E-Paper
Advertisement

Brahmamudi Serial Today December 30th: ‘బ్రహ్మముడి’ సీరియల్:    కళ్యాణ్‌ను అనుమానించిన అప్పు – ధాన్యలక్ష్మీని రెచ్చగొట్టిన రుద్రాణి

Brahmamudi Serial Today December 30th: ‘బ్రహ్మముడి’ సీరియల్:    కళ్యాణ్‌ను అనుమానించిన అప్పు – ధాన్యలక్ష్మీని రెచ్చగొట్టిన రుద్రాణి
Advertisement

Brahmamudi serial today Episode:  రుద్రాణి, ధాన్యలక్ష్మీ దగ్గరకు వచ్చి రాజ్‌ చెప్పిన మాటల గురించి కావ్య దాచిన నిజాల గురించి మాట్లాడుతూ ఇవన్నీ వింటుంటే రాజ్‌ అబద్దం చెప్పినట్టు నాకు అనిపిస్తుంది. నీకు అనిపించడం లేదా అని అడుగుతుంది. అందులో అనిపించడానికి ఏముంది అది నిజమే అయ్యుండొచ్చు కదా.. అంటుంది ధాన్యలక్ష్మీ. అసలు రాజ్‌ అలా ఎలా చేస్తాడు అని ధాన్యలక్ష్మీ ప్రశ్నించగానే.. తన మాటలతో మళ్లీ రుద్రాణి, ధాన్యలక్ష్మీని నమ్మిస్తుంది.

రాజ్ ఐదు లక్షల గురించి ఆలోచిస్తుంటాడు. ఎవరిని అడగాలి అనుకుంటూ తన ఫ్రెండ్‌ శేఖర్‌కు ఫోన్‌ చేస్తాడు. ఓరేయ్‌ శేఖర్‌ అంటూ పలకరించగానే శేఖర్‌ ఎన్ని రోజులకు గుర్తుకు వచ్చానురా.. అవున్రా.. చాలా అవసరం వచ్చింది అందుకే ఫోన్‌ చేశాను. నాకో ఐదు లక్షలు అప్పు కావాలిరా.. నీకు మళ్లీ ఓ నెలరోజుల్లో తిరిగి ఇస్తాను అని అడగ్గానే.. ఐదు లక్షలా ఏరా జోక్‌ చేస్తున్నావా..? నీకు ఐదు లక్షలు ఒక అవసరమా..? నీకు ఇంత చిన్న అమౌంట్‌ అవసరం వచ్చిందా..? అని శేఖర్‌ అడగ్గానే అవునని అవసరం వచ్చింది.. అని చెప్పగానే   ఒరేయ్‌ ఐదు లక్షలు నీకు చాలా చిన్న అమౌంట్‌ రా.. కానీ అది నాకు చాలా పెద్ద అమౌంట్‌ రా మొన్ననే ప్లాట్‌కు అడ్వాన్స్‌ కట్టాను. అయినా నీకు డబ్బుతో అవసరం ఏంట్రా.. మీ ఇంట్లోనే కోట్లకు కోట్లు మూలుగుతుంటాయి అనగానే..

Advertisement

మా ఆవిడతో పందెం కట్టానురా… నువ్వు నా బెస్ట్‌ ఫ్రెండ్‌వి అని చెప్పగానే ఒకసారి డబ్బు అడిగి చూడు అంది. నువ్వు నాకు బెస్ట్‌ ఫ్రెండువి అవునో కాదో నాకు తెలియకపోయినా.. మా ఆవిడకు తెలిసిపోయిందిలే.. అంటూ ఫోన్‌ కట్‌ చేస్తాడు రాజ్‌. మీరు ఇంత చిన్న అమౌంట్‌ కోసం అడిగితే ఎవ్వరూ నమ్మరు అని కావ్య చెప్తుంది. టెన్షన్‌ పడకండి ఇప్పుడే వస్తాను అని వెళ్తుంది. ఇప్పుడే వస్తాను అని వెళ్తుంది. తెస్తానని వెళ్లిందా..? తెస్తుందా..? ఇంట్లో ఇంకా డబ్బులు ఉన్నాయా..? అని రాజ్ అనుకుంటాడు. ఇంతలో కావ్య తన బంగారు తీసుకొచ్చి ఇస్తుంది. బంగారం తాకట్టు పెట్టి డబ్బులు తీసుకురండి అని చెప్తుంది.

సీతారామయ్య పక్కన కూర్చున్న కళ్యాణ్‌కు అప్పు ఫోన్‌ చేస్తుంది. ఫోన్‌ లిఫ్ట్‌ చేసిన కళ్యాణ్‌ హాయ్‌ పొట్టి అనగానే ఆపరా బై నీ దొంగ ప్రేమలు అంటూ తిట్టగానే దొంగ ప్రేమా ఏమైంది పొట్టి ఎందుకలా మాట్లాడుతున్నావు.. అని కళ్యాణ్‌ అడుగుతాడు. నాక్కాదు నీకే ఏదో అయింది. అందుకే నేను ఫోన్‌ చేస్తేనే మాట్లాడుతున్నావు. నేను గుర్తు చేస్తేనే నన్ను గుర్తు చేసుకుంటున్నావు. నువ్వు చాలా మారిపోయావు అని అప్పు అనగానే అప్పు ఇంక ఆపు.. ఇప్పుడు నేను ఏం చేశానని ఇలా నాతో మాటలతో ఫైట్‌ చేస్తున్నావు.. అని కళ్యాన్‌ అడగ్గానే.. ఏం చేశావా..? లాస్ట్‌ టైం నేను కాల్ చేసినప్పుడు నువ్వు ఎం చేప్పావో గుర్తుందా..? అని అడుగుతుంది.

Advertisement

దీంతో ఏం చెప్పాను అంటూ కళ్యాణ్‌ అడుగుతాడు. ఏం చెప్పావో నీకు గుర్తు కూడా లేదా..? వీకెండ్‌ లో నా దగ్గరకు వస్తానని చెప్పావు అంటూ అప్పు తిడుతుంది. నువ్వు చాలా మారిపోయావు.. నిజం చెప్పు నువ్వు హైదరాబాద్‌లో చిన్న ఇల్లు ఏమైనా మెయింటెన్‌ చేస్తున్నావా..? అని అప్పు అనుమానిస్తుంది. ఇంతలో డాక్టర్ వచ్చి కళ్యాణ్‌కు మీరింకా బిల్లు పే చేయలేదు. అలా అయితే హాస్పిటల్‌ రూల్స్‌ ఒప్పుకోవు అని చెప్తుంటే ఫోన్‌ విన్న అప్పు కంగారుగా డాక్టర్‌ ఏంటి..? హాస్పిటల్‌ ఏంటి.. బిల్లు ఏంటి అని కళ్యాణ్‌ను అడుగుతుంది. కళ్యాణ్‌ కాల్‌ కట్‌ చేస్తాడు. కాల్‌ ఎందుకు కట్‌ చేశాడు అని మళ్లీ ఫోన్‌ చేస్తుంది. కళ్యాణ్‌ డాక్టర్‌తో మాట్లాడుతూ కాల్‌ కట్‌ చేస్తుంటాడు.

డాక్టర్‌ వెళ్లిపోయాక అప్పు ఫోన్‌ లిఫ్ట్‌ చేస్తాడు. అప్పు కోపంగా హాస్పిటల్‌ లో ఎవరు ఉన్నారు..? బిల్లు ఎందుకు పే చేయాలి నిజం చెప్పకపోతే నా మీద ఒట్టు అంటుంది. దీంతో కళ్యాణ్‌ జరిగింది అంతా చెప్తాడు. విషయం తెలుసుకున్న అప్పు వెంటనే తాను బయలుదేరుతానని టికెట్‌ బుక్‌ చేయమని అడుగుతుంది. వద్దని నువ్వు నీ లక్ష్యానికి దూరం కావొద్దని.. నీ విషయం కావ్య వదినకు కూడా చెప్పానని చాలా సంతోషించిందని అప్పును మోటివేట్‌ చేస్తాడు కళ్యాణ్‌. తాతయ్యా కోమాలోంచి వచ్చేసరికి నువ్వు పోలీస్‌గా ఆయన ముందు నిలబడాలి అప్పుడే ఆయన సంతోషిస్తాడు. అని కళ్యాణ్‌ చెప్పగానే.. అప్పు సారీ చెప్తుంది.

తాము రెంట్‌ తీసుకున్న కార్ల బిల్లు చూసి రాజ్ షాక్ అవుతాడు.  ఆ షాక్‌లో ఉన్న రాజ్‌, కావ్య పిలిచినా పలకడు. దీంతో కావ్య రాజ్‌ను తట్టి లేపుతుంది. ఏమైందని అడుగుతుంది. కార్ల బిల్లు తీసి కావ్యకు ఇస్తాడు. బిల్లు చూసిన కావ్య కూడా షాక్ అవుతుంది. మూడు లక్షలా అంటూ నోరెళ్లబెడుతుంది. దేవుడా పరీక్షల మీద పరీక్షలు పెట్టి మమ్మల్ని ఎందుకయ్యా ఇలా ఇబ్బంది పెడుతున్నావు అంటూ బాధపడుతుంది. తర్వాత ప్రతి సమస్యకు ఏదో ఒక పరిష్కారం ఉంటుంది. మీరు ఎక్కువగా ఆలోచించకండి అంటూ కాఫీ ఇస్తుంది. రాజ్‌ కాఫీ తాగి కాఫీ తాగడం ఫినిష్‌ అయింది అంటాడు. పరిష్కారం కూడా దొరికింది అంటుంది కావ్య. ఏంటని రాజ్‌ అడగ్గానే మన కార్లు మాత్రమే ఉంచుకుని మిగతావి పంపిచేద్దాం అని చెప్తుంది కావ్య.

రుద్రాణి కోపంగా కిందకు వచ్చి శాంతను పిలుస్తుంది. శాంత రాగానే కాఫీ ఇవ్వమని అడుగుతుంది. మీకోటా కాఫీ ఉదయమే ఇచ్చానని మళ్లీ మీకు రేపు ఉదయం ఇస్తాను అని చెప్తుంది శాంత. శాంత మాటలకు రుద్రాణిని ఇరిటేటింగ్‌ గా ఫీలవుతుంది. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

 

ALSO READ: సకల బాధలను దూరం చేసే షణ్ముఖి రుద్రాక్ష ధారణ ఎవరు చేయాలి..?

 

Tags

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×