// // Brahmamudi Serial Today December 18th: - ‘బ్రహ్మముడి’ సీరియల్‌: అంజలి కేసులో అశోక్ ను అనుమానించిన అప్పు  -->
E-Paper
Advertisement

Brahmamudi Serial Today December 18th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: అంజలి కేసులో అశోక్ ను అనుమానించిన అప్పు 

Brahmamudi Serial Today December 18th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: అంజలి కేసులో అశోక్ ను అనుమానించిన అప్పు 
Advertisement

Brahmamudi serial today Episode:  

కావ్య, రాజ్‌ ప్లాన్ చేసి తమ ఆఫీసులో డిజైన్‌ కొట్టేసిన ఉద్యోగిని పట్టుకుంటారు. రాజ్ కోపంగా అతన్ని కొట్టబోతుంటే.. కావ్య ఆపేసి ఏవండి ఇలాంటి వాళ్లను కొట్టడం కాదు.. పోలీసులకు అప్పగించండి అని చెప్పగానే.. రాజ్‌ మేనేజర్‌ను పిలిచి అతన్ని పోలీసులకు పట్టించండి అని చెప్తాడు. మేనేజర్‌ వచ్చి అతన్ని తీసుకెళ్లిపోతాడు. కావ్య రాజ్‌ను చూస్తూ.. మీకు తెలియకుండా కొత్త డిజైన్స్‌ వేస్తానా..? శ్రీవారు అంటుంది. పర్వాలేదు ఇంటి దొంగలను పట్టడంలో నన్ను మించిపోయావు అంటాడు రాజ్‌. ఎంతైనా మీ పాద దాసిని కదా అందుకే ఇలా చేశాను అంటుంది కళావతి.. సరే ఇక న్యూ డిజైన్స్‌ గురించి ఆలోచిద్దామా అని రాజ్‌ అనగానే సరే అంటూ ఇద్దరూ డిజైన్స్‌ మీద ఫోకస్‌ చేస్తారు.

స్టేషన్‌లో ఉన్న అప్పు దగ్గరకు రేణుక భర్త అశోక్‌ వస్తాడు. మేడం రమ్మన్నారంటా అని అడగ్గానే.. మీకో గుడ్‌ న్యూస్‌ అంటుంది అప్పు.. ఈ కేసు క్లోజ్‌ చేస్తున్నారా..? అని ఆనందంగా అడగ్గానే.. కేసు క్లోజ్‌ చేస్తే మీకు గుడ్‌ న్యూస్‌ ఎలా అవుతుంది అని అప్పు అడగ్గానే.. అంటే అది మేడం సీఐ గారు మీకు కేసు క్లోజ్‌ చేయమన్నారు కదా..? మాకు బ్యాడ్‌ న్యూసే కానీ మీకు గుడ్‌ న్యూసే కదా అని అలా చెప్పాను మేడం అంటాడు. దీంతో అప్పు మీ పాప చనిపోలేదు.. బతికే ఉంది అని చెప్పగానే.. వాట్‌.. అంటూ అశోక్‌ షాక్‌ అవుతాడు.. దీంతో అప్పు.. అదేంటి పాప బతికే ఉందని చెబితే ఎగిరి గంతేయాల్సింది పోయి అలా షాక్‌ అవుతున్నారేంటి అని అడుగుతుంది.

Advertisement

దీంతో అశోక్‌ అంటే మేడం ఇప్పటి దాకా మీరే కదా మేడం పాప చనిపోయిందని తేల్చేశారు. మీరు ఉన్నట్టుండి పాప బతికే ఉందని చెప్పేసరికి ఇదిగో ఇలా షాక్‌ అయ్యాను.. అప్పుడే మీ డిపార్ట్‌మెంటే కదా పోస్ట్‌మార్టం రిపోర్టులో చనిపోయిందని చెప్పారు.. అనగానే.. అప్పుడు ఎవరో పోస్ట్ మార్టం రిపోర్ట్‌ ఎవరో తప్పుగా ఇచ్చారు.. మళ్లీ నేను రీపోస్ట్‌ మార్టం చేయించాను.. అందులో మీ పాప చనిపోలేదని తేలింది. అని చెప్పగానే.. అశోక్‌ సంతోష పడ్డట్టు హ్యాపీగీ ఫీలవుతూ.. వెళ్లిపోతాడు.. అశోక్‌ వెళ్లిపోయాక కానిస్టేబుల్‌ను పిలిచి ఫాలో అవ్వమని పూర్తి డీటెయిల్స్‌ తనకు కావాలని చెప్తుంది. కానిస్టేబుల్ సరే మేడం అంటూ వెళ్లిపోతాడు.

మరోవైపు కావ్య తాను డిజైన్స్‌ వేస్తుంటే.. రాజ్‌ వెళ్లి కాఫీ తీసుకొస్తాడు. కావ్యకు ఇస్తాడు. కావ్య తాను వేసిన డిజైన్స్‌ రాజ్‌కు చూపిస్తుంది. అది బాగాలేదని శృతి ఇంతకన్నా ముందే డిజైన్స్‌ వేస్తుందని చెప్తాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది. అంతా పై నుంచి రాహుల్‌ గమనిస్తుంటాడు. ఈ రెండు రోజులు నిన్ను అడ్డుకుంటే చాలు నాకు రెండో విజయం కూడా దక్కుతుంది. ఈ రాహుల్ ఏం చేస్తాడో చూస్తూ ఉండు.. అనుకుంటూ రాహుల్ లోపలికి వెళ్లిపోతాడు. ఇద్దరు గొడవ పడిన తర్వాత కావ్య మరో డిజైన్‌ వేసి రాజ్‌కు ఇస్తూ.. ఏవండి ఇది ఎలా ఉందో చూడండి అని ఇస్తుంది. అది చూసిన రాజ్‌ అద్బుతంగా ఉంది.. అదీ నా కళావతి అంటే సూపర్‌గా వేశావు.. ఇది డిజైన్‌ చేయించి మోడల్‌తో యాడ్‌ షూట్ చేయిస్తాను చూడు ఇక అదిరిపోతుంది అని రాజ్‌ చెప్పగానే.. కావ్య హ్యాపీగా ఫీలవుతుంది.

Advertisement

తర్వాత రాజ్‌ యాడ్‌ ఫిల్మ్‌ చేయిస్తుంటాడు. కావ్య డిజైన్‌ చేసిన డిజైన్స్‌ తో జ్యువెల్లరీ చేయించి అంతా రెడీగా ఉంటారు. మోడల్‌ కోసం వెయిట్‌ చేస్తుంటారు. ఇంతలో శృతి మోడల్‌కు ఫోన్‌ చేస్తే.. ఫోన్‌ స్విచ్చాప్‌ వస్తుంది. వెంటనే మేనేజర్‌కు ఫోన్‌ చేస్తే.. లాస్య కనిపించడం లేదని చెప్తాడు. దీంతో శృతి కంగారు పడుతుంటే… రాజ్‌ కంగారుగా శృతి ఏమైంది అంటూ వస్తాడు. సార్‌ లాస్య కనిపించడం లేదట సార్‌ అని చెప్తుంది. రాజ్‌ కంగారుగా లాస్య రావడం లేదా..? ఎందుకని శృతి అని అడగ్గానే.. ఏమో సార్‌ నిన్న నైట్‌ కూడా మాట్లాడాను.. టైంకు సెట్‌లో ఉంటానంది. కానీ ఇప్పుడు ఫోన్‌ చేస్తే.. స్విచ్చాప్‌ వస్తుంది. మేనేజర్‌కు కాల్ చేస్తే కనిపించడం లేదని చెప్పాడు అని శృతి చెప్పగానే.. రాజ్‌ కంగారు పడుతుంటాడు.

మరోవైపు రాహుల్‌ ఆఫీసులో ఉంటుంది మోడల్‌ లాస్య. ఇద్దరూ నవ్వుకుంటారు. లాస్యకు డబ్బులిచ్చి షూటింగ్‌కు వెళ్లనందుకు నీకు ఈ గిప్ట్‌ అని చెప్తాడు రాహుల్‌. అక్కడి నుంచి లాస్య వెళ్లిపోతుంది. మరోవైపు మోడల్‌ కోసం రాజ్‌, శృతి, డైరెక్టర్‌ ప్రయత్నిస్తుంటారు. ఎవ్వరూ దొరకరు.. మరోవైపు అంజలి కేసు గురించి అప్పు డీటెయిల్స్‌ తీసుకుంటుంది. యాడ్‌ షూట్‌ గురించి రాజ్‌ కంగారు పడుతుంటే.. కావ్య వస్తుంది. ఎందుకు అంత టెన్షన్‌ పడుతున్నారు అని అడుగుతుంది. ఇద్దరి మద్య గొడవ జరుగుతుంది. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×