E-Paper
Advertisement

Brahmamudi Serial Today December 3rd: ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రుద్రాణికి క్లారిటీ ఇచ్చిన రాహుల్

Brahmamudi Serial Today December 3rd: ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రుద్రాణికి క్లారిటీ ఇచ్చిన రాహుల్
Advertisement

Brahmamudi serial today Episode:  

పాప కిడ్నాప్‌ కేసుకు సంబంధించిన పోస్ట్‌మార్టం రిపోర్టు తనకు వాట్సాప్‌ చేయమని స్టేషన్‌లో కానిస్టేబుల్‌కు కాల్ చేసి చెప్తుంది అప్పు. ఇంతలో అక్కడికి వచ్చిన కళ్యాణ్‌ ఏం చేస్తున్నావు పొట్టి అని అడగ్గానే.. వన్‌ ఇయర్‌ గా మా పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌ వాళ్లు చేసిన ఇన్వెస్టిగేషన్‌ రిపోర్టు మొత్తం చదువుతున్నాను కూచి అని చెప్పగానే.. కళ్యాణ్‌ టైం ఎంత అయిందో తెలుసా..? అని అడగ్గానే.. ఏం మా అత్తయ్య నీకు చిన్నప్పటి నుంచి టైం చూడటం నేర్పించలేదా..? అంటుంది అప్పు. దీంతో కళ్యాణ్‌ ఏంటి సెటైరా..? అని అడగ్గానే.. ఏమైంది ఇప్పుడు అని అప్పు అడుగుతుంది. నీలో ఉన్న గిల్టీ ఫీలింగ్‌ పోగొట్టడానికే మళ్లీ నువ్వు జాబ్‌ చేయడానికి ఒప్పుకున్నాను అంతేకానీ ఆరోగ్యం పాడు చేసుకోమని కాదు అంటాడు కళ్యాణ్‌.

దీంతో కేసు మొత్తం స్టడీ చేయకుండా కేసును సాల్వ్‌ చేయడం రాదు కదా కూచి. వీలైనంత త్వరగా అత్తయ్యకు అనుమానం రాకుండా  కేసును కంప్లీట్‌ చేయాలనుకుంటున్నాను అని చెప్తుంటే.. ఇంతలో ప్రకాస్‌ వస్తాడు. ఒరేయ్‌ కళ్యాణ్‌ ఎవరో సంజయ్‌ అంటరా నీ ఫోన్‌ స్విచ్చాప్‌ వస్తుందని నాకు కాల్‌ చేశారు. వెంటనే ఆయనకు కాల్ చేయరా..? అని చెప్తూ.. బెడ్‌ మీద ఉన్న ఇన్వెస్టిగేషన్‌ పేపర్స్‌ చూసి అనుమానంగా ఏంట్రా ఆ పేపర్స్‌   ఏదో పోలీస్‌ ఇన్వెస్టిగేషన్‌.. ప్రోసీజర్‌.. ఇవన్నీ పోలీస్‌ కేసుకు సంబంధించినవి కదా..? అయినా నువ్వు ఇప్పుడు డ్యూటీలో లేవు కదమ్మా..? ఇవన్నీ ఇక్కడెందుకున్నాయి అని అనుమానంగా ప్రకాష్‌ అడగ్గానే.. కళ్యాణ్ నవ్వుతూ అడుగుతున్నాడు కదా కారణం చెప్పు అంటాడే.. అప్పు కూడా కారణం నేను ఎలా చెప్పను..? నువ్వే చెప్పు అంటుంది. నేనే చెప్పాలా.. అది నాన్నా అంటూ కళ్యాణ్‌ ఏదో చెప్పబోతుంటే..

Advertisement

అప్పుడే ధాన్యలక్ష్మీ పాలు తీసుకుని లోపలికి వస్తూ..  కోపంగా అబ్బా పాలు అడిగి ఇక్కడికి వచ్చారా..? నేను పాలు తీసుకుని ఇళ్లంతా తిరిగాను మీ కోసం అంటూ పేపర్స్‌ చూసి ఏమిటి ఇవి.. అని అడుగుతుంది. ఇందాకటి నుంచి నేను అదే అడుగుతున్నాను నవ్వుతున్నారు కానీ చెప్పడం లేదు అంటాడు ప్రకాష్‌. దీంతో ఏవో కేసు ఫైల్స్‌ లా ఉన్నాయి అంటూ అడగ్గానే.. కళ్యాణ్‌ చూశావా మా అమ్మ ఎంత ఇంటలిజెంటో..? మా అమ్మ ఇట్టే కనిపెట్టేసింది అమ్మా అవన్నీ మా డైరెక్టర్‌ ఒక పోలీస్‌ స్టోరీ సినిమా చేస్తున్నారు. దానికి సాంగ్స్‌ రాయమని ముందుగా ఈ స్టోరీస్‌ చదవమని ఇచ్చాడు అని చెప్పగానే..

అవునా చాలా ఇంట్రెస్టింగ్‌ గా ఉందిరా ఇంతకీ స్టోరీ ఏంట్రా మొత్తం చెప్పవా..? అని అడగ్గానే.. కళ్యాణ్‌ నోటికొచ్చింది ఏదో ఒక స్టోరీ చెప్తాడు. ఆ స్టోరీ విని ప్రకాష్ సూపర్‌గా ఉందిరా స్టోరీ అంటాడు. ధాన్యలక్ష్మీ మాత్రం స్టోరీ చెత్తలా ఉంది. ఇలాంటి సినిమా చూసి సభ్య సమాజానికి ఆయన ఏం మెసేజ్‌ ఇవ్వాలనుకుంటున్నారు.. వీలైతే ఆ డైరెక్టర్‌ ను  ఒకసారి నా దగ్గరకు తీసుకురా ఫ్యామిలీ స్టోరీస్‌ చెప్తాను అంటుంది ధాన్యలక్ష్మీ.. సరే అంటాడు కళ్యాణ్‌. ప్రకాష్‌, ధాన్యలక్ష్మీ వెళ్లిపోతారు.  తన మాట వినకుండా డ్యూటీ చేస్తే అత్తయ్య ఎంత కోప్పడతారో అని బాధపడుతుందోనని అప్పు చెప్పగానే.. ఈ విషయాన్ని బయట పడకుండా నేను చూసుకుంటాను కానీ నువ్వు  పడుకో అంటాడు.

Advertisement

మరోవైపు రాహుల్‌ మేనేజర్‌ సతీష్‌కు ఫోన్‌ చేసి స్వరాజ్‌ కంపెనీలో ఉన్న నీ మనుషులకు చెప్పి కావ్య, రాజ్‌ వేసిన డిజైన్స్‌ కొట్టేయమని చెప్పు. రేపు సాయంత్రం కల్లా ఆ డిజైన్స్‌ నా టేబుల్‌ మీద ఉండాలి అని చెప్తాడు. సతీష్‌ ఓకే సార్‌ అంటాడు. తర్వాత రుద్రాణి వచ్చి భలే ప్లాన్‌ చేస్తున్నావురా కానీ అలా చేస్తే దొరికిపోతావురా రాజ్‌ అడిగితే ఏం చెప్తావు అని అడగ్గానే.. అవన్నీ నేను చూసుకుంటాను. మరీ గొడవ ఎక్కువైతే కాపాడటానికి స్వప్న ఉంది కదా అని రాహుల్ చెప్తాడు. ఇప్పుడు నీ మీద నమ్మకం వచ్చింది రాహుల్‌ అంటూ రుద్రాణి హ్యాపీగా ఫీలవుతుంది.

తర్వాత రేణుక, అప్పుకు ఫోన్‌ చేసి తన కూతురిని చూశానని వెంటనే తాను వెళ్లి చూసే సరికి లేదని చెప్తుంది. వెంటనే అప్పు నేను వస్తున్నాను అంటూ వెళ్లబోతుంటే.. కళ్యాణ్‌ వచ్చి ఆపేస్తాడు. బయట హాల్లో అమ్మ కూర్చుని ఉంటుంది. నువ్వెలా వెళ్తావు అని చెప్తాడు. ఇప్పుడు నేను ఎలాగైనా వెళ్లాలి కూచి అంటుంది అప్పు. ఇంతలో కింద కేరళ వెళ్తున్న కావ్య, రాజ్‌లు అందరికీ బై చెప్తుంటే కళ్యాణ్‌ ఒక్క నిమిషం ఆగు చెప్తాను అంటాడు. కింద కావ్య ఎమోషనల్‌ అవుతుంటే.. అపర్ణ ఓదారుస్తుంది. ఇంతలో రుద్రాణి రాహుల్ వస్తారు.

ఇప్పుడు కేరళ ఎందుకు వెళ్తున్నారు అని అడుగుతుంది రుద్రాణి. ఏదో కావ్య తిరిగి ఇంటికి రాదు అన్నట్టు బిహేవ్‌ చేస్తుందేంటి అని అడగ్గానే.. అందరూ షాక్‌ అవుతారు. ఇంతలో పై నుంచి కళ్యాణ్‌, అప్పు వస్తారు. అన్నయ్య ఇంకా ఇక్కడే ఉంటే ఎలా వెళ్దాం పదండి అంటాడు. నువ్వెక్కడికి వెళ్తున్నావు అని ధాన్యలక్ష్మీ అడుగుతుంది. అన్నయ్యే రాత్రి చెప్పాడు తనను డ్రాప్‌ చేయమని అంటాడు కళ్యాణ్‌. సరే అంటూ నలుగురు బయటకు వెళ్లాక కళ్యాణ్‌ రాజ్‌తో తాము ఎయిర్‌ఫోర్ట్‌కు రావడం లేదని మీరే వెళ్లండి అని చెప్తూ.. కళ్యాణ్‌, అప్పు వెళ్లిపోతారు. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×