E-Paper
Advertisement

Brahmamudi Serial Today December 9th: ‘బ్రహ్మముడి’ సీరియల్: ఇంట్లోంచి వెళ్లిపోయిన ఇందిరాదేవి – అప్పు గురించి ఆరా తీసిన కావ్య

Brahmamudi Serial Today December 9th: ‘బ్రహ్మముడి’ సీరియల్: ఇంట్లోంచి వెళ్లిపోయిన ఇందిరాదేవి – అప్పు గురించి ఆరా తీసిన కావ్య
Advertisement

Brahmamudi serial today Episode:  డైనింగ్‌ టేబుల్‌ దగ్గర ఆస్తుల పంపకాల కోసం పట్టుబట్టిన రుద్రాణి, ధాన్యలక్ష్మీలను అందరూ తిడతారు. దీంతో ధాన్యలక్ష్మీ అందరూ కలిసి నా నోరు నొక్కేయాలని చూస్తున్నారా..? ఆస్థులు పంచకుండా దాటవేయాలని చూస్తున్నారా..? అని అడుగుతుంది. దీంతో ఇందిరాదేవి కోపంగా ఆపండి ఎవరు మీరంతా.. ఇన్నాళ్లు ఈ ఇంట్లో ఉన్నవాళ్లేనా..? ఎలాంటి కుటుంబంలో ఎలాంటి వాళ్లు తయారయ్యారు. ఇంటి పెద్దకు ఆపదొస్తే ఎలా బతికించుకోవాలా అని ఆరాటపడతారు.

ఆయనుక ఏదైనా అయితే ఆస్థులు ఎలా దక్కించుకోవాలా అని ఆలోచిస్తారా..? ఉమ్మడి కుటుంబంలో ఉండాల్ని వారేనా మీరు…? ఇవాళ నాకు ఇంత కష్టం వస్తే ఓదార్చడం పోయి కనీసం భోజనం కూడా చేయకుండా చేస్తున్నారు.. అంటూ బాధపడుతుంది ఇందిరాదేవి. నువ్వు ఆస్థుల గురించి మాట్లాడుతున్నావా..? ధాన్యలక్ష్మీ అంటూ భోజనం చేయకుండా వెళ్లిపోతుంది ఇందిరాదేవి.

Advertisement

తర్వాత కావ్య భోజనం రెడీ చేస్తుంటే అపర్ణ వచ్చి భోజనం ఎవరి కోసం తీసుకెళ్తున్నావు అని అడుగుతుంది. అమ్మమ్మ గారి కోసం తీసుకెళ్తున్నాను అని ఉదయం కూడా తినలేదని ఇప్పుడు కూడా తినకుండా టాబ్లెట్స్‌ వేసుకోకపోతే బీపీ డౌన్‌ అవుతుంది. అంటూ కావ్య చెప్పగానే సరే అయిత పద నేను వస్తాను అంటూ ఇద్దరూ కలిసి ఇందిరాదేవి రూంలోకి వెళ్తారు. అక్కడ ఇందిరాదేవి ఉండదు. ఇద్దరూ షాక్‌ అవుతారు. అమ్మమ్మ గారు ఓదార్పు కోసం తాతయ్యగారి దగ్గరకు వెళ్లి ఉంటుందని చెప్తుంది.

హాస్పిటల్లో సీతారామయ్య దగ్గర కూర్చుని బాధపడుతుంది. ఏంటి బావ ఇది ఇలా ఉలుకు పలుకూ లేకుండా ఇలా పడుకున్నావు. లేవు బావ కళ్లు తెరువు నీ చిట్టితో మాట్లాడు.. నువ్వు బాగున్నావు అని చెప్పు.. అంటూ ఏడుస్తుంది. ఇంతలో కళ్యాణ్‌ వస్తాడు. తాతయ్యకు ఏం కాదు నాన్నమ్మ.. తొందరలోనే కళ్లు తెరచి మనందరిని చిరునవ్వుతో పలకరిస్తాడు. మన ఇంట్లో హుషారుగా తిరుగుతారు. అందరితో కలిసి భోజనం చేస్తారు అని కళ్యాణ్‌ చెప్పగానే ఆ ఆశలు చచ్చిపోయాయి కళ్యాణ్‌. ఆ ఇంట్లో ఆనందపు ఆనవాళ్లు లేకుండా పోయాయి. మనవాళ్లు అనుకున్న వాళ్లంతా కాకుండా పోయారు. ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. ఇన్నేళ్లు ఆ ఇంటి పరువు ప్రతిష్టలను గుప్పిట్లో పెట్టుకుని కాపాడుకుంటూ వచ్చారు.

Advertisement

కానీ పచ్చగా పెరిగే చెట్టుకు చెదలు పట్టినట్టు కుళ్లు కుతంత్రం అనే చెదలు ఆ ఇంటికి పట్టింది. అంటూ బాధపడుతుంది. అలా అనకు నాన్నమ్మ అన్ని రోజులు ఒకేలా ఉండవు కదా..? మనుక మంచి రోజులు వస్తాయి. అని కళ్యాణ్‌ చెప్పగానే.. అది కలలో కూడా జరిగే అవకాశం లేదురా.. అంటూ ఇందిరాదేవి చెప్పగానే అందుకని ఇలా ఎవ్వరికీ చెప్పకుండా ఇలా వచ్చేస్తే ఎలా అమ్మమ్మ అంటూ కావ్య వస్తుంది. ఇంట్లో వాల్లు గొడవ పడ్డారు. ఏదో మాటమాట అనుకున్నారు. కానీ మీరు ఇలా వచ్చేస్తే ఎలా..? మీరు కనిపించకపోయే సరికి ఎంత కంగారు పడ్డానో తెలుసా..? అంటూ కావ్య అడగ్గానే..ఇందిరాదేవి ఏడుస్తుంది. తర్వాత కావ్య.. ఇందిరాదేవికి అన్నం తినిపిస్తుంది.

ఐసీయూలోంచి బయటకు వచ్చిన కావ్య, కళ్యాణ్‌ను తాతయ్యగారి గురించి డాక్టర్లు ఏమన్నారు అని అడుగుతుంది. దీంతో డాక్టర్లు తమ చేతుల్లో ఏమీ లేదని చెప్పారు వదిన. రోజులు, నెలలు, సంవత్సరాలు అంటూ ఒక్కో పేషెంట్‌ ఒక్కో టైంలో స్పృహలోకి వస్తారంట అని కళ్యాణ్‌ చెప్పగానే కావ్య బాధపడుతుంది. నిస్సహాయ స్థితిలో అమ్మమ్మ గారిని.. నిశ్చల స్థితిలో తాతయ్యగారిని చూస్తుంటే ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు అంటూ ఇంతకీ అప్పు ఎక్కడ అని అడగ్గానే తను ఎస్సై సెలెక్షన్‌లో సెలెక్ట్‌ అయింది. ట్రైనింగ్‌ కు రమ్మని లెటర్‌ వచ్చింది అందుకే ట్రైనింగ్‌కు వెళ్లింది అని కళ్యాణ్‌ చెప్పగానే అప్పుకు తాతయ్యకు ఇలా జరిగిందని చెప్పారా..? అని కావ్య అడగ్గానే చెప్పలేదని తెలిస్తే తను టెన్షన్‌ పడుతుందని చెప్పలేదు అంటాడు.

బెడ్‌రూంలో బాండ్‌పేపర్స్‌ చదువుతూ ఉంటే ప్రకాష్‌ వచ్చి పేపర్స్‌ లాక్కుని చూసి పేపర్స్‌ చించివేస్తాడు. నీకు డబ్బు పిచ్చి పట్టిందే అంటూ తిడతాడు. దీంతో అవతల మామయ్యగారు రేపో మాపో అన్నట్లు ఉన్నారు. అందుకే అత్తయ్యగారిని అడిగి రాయించుకుంటే ఏంటి? అని ప్రశ్నిస్తుంది. దీంతో ప్రకాష్‌ కోపంగా ధాన్యలక్ష్మీని తిట్టి వెళ్లిపోతాడు. ధాన్యలక్ష్మీ మాత్రం నేను చేయాలనుకున్నది చేస్తాను అనుకుంటుంది. కిచెన్‌ లో పడుకున్న కావ్య దగ్గరకు అపర్ణ వస్తుంది.

నువ్వేంటి ఈ ఇంట్లో నీ స్థానమేంటి అసలు ఎందుకు ఇక్కడ పడుకున్నావు వాడు రావొద్దన్నాడా..? తలుపు వేసుకున్నాడా..? అసలు నువ్వు గదికే వెళ్లలేదా..? అని అడుగుతుంది. కావ్య తాను వెళ్లలేదని.. ఆయన పిలవకుండా నేను ఆ గదిలోకి ఎలా వెళ్లాలి అంటుంది. హాల్లోకి వెళ్లిన అపర్ణ రాజ్‌ను పిలిచి కావ్య ఇంత రాత్రి అయినా నీ గదికి రాకపోతే ఎక్కడికి వెళ్లింది అని ఆరా తీసే బాధ్యత నీకు లేదా..? అంటూ నిలదీస్తుంది. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

 

ALSO READ: సకల బాధలను దూరం చేసే షణ్ముఖి రుద్రాక్ష ధారణ ఎవరు చేయాలి..?

 

Tags

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×