E-Paper
Advertisement

Brahmamudi Serial Today December 5th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రాజ్, కావ్యలను బెదిరించిన రౌడీలు

Brahmamudi Serial Today December 5th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రాజ్, కావ్యలను బెదిరించిన రౌడీలు
Advertisement

Brahmamudi serial today Episode:  

కేరళ లో ట్రీట్‌మెంట్‌ కోసం వెళ్లిన రాజ్‌, కావ్యల కారుకు ఎదురుగా ఒక వ్యక్తి దెబ్బలతో వచ్చి పడతాడు. రాజ్‌, కావ్య కారు దిగి కిందకు వచ్చి అతన్ని పలకరిస్తారు. ఎవరు నువ్వు.. ఎవరు నిన్ను కొట్టింది అని అడుగుతుంటాడు.. ఆ వ్యక్తి ఏదో చెప్పబోతుంటాడు. ఇంతలో రాజ్‌ కావ్యను వాటర్‌ తీసుకురమ్మని చెప్తాడు. కావ్య కారు దగ్గరకు వెళ్లి వాటర్‌ తీసుకొస్తుంటే.. రాజ్‌ కావ్య వైపు చూస్తుంటాడు. ఆ వ్యక్తి ఒక పెన్‌డ్రైవ్‌ రాజ్‌ జేబులో పెట్టి చనిపోతాడు. రాజ్, కావ్య కంగారు పడతారు. రాజ్‌ టెన్షన్‌గా కళావతి మనం వెంటనే రిసార్ట్‌కు వెళ్దాం పద అని చెప్పగానే.. ఏవండి మరి ఈ బాడీ అని కావ్య అడగ్గానే.. ఏయ్‌ ఇది తీసుకుని వెళ్తామా ఏంటి..? ఎవడో ఏంటో వదిలేసి వెళ్లిపోవడమే.. అని చెప్పగానే..

ఆ వ్యక్తిని తరుముతూ వచ్చిన ఇద్దరు వ్యక్తులు రాజ్‌ దగ్గరకు వస్తారు. హలో వదిలేసి వెళ్లడానికి అది పచ్చడి పెట్టుకునే జాడీ అనుకున్నారా..? పచ్చడి అయిపోయిన బాడీ అనగానే.. రాజ్‌ కోపంగా మీరెవరు..? ఇతను మీకు తెలుసా..? ఎవరు చంపారు.. అని అడుగుతాడు. కావ్య కూడా ఇతని పేరేంటి..? అసలు ఏమైందండి అని అడుగుతుంది. ఏంటి అలా చూస్తున్నారు మీరేనా ఇతన్ని కొట్టింది అని రాజ్‌ అడగ్గానే.. ఆ వ్యక్తి చూడండి ప్రశ్నించాల్సింది మేము మీరు కాదు అనగానే.. వాడు గుద్దింది మా కారును అంటాడు రాజ్‌. దీంతో వాడు మీకేం చెప్పాడు చెప్పండి అంటూ ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది. ఇంతలో కావ్య, రాజ్‌ అక్కడి నుంచి తప్పించుకుని వెళ్లిపోతారు.

Advertisement

మరోవైపు దొంగచాటుగా రాత్రికి ఇంటికి వచ్చిన అప్పు, కళ్యాణ్‌ లను చూస్తుంది ధాన్యలక్ష్మీ. కోపంగా ఇద్దరిని ఆగండి అని అరుస్తుంది. ధాన్యలక్ష్మీని చూసిన కళ్యాణ్‌, అప్పు షాక్‌ అవుతారు. ఇంతలో కళ్యాణ్‌ అమ్మా ఏంటి..? ఇంకా నువ్వు పడుకోలేదా..? అని అడుగ్గానే.. ఇప్పటి దాకా పడుకోకపోతే మీ ఆరోగ్యం ఏమవుతుంది అత్తయ్య.. అంటుంది అప్పు. దీంతో ధాన్యలక్ష్మీ కోపంగా నా ఆరోగ్యానికి ఏం కాదు కానీ నీ ఆరోగ్యం సంగతేంటి..? అని అడగ్గానే.. కళ్యాణ్‌  నవ్వుతూ తన ఆరోగ్యం సంగతేంటి అమ్మ గుండ్రాయిలా ఉంటేనూ.. అని చెప్పగానే.. గుండ్రాయిలా ఉంటే మరి హాస్పిటల్‌కు ఎందుకు వెళ్లారు అని ధాన్యలక్ష్మీ అడుగుతుంది.

దీంతో కళ్యాణ్‌ తడబడుతూ.. అవును అమ్మ నిన్నటి వరకు పొట్టి ఆరోగ్యం గుండ్రాయిలా ఉండేది. కానీ ఇవాళే  కాస్త ఇబ్బంది పెట్టింది అందుకే హాస్పిటల్‌కు వెళ్లాం అని కళ్యాణ్‌ చెప్పగానే.. హాస్పిటల్‌కు వెళ్లారు సరే మరి ఇంత లేట్‌ ఎందుకు అయింది అని అడుగుతుంది ధాన్యలక్ష్మీ. ఎంతయింది జస్ట్‌ ఎనిమిదే కదా అమ్మా అంటాడు కళ్యాణ్‌. గోడకున్న వాచ్‌ చూస్తుంది ధాన్యలక్ష్మీ అందులో పది అవుతుంటుంది. దీంతో కళ్యాణ్‌ ఏదేదో చెప్తుంటాడు. ఇంతలో ప్రకాష్‌ వచ్చి ఆ వాచ్‌ తప్పు ఉంది.. దాన్ని మార్చేస్తాను అంటాడు. దీంతో ధాన్యలక్ష్మీ కోపంగా నేను మిమ్మల్ని మార్చేస్తాను అంటుంది. ప్రకాష్‌ సైలెంట్‌ అయిపోతాడు.

Advertisement

రిసార్ట్‌ లో కూర్చున్న కావ్య ఆలోచిస్తుంది. రాజ్‌ డాక్టర్‌ చెప్పిన కషాయాలు తీసుకుని వచ్చి ఏంటి శ్రీమతి గారు ఏంటో తీవ్రంగా ఆలోచిస్తున్నారు అని అడగ్గానే అదేనండి ఇందాకా ఎవరో వచ్చి మన కారుకు గుద్దు కోవడం ఏంటి… అంతలో అని కావ్య ఏదో చెప్పబోతుంటే.. రాజ్‌ కల్పించుకుని ఏయ్‌ కళావతి ఏంటా మాటలు వాడు మన కారుకు గుద్దుకోలేదు. కారు దగ్గరకు వచ్చి పడిపోయాడు. అని రాజ్‌ చెప్పగానే.. అదేనండి చూస్తుండగానే ప్రాణం పోయింది. మనం వచ్చింది దేనికి.. అలా జరగడం ఏంటి అని తలుచుకుంటేనే భయం వేస్తుందండి అంటుంది కావ్య. కళావతి ఇంకా ఆ విషయమే ఆలోచిస్తున్నావా..? నువ్వు అని రాజ్‌ అడగ్గానే..

అలోచించకుండా ఎలా ఉండగలం అండి వాళ్లేదో రౌడీలా ఉన్నారు. మన దగ్గరకు వచ్చి మనల్నే ప్రశ్నించారు కాస్తలో కాస్త తప్పించుకున్నాము అని కావ్య చెప్పగానే.. అబ్బా కళావతి అలా మాట్లాడకు మనం ఏమైనా తప్పు చేశామా..? తప్పించుకోవడానికి అయినా మనం వచ్చింది వైద్యం చేయించుకోవడానికి వైద్యం చేయించుకుని హైదరాబాద్‌ వెళ్లిపోవాలి. అనవసరమైన విషయాల మీద ఫోకస్‌ పెట్టొద్దు.. ఇదిగో ఈ కషాయం తాగు అని ఇవ్వగానే.. అది తాగిన కావ్య వాంప్టింగ్‌ చేసుకుంటూ ఇది చేదుగా ఉందండి అంటుంది. కషాయం అన్నాక చేదుగానే ఉంటుంది అంటూ రాజ్‌ బలవంతంగా కావ్యకు కషాయం తాగిస్తాడు. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×