E-Paper
Advertisement

Brahmamudi Serial Today December 11th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రాజ్, కావ్యలను కేరళలో కిడ్నాప్ చేసిన రౌడీలు

Brahmamudi Serial Today December 11th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రాజ్, కావ్యలను కేరళలో కిడ్నాప్ చేసిన రౌడీలు
Advertisement

Brahmamudi serial today Episode:

స్వప్న అందంగా రెడీ అయి రాహుల్‌ దగ్గరకు వెళ్తుంది. ఈ రోజు మన పెళ్లి రోజు కూడా కాదు మరి స్పెషలేంటి ఇలా రెడీ అయ్యావు.. నిన్ను ఇలా చూస్తుంటే మతి పోతుంది అంటాడు రాహుల్‌. దీంతో  స్వప్న సిగ్గుపడుతూ మొగుడి ముందు అందంగా రెడీ కావడానికి కూడా టైం కావాలా..? మంచి మూడ్‌ ఉంటే సరిపోదా..? అంటుంది స్వప్న నువ్వు ఇంతలా సపోర్టు చేస్తావని తెలిసుంటే నేను ఎప్పుడో మారిపోయేవాణ్ని తెలుసా.? అంటాడు రాహుల్‌. కొంచెం లేటైనా మారాలని డిసైడ్‌ అయ్యావు అది చాలు నాకు అంటుంది స్వప్న. డిసైడ్‌ అవ్వడం కాదు స్వప్న నేను నిజంగానే మారిపోయాను అంటాడు. అది తెలుసు నాకు అంటుంది స్వప్న. ఈ విషయంలో నీకే థాంక్స్‌ చెప్పాలి అంటాడు రాహుల్‌.. ఎందుకు అని స్వప్న అడగ్గానే.. నేను మారాలనుకున్నప్పుడు ఇంట్లో ఎవ్వరూ నమ్మలేదు.. మొదట నన్ను నమ్మింది నువ్వే.. రాజ్‌, కావ్యను ఒప్పించి రాజ్‌ చేత ఈ కంపెనీ పెట్టించింది నువ్వే.. దానికి నీకు ఎన్ని థాంకులు చెప్పినా సరిపోవు.. స్వప్న అనగానే..

హలో శ్రీవారు మొగుడు పెళ్లాల మధ్య థాంకులు సారీలు ఉండకూడదు అంటుంది స్వప్న.. మరి ఏముండాలి అని రాహుల్ అడగ్గానే.. నీకు తెలియదా.. అంటుంది స్వప్న వెంటనే రాహుల్‌ మాట మారుస్తూ.. సారీ స్వప్న నేను కొంచెం టెన్షన్‌లో ఉన్నాను.. అని చెప్తాడు ఏమైందని స్వప్న అడగ్గానే.. నీ చేతుల మీద సెలెక్ట్‌ చేయించి డిజైన్స్‌ అన్ని పంపించేశాను కదా.? అని రాహుల్‌ చెప్పగానే.. దానికి ఇప్పుడెందుకు ప్రాబ్లమ్‌ అని స్వప్న అడగ్గానే.. ప్లాబ్లమ్‌ కాదు ఆ డిజైన్స్‌కు పబ్లిసిటీ కావాలి అని చెప్పగానే.. రాజ్‌ చేయించినట్టు సెలబ్రిటీల చేత చేయించు అని చెప్తుంది స్వప్న. నా కంపెనీ అంత పెద్ద కంపెనీ కాదు. అంత బడ్జెట్‌ నేను పెట్టలేను.. నువ్వే ఏదైనా మంచి ఐడియా ఇవ్వొచ్చు కదా..? నీకు ఎలాగూ మోడలింగ్‌ తెలుసు కదా..? ఆ ఫోటో షూట్‌ నువ్వే చేయోచ్చు కదా అని చెప్తాడు రాహుల్‌. దీంతో స్వప్న హలో నాకు పెళ్లై పోయింది. నాకు ఒక బిడ్డ కూడా ఉంది. అని చెప్పగానే.. రాహుల్ బలవంతంగా స్వప్నను ఒప్పిస్తాడు.

Advertisement

రెస్టారెంట్‌లో కూర్చున్న రాజ్‌, కావ్య రౌడీల గురించి మాట్లాడుకుంటారు. రాజ్‌ తాను కొట్టిన దెబ్బలకు ఇక నెల రోజుల వరకు లేవరు మనకు కనిపించరు అని చెప్తాడు. కావ్య అవును నిజమే అంటుంది. ఇంతలో రౌడీలు రెస్టారెంట్‌ దగ్గరకు వచ్చి రాజ్‌, కావ్యలకు మత్తు మందు ఇచ్చి మన బాస్‌ దగ్గరకు తీసుకెళ్దామని ప్లాన్‌ చేస్తారు. ఇంతలో రాజ్‌ త్వరగా వెళ్లాలని కావ్య త్వరగా తినమని ఆశ్రమానికి వెళ్లాలని చెప్తాడు. కావ్య సరే అంటుంది. ఇంతలో ఒక ఎస్సై వచ్చి రాజ్‌ను గుర్తు పట్టి పలకరిస్తాడు. ఇంతలో రాజ్‌ వాళ్లు బయటకు వెళ్లిపోతారు. బయట రెడీగా ఉన్న రౌడీలు రాజ్‌, కావ్యలకు మత్తు మందు ఇచ్చి కారులో ఎత్తుకుని వెళ్తుంటారు. అప్పుడే పెన్‌డ్రైవ్‌ ఇవ్వడానికి బయటకు వచ్చిన ఎస్సై చూస్తాడు. పట్టుకోవడానికి ట్రై చేస్తాడు. కానీ వాళ్లు అప్పటికే వెళ్లిపోతారు. మరోవైపు రాహుల్‌, స్వప్నను తీసుకెళ్లి యాడ్‌ షూటింగ్‌ చేయిస్తాడు. కానీ స్వప్న భయపడుతూనే ఉంటుంది. ఇంట్లో వాళ్లు ఏమంటారోనని టెన్షన్‌ పడుతుంది. రాహుల్‌ మాత్రం అలాంటిదేం ఉండదని చెప్తాడు.

రాజ్‌, కావ్యలను ఎత్తుకెళ్లిన రౌడీలు ఒక దగ్గర కట్టేస్తారు. స్పృహలోకి వచ్చిన రాజ్‌ రేయ్‌ ఏంట్రా ఇది అని అడగ్గానే.. మిమ్మల్ని కట్టేశాం అని చెప్తారు రౌడీలు. ఎందుకు కట్టేశారు అని కావ్య అడగ్గానే.. కిడ్నాప్‌ చేసిన వాళ్లను కట్టేయాలమ్మా అని చెప్తాడు రౌడీ. మమ్మల్ని ఎందుకు కిడ్నాప్‌ చేశారురా అని రాజ్‌ అడగ్గానే.. మరి మేము పెన్‌ డ్రైవ్‌ అడిగితే మీరు ఇవ్వడం లేదు కదా..? పైగా నిన్న మమ్మల్ని కొట్టిన చోట కొట్టకుండా కొట్టేశారు అని బాధపడతారు రౌడీలు.. దీంతో రాజ్‌ అరేయ్‌ అర్థం చేసుకోండిరా మా దగ్గర ఏ పెన్‌డ్రైవ్‌ లేదు.. ఆసలు ఆ పెన్‌డ్రైవ్‌ ఏంటో మాక తెలియదురా అని చెప్పగానే.. ఆ మాట కాకుండా ఇంకే మాటైనా చెప్పు వింటాము కానీ మర్యాదగా పెన్‌డ్రైవ్‌ ఇవ్వండి అని రౌడీలు అడగ్గానే.. అరేయ్‌ నా వైఫ్‌క ట్రీట్‌మెంట్‌ ఇప్పించాలిరా.. మమ్మల్ని వదలండిరా అంటాడు రాజ్‌. పెన్‌ డ్రైవ్‌ ఇచ్చే వరకు వదిలేది లేదు. పెన్‌ డ్రైవ్‌ శృతి దగ్గర ఉంది అన్నారు.. ఎక్కడ శృతి దాన్ని పిలిపించండి.. మీకు గంట టైం ఇస్తున్నాను మా బాస్‌ వచ్చేలోగా ఆ పెన్‌ డ్రైవ్‌ మా చేతుల్లో ఉండాలి. లేదంటే చచ్చిపోతారు అని రౌడీలు వార్నింగ్‌ ఇచ్చి వెళ్లిపోతారు. మరోవైపు సతీష్‌ పిలిచాడని రాహుల్‌ ఆఫీసుకు వచ్చిన రాజ్‌ క్లయింట్స్‌ సతీష్ను తిడతారు. రాహుల్‌ తో కలిసి పని చేయడం తమకు ఇష్టం లేదంటారు. ఇంతలో రాహుల్‌ వచ్చి వాళ్లను తన మాటలతో కన్వీన్స్‌ చేసి అగ్రిమెంట్‌ చేసుకుంటాడు.

Advertisement

మరోవైపు అప్పు, రేణుకను స్టేషన్‌కు పలిచి అంజలి బతికే ఉందన్న క్లూ దొరికిందని చెప్తుంది. దీంతో రేణుకు హ్యపీగా ఫీలవుతుంది. కేసు గురించి కొన్ని విషయాలు అడుగుతుంది. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×