E-Paper
Advertisement

Brahmamudi Serial Today Fabruary 6th: ‘బ్రహ్మముడి’ సీరియల్:  స్వప్నకు పాప పుడుతుంది –  బాబు పుట్టలేదని తిడుతుంది రుద్రాణి  

Brahmamudi Serial Today Fabruary 6th: ‘బ్రహ్మముడి’ సీరియల్:  స్వప్నకు పాప పుడుతుంది –  బాబు పుట్టలేదని తిడుతుంది రుద్రాణి  
Advertisement

Brahmamudi serial today Episode: స్వప్నకు ఆడపిల్ల పుట్టిందని కావ్యకు అపర్ణ ఫోన్‌ చేసి చెప్తుంది. కావ్య హ్యాపీగా ఫీలవుతూ రాజ్‌కు విషయం చెప్తుంది. దీంతో రాజ్‌, కావ్య సంతోషిస్తారు. అందరూ హాస్పిటల్‌ నుంచి ఇంటికి వస్తారు. ఇందిరాదేవి సంతోషంగా ఈ తరం నుంచి ఈ ఇంట్లో అడుగుపెట్టిన మొట్టమొదటి బిడ్డ సాక్ష్యాత్తు లక్ష్మీదేవి ఇంటికి వచ్చినట్టు అనిపిస్తుందిరా..? అంటుంది. ఇంతలో ధాన్యలక్ష్మీ పోనీలేండి కనీసం ఈ లక్ష్మీదేవి ఇంటికి రావడంతోనైనా మన సమస్యలు అన్ని తీరిపోయి ఎవరి ఆస్థి వాళ్లకు వస్తే చాలా సంతోషం అంటుంది. ప్రకాష్‌ కోపంగా ఇలాంటి సమయంలో కూడా నీ ఆస్థి గొడవలు ఏంటే..? కాస్త ఆపుతావా..? అంటాడు. ఇందులో తప్పేముంది.

అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. కాకపోతే మన ఆస్థి మనకు ఇస్తే ఇంకా బాగుండని కోరుకుంటున్నాను అని చెప్తుంది ధాన్యం. అపర్ణ ఇరిటేటింగ్‌గా చాల్లే ఆపు ఎప్పుడు చూసినా ఆస్థి ఆస్థి అనడమేనా..? అంటుంది. దీంతో రుద్రాణి.. మనిషి బతకాలంటే ఆయుష్షు ఎంత ముఖ్యమో ఆస్థి కూడా అంతే కదా వదిన అంటుంది. ఇలా రెచ్చగొట్టే ధాన్యలక్ష్మీని పూర్తిగా మార్చేశావు అంటాడు సుభాష్‌. నేనేం చిన్నపిల్లను కాదు బావగారు ఒకరు నేర్పిస్తే నేర్చుకోవడానికి అంటుంది ధాన్యలక్ష్మీ. ఇంతలో డాక్టర్‌ హాస్పిటల్‌ నుంచి ఫోన్‌ చేసి సీతారామయ్య కోమాలోంచి బయటకు వచ్చారని చెప్తాడు. అందరూ హ్యాపీగా ఫీలవుతారు. రుద్రాణి మాత్రం చచ్చాడనుకుంటే మళ్లీ బతికాడా..? అని మనసులో అనుకుంటుంది.

Advertisement

అందరూ హాస్పిటల్‌కు వెళ్లి సీతారామయ్యను పలకరిస్తారు. ఇందిరాదేవి ఏమోషనల్‌గా నన్ను వదిలి వెళ్లిపోవాలనుకున్నావా బావా అంటూ బాధపడుతుంది.  నీ నుంచి నన్ను దూరం చేయడానికి ఆ దేవుడికి కూడా ఇష్టం లేదనుకుంటా.. అందుకే చివరి నిమిషంలో మనసు మార్చుకుని తిరిగి నీ దగ్గరకే పంపాడు. నీ పూజలు వ్రతాలే నన్ను కాపాడాయి. లేదు బావ నువ్వు చేసిన మంచే నిన్ను కాపాడింది. కష్టమన్న ప్రతి ఒక్కరికి సాయం చేశావు అదే నిన్ను ఇవాళ రక్షించింది అంటుంది ఇందిరాదేవి.

దీంతో సీతారామయ్య తిడితే తిట్టించుకుంటావు. మంచి చేశావు అని చెప్తే మాత్రం తీసుకోవు ఎందుకు అంటాడు. ఇంతలో కావ్య మీ తాళి చాలా గట్టిది అమ్మమ్మ గారు.. మిమ్మల్ని వదిలి తాతయ్యగారు ఎక్కడికి పోరు అంటుంది. ఆ నమ్మకంతోనే ఎదురుచూస్తున్నాను కావ్య. నేను సుమంగళిగా ఆయన ఒడిలో తల పెట్టుకుని కన్నుమూయడమే నా కోరిక అంటుంది. దీంతో రాజ్‌ ఏంటి నాన్నమ్మా ఇప్పుడే తాతయ్యకు పునర్జన్మ వచ్చింది అప్పుడే మళ్లీ నువ్వు చావు అంటావేంటి..? మీరిద్దరూ నిండూ నూరేళ్లు మేడ్‌ ఫర్‌ ఈచ్‌ అదర్‌ లా ఉంటారు అని చెప్తాడు.

Advertisement

కనకం ఇంట్లో పని చేస్తుంటే.. పోలీస్‌ యూనిఫామ్‌లో వచ్చిన అప్పు హాండ్స్‌ అప్‌ అంటుంది. దీంతో కనకం భయపడుతుంటే.. భయంతో వణికిపోతుంది. ఇంతలో మూర్తి వచ్చి ఏంటే కన్నకూతురిని కూడా గుర్తుపట్టలేకపోయావా..? నీకు ఈ మధ్య చూపు బాగా మందగించింది అంటాడు.. దీంతో కనకం కన్నకూతురా..? అంటూ కన్పూజ్‌గా చూస్తుంది. ఇంతలో కళ్యాణ్‌ వచ్చి అవును అత్తయ్యా మీ ఎదురుగా ఉన్నది మీ కూతురు అప్పునే అంటాడు. అప్పునా..? అంటూ చూసిన కనకం కోపంగా లోపలికి వెళ్లి చీపురు తీసుకుని వచ్చి నన్నే భయపెట్టిస్తావా..? అంటూ కొట్టబోతుంది. అప్పు మూర్తి వెనకకు వెళ్లి చూడు నాన్నా కన్నకూతురిని కూడా గుర్తుపట్టలేని తల్లి ఆ కూతురినే కొడుతుంది. చూడమ్మా నేను ఇప్పుడు పోలీస్‌ను ఎవరైనా పోలీస్‌ మీద చేయి వేస్తే అరెస్ట్‌ చేస్తాము అంటుంది. తర్వాత మూర్తి గర్వంగా అప్పును చూస్తూ.. చాలా సంతోషంగా ఉందిరా అంటాడు. కనకం కూడా ఏడుస్తూ ఎమోషనల్‌ అవుతుంది. ఏంటలా చూస్తున్నావు.. నిజంగానే పోలీస్‌ అయ్యాను.. ఇదేం కిరాయి డ్రెస్‌ కాదు అంటుంది.

అప్పు నువ్వు చెప్పేది నిజమేనా.. అంటుంది కనకం. కళ్యాణ్‌ కూడా అవును అత్తయ్య పరీక్ష రాసి పోలీస్‌ ట్రైనింగ్‌ కూడా పూర్తి చేసుకుని ఈ ఊరికే ఎస్సైగా వచ్చింది అని చెప్తాడు. దీంతో కనకం సంతోషంగా కిచెన్‌లోకి వెళ్లి పంచదార తీసుకొచ్చి అప్పు, కళ్యాణ్‌ నోట్లో వేస్తుంది. ఇళ్లంతా హడావిడి చేస్తుంది కనకం. మా అప్పుకు భర్తగా దొరకడం అది ఎప్పుడో చేసుకున్న పుణ్యం బాబు. పెళ్లైపోయిన తర్వాత కూడా భార్య ఇష్టాలు తెలుసుకుని తనను ఆ గమ్యం వైపు నడిపించడం అందరూ చేయరు. తనకు పెళ్లి అయ్యాక తన కల.. కలగానే మిగిలిపోతుందేమోనని మొదట్లో మేము భయపడ్డాం అంటూ ఏడుస్తూ ఏమోషనల్‌ అవుతుంది. ఇంతకీ ఈ విషయం మీ ఇంట్లో చెప్పారా..? అని అడుగుతాడు మూర్తి. చెప్పలేదని కళ్యాణ్‌ చెప్పడంతో ముందు మీరు వెళ్లి మీ అమ్మా నాన్నల ఆశీర్వాదం తీసుకోండి అని చెప్తుంది. సరే అంటూ వెళ్లిపోతారు అప్పు, కళ్యాణ్‌.

పాపను ఒడిలో పెట్టుకున్న ఇందిరాదేవి.. నా బుజ్జి కొండ ఇంట్లో అడుగుపెట్టగానే.. మా బావను స్పృహలోకి తీసుకొచ్చింది. నీవు ఎంత అడిగినా తక్కువేనే.. నీకు మాటలు రాగానే నువ్వేం అడిగినా ఇచ్చేస్తా అంటుంది. ఆలోచించి ఆఫర్లు ఇవ్వండి అమ్మమ్మ గారు అది  నా కూతురు ఏమైనా అడగొచ్చు.. మా బావ ప్రాణం కంటే నాకు ఏదీ ఎక్కువ కాదే ఇది అడగాలే కానీ నా ప్రాణం కూడా ఇచ్చేస్తాను అంటుంది ఇందిరాదేవి. ఇంతలో రుద్రాణి.. ప్రాణాలు ఎందుకులే అమ్మా.. నువ్వు నిండు నూరేళ్లు ఉండు.. కానీ మా ఆస్తి మాకు ఇచ్చేయ్‌ అంటుంది.

సరే ఇది పెద్దయ్యాక మాటలు వచ్చాక ఇది ఆస్థి అడిగాక ఇచ్చేస్తా  అంటుంది ఇందిరాదేవి. అయితే అంతవరకు మేము ఇలాగే ఉండాలా..? అంటుంది రుద్రాణి. అత్తయ్యగారు సరదాగా అన్నారులే రుద్రాణి.. మూడు నెలలు పూర్తయ్యాక రాజ్‌ చెప్తా అన్నారు కదా..? అంటుంది ధాన్యలక్ష్మీ. దీంతో ఇద్దరినీ ఇందిరాదేవి తిడుతుంది. రేపే పాపకు బారసాల చేయించాలని చెప్తుంది.  ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

 

ALSO READ: సకల బాధలను దూరం చేసే షణ్ముఖి రుద్రాక్ష ధారణ ఎవరు చేయాలి..?

Tags

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×