E-Paper
Advertisement

Brahmamudi Serial Today December 28th: ‘బ్రహ్మముడి’ సీరియల్:  కావ్యపై కంప్లైంట్‌ చేసిన ప్రకాష్‌ – నిజం తెలుసుకున్న సుభాష్‌       

Brahmamudi Serial Today December 28th: ‘బ్రహ్మముడి’ సీరియల్:  కావ్యపై కంప్లైంట్‌ చేసిన ప్రకాష్‌ – నిజం తెలుసుకున్న సుభాష్‌       
Advertisement

Brahmamudi serial today Episode:   ఆస్తుల గురించి అడగమని ప్రకాష్‌ను బలవంతంగా కిందకు తీసుకొస్తుంది ధాన్యలక్ష్మీ. భయంభయంగా ప్రకాష్‌, సుభాష్‌ దగ్గరకు వచ్చి నీతో ఒక విషయం చెప్పాలి అంటాడు. ఏంట్రా అది అని సుభాష్‌ అడగ్గానే కావ్య పెట్టిన షరతుల గురించి చెప్తాడు ప్రకాష్‌. వాటి వల్ల ఇంట్లో అందరూ ఇబ్బంది పడుతున్నారు అన్నయ్య.. అని చెప్పగానే ఏరా నువ్వు నా కోడలి మీద కంప్లైంట్‌ తీసుకొచ్చావా..? అని సుభాష్‌ అడుగుతాడు. అలాంటిదేం లేదని కానీ ఒక మాట నువ్వు చెబితే బాగుంటుంది కదా..? అని చెప్పగానే సరేలే అంటాడు సుభాష్‌ ఇంతలో ఫోన్‌ వస్తుంది.

చెక్‌ క్లియర్‌ కాలేదని.. హాస్పిటల్‌ బిల్‌ కూడా కట్టలేదని ఫోన్‌ లో వ్యక్తి చెప్తాడు. సుభాష్‌ కంగారుగా కావ్యను పిలిచి హాస్పిటల్‌ బిల్‌ ఇంకా క్లియర్‌ కాలేదంట చెక్‌ ఎందుకు హోల్డ్‌ లో పెట్టారు అని అడుగుతాడు. పక్క నుంచి వింటున్న రుద్రాణి మనకు మంచి మసాలా దొరికిందిరా అంటుంది రాహుల్‌తో. లోక కళ్యాణం కోసం ప్రపంచ శాంతి కోసం అంటూ సెటైర్లు వేస్తుంది రుద్రాణి. దుగ్గిరాల వంశ ప్రతిష్టను మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లడం కోసం అంతేనా కావ్య అంటూ ప్రశ్నిస్తుంది. ఎవరిని ఉద్దరించడానికి అంత చిన్న అమౌంట్‌ ఆపాల్సి వచ్చింది. అయినా హాస్పిటల్ బిల్లు ఈవిడకు ఆపాల్సిన అవసరం ఏమోచింది.

Advertisement

మా మామయ్య హాస్పిటల్‌ బిల్లు కూడా ఎందుకు ఆపావు అంటూ ధాన్యలక్ష్మీ ప్రశ్నిస్తుంది. కింద జరుగుతున్న తతంగం అంతా పై నుంచి రాజ్‌ వింటుంటాడు. హాస్పిటల్‌ బిల్లు గురించి ధాన్యలక్ష్మీ ప్రశ్నించడంతో రాజ్‌ షాక్‌ అవుతాడు. అసలు విషయం బయటపడేలా ఉంది ఏదో ఒకటి చేసి మేనేజ్‌ చేయాలి అని రాజ్‌ అనుకుంటూ కిందకు వస్తూ. నేను చెప్తాను అని రాజ్‌ అనగానే అందరూ షాకింగ్‌ గా చూస్తుంటారు. మేము దేని గురించి అడుగుతున్నామో ఆ విషయం నీకు తెలుసా..? అని రుద్రాణి అడుగుతుంది. ఇంతకీ నీ బాధ ఏంటి అత్తయ్యా అంటూ ప్రశ్నిస్తాడు. రాజ్‌. తాతయ్య ఉన్న హాస్పిటల్‌ నుంచి ఫోన్‌ వచ్చింది ఇంత వరకు బిల్లు కట్టలేదంట అని చెప్తుంది రుద్రాణి.

అపర్ణ కూడా హాస్పిటల్ బిల్లు ఎందుకు క్లియర్‌ చేయలేదు అని ప్రశ్నిస్తుంది. ఇందిరాదేవి కూడా ఐదు లక్షలు కూడా మన దగ్గర లేవా..? మనకా స్థాయి లేదా..? అంటూ బాధపడుతుంది. దీంతో కావ్య అసలే జరిగింది అంటే అని చెప్పబోతుంటే కళావతి ఆగు ఇదంతా నా వల్లే జరిగింది.. అంతా నేనే చెప్తాను. అని రాజ్‌ అనగానే చెప్పండి మీరే చెప్పండి.. అందరూ నన్నే దోషిగా నిలబెట్టినా మౌనంగా ఉన్నాను. కానీ మిమ్మల్ని అంటుంటే ఆగలేక నేనే చెప్పాలనుకున్నాను కానీ ఇప్పుడు మీరే చెప్పండి అంటుంది కావ్య. రాజ్‌ ఏం జరుగుతుందిరా… ఇద్దరూ కలిసి ఏం చేస్తున్నారు అని సుభాష్‌ అడగ్గానే.. చేయడం కాదు ఇద్దరూ కలిసి ఏదో దాస్తున్నారు. పెద్ద విషయమే జరిగింది అని అపర్ణ చెప్తుంది.

Advertisement

దాచడానికేం లేదు మమ్మీ ఇది రహస్యంగా జరిగేది ఏం కాదు.. ఆఫీసులో ఆడిటింగ్‌ జరుగుతుంది అందుకే ట్రాన్సిక్షన్స్‌ అన్ని ఆగిపోయాయి అని రాజ్‌ చెప్తాడు. ఇప్పుడు ఆడిటింగ్‌ ఏంట్రా మార్చిలో కదా జరగాల్సింది అని ప్రకాష్‌ అడగ్గానే రుద్రాణి శభాష్‌ చిన్నన్నయ్యా అన్ని మర్చిపోయిన నువ్వు ఈ విషయం మాత్రం బాగానే గుర్తు పెట్టుకున్నావు అవును రాజ్‌ ఆడిటింగ్‌ ఇప్పుడు జరగటం ఏంటి అని ప్రశ్నిస్తుంది. దానికి నీ కొడుకే కారణం అత్తా.. ఇదంతా అటు తిరిగి ఇటు తిరిగి నా మెడకే చుట్టుకుంది.

మధ్యలో వెళ్లి సీఈవో సీట్లో కూర్చున్నాడు కదా..? లెక్కలు లేవు.. ఏమీ లేవు.. అంత అస్తవ్యస్తం చేశాడు. అడిటింగ్‌ పూర్తి కాగానే అంతా మామూలు అవుతుందనుకున్నాను. కానీ నా లెక్క కూడా తప్పింది అని రాజ్‌ చెప్పగానే.. తాతయ్య ట్రీట్‌మెంట్‌ టెన్షన్‌ కంటే నీకు నీ భార్యను వెనకేసుకు రావడమే ఎక్కువైంది అంటుంది రుద్రాణి.  నేను న్యాయం మాట్లాడాను.. ఏదైనా అడిగే ముందు , నిలదీసే ముందు క్లారిటీగా తెలుసుకోవాలి అంటూ రుద్రాణికి వార్నింగ్‌ ఇచ్చి వెళ్లిపోతాడు రాజ్‌.

ఇందిరాదేవి మౌనంగా వెళ్లి గార్డెన్‌లో కూర్చుంటుంది. కావ్య వెళ్లి మాట్లాడొచ్చా అమ్మమ్మ అని అడుగుతుంది. సొంత వాళ్ల దగ్గర కూడా అనుమతులు తీసుకోవడం ఎప్పుడు మొదలు పెట్టావు అంటుంది ఇందిరాదేవి. తాతయ్య ట్రీట్‌మెంట్‌ బిల్లు కట్టలేదని మీకు కోపం వచ్చిందా అమ్మమ్మ.. నాతో మాట్లాడరా..? మీరు ఇలా మౌనంగా ఉంటే నేను చూడలేకపోతున్నాను. మీకు కోపం వస్తే తిట్టండి.. సరిపోకపోతే కొట్టండి ఫ్లీజ్‌ అమ్మమ్మ నాతో మాట్లాడండి. అంటూ ప్రాధేయపడటంతో ఇందిరాదేవి కావ్యతో మాట్లాడుతుంది. నిన్ను పూర్తిగా నమ్ముతున్నాను అంటూ చెప్తుంది.

తర్వాత రాజ్‌ ఆలోచిస్తుంటే.. సుభాష్‌ వెళ్లి కంపెనీలో ఏదైనా ప్రాబ్లమ్‌ ఉందా..? అని అడుగుతాడు. ఏం లేదని చెప్తాడు రాజ్‌. అయితే ఓకే జాగ్రత్త అని చెప్పి వెళ్లిపోతాడు సుభాష్‌. మరోవైపు రుద్రాణి, ధాన్యలక్ష్మీ ఇద్దరూ కలిసి రాజ్‌ చెప్పిన మాటల గురించి ఆలోచిస్తుంటారు. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

 

ALSO READ: సకల బాధలను దూరం చేసే షణ్ముఖి రుద్రాక్ష ధారణ ఎవరు చేయాలి..?

 

Tags

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×