ్మ కంటే నాన్న అంటేనే ఎంతో ఇష్టం. తండ్రికి అంతకన్నా వరం ఏం కావాలో చెప్పండి.. అంటుంది కావ్య.. ఏదైతేనేమీ నా పాపని ఇలా హత్తుకునే అవకాశం ఇచ్చావు.. నువ్వు లేకపోతే ఏం జరిగేదో థాంక్యూ కళావతి అంటాడు రాజ్‌. కావ్య నవ్వుతుంది. మరోవైపు అప్పు ఆలోచిస్తుంటే.. కళ్యాణ్‌ వెళ్లి ఏంటి పొట్టి ఏం ఆలోచిస్తున్నావు అని అడుగుతాడు. దీంతో అప్పు.. మినిస్టర్‌ తన కూతురిని చంపడానికి మనుషుల్ని పంపించాడు కదా? మరి అలాంటప్పుడు మళ్లీ వెంటనే కాపాడటానికి తనే ఎందుకొచ్చాడు? అని అప్పు అనుమానపడుతుంది. దీంతో కళ్యాణ్‌ తన కూతురిని తనే చంపడం తప్పని బాధపడి ఉంటాడు.. అందుకే వచ్చి సేవ్‌ చేసి ఉంటాడు అని చెప్పగానే..

Advertisement

అప్పు ఇంకా అనుమానంగా  చంపాలనుకున్న మనిషి అంత త్వరగా తన నిర్ణయం మార్చుకోడని.. ఆ మినిస్టర్ వెనుక ఎవరో ఉన్నారు.. కావ్య అక్క జాయిన్ అయిన హాస్పిటల్‌లోనే ఆ మినిస్టర్ వాళ్లు కూడా వచ్చారు.. అది వాళ్ల హాస్పిటలే కాబట్టి అక్కడికి వచ్చారు. మనకి ఆ మినిస్టర్‌కు, అసలు సంబంధం లేదు.. అలాంటప్పుడు కావ్య అక్కకి పుట్టిన బిడ్డను.. వాళ్ల బిడ్డ ప్లేస్‌లో పెట్టాలని ఐడియా ఎలా వచ్చింది? అదే రోజు హాస్పిటల్‌లో ఇంకో ఇద్దరు ఆడపిల్లలు కూడా పుట్టారు? వాళ్లను కాదని.. కావ్య అక్కకు పుట్టిన ఆడపిల్లనే ఎందుకు మార్చారు? ఎవరో మినిస్టర్‌కు సలహా ఇచ్చారు? అంటూ లోతుగా శోధిస్తుంది అప్పు.. కళ్యాణ్ మాత్రం చిరు కోపంగా అయినా ఇప్పుడు ఇవన్నీ ఆలోచించడం ఎందుకు.. మన పాప మన దగ్గరికి వచ్చేసింది కదా అంటాడు. అప్పు మాత్రం మన శత్రువు ఎవరో మనకి తెలియకపోవడం అన్నింటి కంటే ప్రమాదకరమైన విషయం. ఒకవేళ నా అనుమానమే నిజమైతే.. ఆ శత్రువు మనల్ని చీకట్లోనే చూస్తున్నాడు, మనల్ని దెబ్బకొట్టాలని చూస్తున్నాడు. కానీ వాళ్ల గురించి మనకే ఏం తెలియదు అంటుంది. వాళ్లెవరో మనం తెలుసుకోవాలని కళ్యాణ్ ను సాయం చేయమని అడుగుతుంది. కళ్యాన్‌ సరే అంటాడు.

తర్వాత రాజ్‌, కావ్యలు పాపను ఆడిస్తూ ఉంటే అక్కడే రూం క్లీన్ చేస్తున్న పనిమనిషి శాంత ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తున్నావని అడిగితే తన బిడ్డకు హెల్త్ బాగా లేదని హాస్పిటల్‌ లో ఉందని ట్రీట్‌మెంట్‌ కోసం 4 లక్షలు కావాలంటున్నారని.. అంత డబ్బు తన దగ్గర లేదని రాజ్‌, కావ్యలే సాయం చేయాలని అడుగుతుంది. దీంతో రాజ్‌, కావ్య ఇద్దరూ శాంతను ఓదార్చి హాస్పిటల్‌  టీట్‌మెంట్ చేయిస్తామని చెప్తారు. శాంత హ్యాపీగా వెళ్లిపోతుంది. శాంత వెళ్లిపోయాక అలాంటి వాళ్లు ఎంతో మంది ఉంటారని వాళ్లందరికీ సాయం చేయాలంటే మనం ఒక ట్రస్ట్‌ పెడదామని కావ్య చెప్తుంది. అయితే ఇంట్లో వాళ్లను అడిగి నిర్ణయం తీసుకుందామని రాజ్‌ చెప్తాడు.

Advertisement

మరోవైపు ధర్మేంద్ర ఇంటికి రుద్రాణి వెళ్తుంది. రుద్రాణిని కోపంగా ధర్మేంద్ర తిడతాడు. దీంతో రుద్రాణి తాను రాజ్‌కు మేనత్తను అని చెప్పగానే.. దర్మేంద్ర షాక్‌ అవుతాడు. తను చేసిన పని తెలిసి తన పిల్లలు తనను అసహ్యించుకుంటున్నారని ఇప్పుడు ఇంట్లో వాళ్లకు నా గురించి నిజం చెప్పొద్దు అంటూ బతిమాలుతుంది రుద్రాణి. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×