E-Paper
Advertisement

Brahmamudi Serial Today December 22nd: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: నిజం తెలుసుకున్న రాజ్ – ఆగిపోయిన యాడ్ ఫిల్మ్ షూట్

Brahmamudi Serial Today December 22nd: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: నిజం తెలుసుకున్న రాజ్ – ఆగిపోయిన యాడ్ ఫిల్మ్ షూట్
Advertisement

Brahmamudi serial today Episode:

రాహుల్‌ పంపించిన మణివర్మ వచ్చి రాజ్‌ వాళ్ల ఇంట్లో హడావిడి చేస్తుంటాడు. అందరూ అనుమానంగా చూస్తుంటారు. ఇంతో రాజ్‌ వాళ్ల ఇంట్లో వంటమనిషి పరోటాల చెడగొడుతుంటే.. ఎవరో ఇక్కడ పరోటాలు చెడగొడుతున్నారేంటి..? అని మనసులో అనుకుని కిచెన్ లోకి వెళ్లి పరోటాలు చేసి చూపిస్తుంటాడు.   దీంతో రుద్రాణి ఏంట్రా ఇది అని రాహుల్‌ను అడుగుతుంది. దీంతో రాహుల్‌ ఏంటో మమ్మీ  నాకు మాత్రం ఏం తెలుసు అంటాడు. కిచెన్‌ మణివర్మ ఇదిగో పిండి ఇలా మెత్తగా తయారు అయ్యాక దీన్ని ఇలా పొడుగ్గా చేసి ఉండలా చేయాలి. మళ్లీ దాన్ని ఇలా రుద్దాలి అన్నమాట అంటూ చెప్తుంటే.. కావ్య చూసి ఏవండి ఇతను నిజంగా డైరెక్టరేనా..? అని అడుగుతుంది. ప్రకాష్‌ నవ్వుతూ కాదు పరోటా మాస్టర్‌ అని చెప్తాడు. దీంతో ధాన్యలక్ష్మీ మీరు ఊరుకోండీ మరీను.. అతను డైరెక్టరే.. అంటుంది.

అవునా ఇప్పుడూ ఫ్రూవ్‌ చేస్తాను చూడు అంటూ కిచెన్‌లోకి వెళ్లి ప్రకాష్‌ మాస్టారు ప్లేట్‌ పరోటా ఎంత అని అడుగుతాడు. దీంతో మణివర్మ విత్‌ కర్రీ అయితే యాభై రూపాయలు వితౌట్‌ కర్రీ అయితే ముఫ్పై రూపాయలు.. ఇంతకీ పార్శిలా…? తింటారా.? అంటూ అడిగి ప్రకాష్‌ను చూసి షాక్‌ అవుతాడు. దీంతో ప్రకాష్‌ కోపంగా నేను చెప్పానా… వీడు పరోటా మాస్టరే.. అని చెప్పి హాల్లోకి లాక్కొస్తాడు. దీంతో రాజ్‌ కోపంగా రేయ్‌ నువ్వు డైరెక్టర్‌ కాదా..? పరోటా మాస్టర్‌ అయితే ఇక్కడికి ఎందుకు వచ్చావురా అని కొట్టబోతుంటే.. రాహుల్‌ తన పేరు చెప్పొద్దని సైగ చేస్తాడు. మణివర్మ నేనే డబ్బులకు కక్కుర్తి పడి మీ కో ఆర్డినేటర్‌ ను నమ్మించి ఇలా వచ్చాను సార్‌ అని చెప్పి అక్కడి నుంచి పారిపోతాడు. దీంతో రాజ్‌ బాధపడుతూ అయిపోయింది ఉన్న ఇవాళ ఒక్క రోజు టైం కూడా వేస్ట్‌ అయిపోయింది అనుకుంటూ బయటకు గార్డెన్‌ లోకి వెళ్లిపోతాడు.

Advertisement

కావ్య వెనకే వెళ్తుంది.. ఏవండి అంటూ పిలవగానే.. రాజ్‌ ఇరిటేటింగ్‌ గా నన్ను డిస్టర్బ్ చేయకు కళావతి అంటాడు.   దీంతో తప్పు మీలోనే ఉంది అండి అయినా మీరు ఇలా ఆలోచించడం ఎలా అంటారు. దీంతో రాజ్‌ కోపంగా ఏం తప్పు చేశాను కళావతి.. ఏం తప్పు చేశాను. డై అండ్‌ నైట్‌ కష్టపడ్డాను.. నువ్వు వేసిన డిజైన్స్‌ ను రాత్రికి రాత్రి చేయించాను. డబ్బులు ఇచ్చినా కూడా ఆ మోడల్‌ హ్యాండ్ ఇస్తే నిన్ను పెట్టి తీద్దామనుకున్నాను.. అయినా సరే మళ్లీ మళ్లీ ఫెయిల్‌ అవుతున్నాను.. అంటూ రాజ్ బాధపడుతుంటే.. మీరు ఎందుకు ఫెయిల్‌ అయ్యారని కారణాలు వెతుకుతున్నారు.. కానీ ఎలా సక్సెస్‌ అవ్వాలో ఆలోచించడం లేదు.. అని చెప్పగానే..

రాజ్‌ ఇప్పటి వరకు నేను చేసింది సక్సెస్‌ అవ్వడం కోసమే కదా కళావతి అని రాజ్‌ చెప్పగానే.. కానీ ఇప్పుడు పెయిల్యూర్‌ను ఒప్పేసుకున్నారు కదా..? అనగానే.. మరి నాకు ఏ ఆప్షన్‌ ఉంది.. వచ్చిన వాడు ఫేక్‌ అని తేలిపోయింది. ఇప్పటికిప్పుడు ఏ డైరెక్టర్‌ దొరకడు.. ఇక ఇప్పటికిప్పుడు ఈ యాడ్‌ ఎలా ఫినిష్‌ చేయగలను.. అని రాజ్‌  చెప్పగానే.. ఏం కావాలో ఎలా కావాలో మీకు క్లారిటీ ఉన్నప్పుడు మీరే ఎందుకు చేయకూడదు అని కావ్య చెప్పగానే.. ఏం మాట్లాడుతున్నావు కళావతి.. డైరెక్టన్‌ చేయడం అనేది జోక్‌ కాదు.. పెద్ద పెద్ద డైరెక్టర్లే ఒక్కోసారి వాళ్లు అనుకన్నది చేయలేక ఫెయిల్ అవుతారు.. అలాంటిది.. ఏ ఎక్స్‌ఫీరియన్స్‌ లేని నేను ఎలా చేయగలను అంటాడు.. దీంతో కావ్య అసోసియేట్‌ డైరెక్టర్‌ను పిలిచి ఇతని సహకారంతో యాడ్‌ కంప్లీట్‌ చేయండి.. అతనికి అవకాశం ఇవ్వండి.. అని చెప్పగానే.. రాజ్‌ ఓకే చెప్తాడు.

Advertisement

అందరూ లోపలికి వెళ్లాక రాజ్‌ డైరెక్షన్‌ చేస్తుంటే.. అసోసియేట్‌ డైరెక్టర్‌, కెమెరామెన్‌ ఇద్దరూ సపోర్ట్‌ చేస్తుంటారు. రాజ్‌ సక్సెస్‌ఫుల్‌ గా యాడ్‌ షూటింగ్‌ కంప్లీట్‌ చేస్తాడు. తర్వాత రుద్రాణి ఇరిటేటింగ్‌ గా రాహుల్‌ను తిడుతుంది. ఆ రాజ్‌ యాడ్‌ కంప్లీట్‌ చేశాడని బాధపడుతుంది. యాడ్‌ అయిపోగానే సక్సెస్‌ అయినట్టు కాదని చెప్తాడు. మరోవైపు యాడ్‌ ఫిల్మ్‌ ఎడిటింగ్‌ అయినంత వరకు తనకు సెండ్‌ చేయమని చెప్తాడు. ఫైనల్‌ ఎలా వచ్చిందో అని భయపడుతున్న రాజ్‌ దగ్గరకు కావ్య వచ్చి బాగానే వచ్చి ఉంటుందని ఎంకరేజ్‌ చేస్తుంది. తర్వాత రోజు అప్పు ఒక దగ్గర నిలబడి పోలీసులతో మాట్లాడుతుంటే.. రేణుకను రౌడీలు తరుముతూ వస్తుంటారు. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×