E-Paper
Advertisement

Brahmamudi Serial Today August 9th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  యామినికి కావ్య వార్నింగ్ – రాజ్ కు నిజం చెప్తానన్న కావ్య

Brahmamudi Serial Today August 9th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  యామినికి కావ్య వార్నింగ్ – రాజ్ కు నిజం చెప్తానన్న కావ్య
Advertisement

Brahmamudi serial today Episode:  రాజ్‌ వచ్చాడని తెలుసుకున్న యామిని దుగ్గిరాల ఇంటికి వస్తుంది. కావ్యను ఎందుకు రాజ్‌ను రిజెక్ట్‌ చేశావో ఒక్క కారణం చెప్పు అంటూ అడుగుతుంది. అది ఎంత పెద్దదైనా సరే నేను దగ్గరుండి సాల్వ్‌ చేసి మీ ఇద్దరిని ఒక్కటి చేస్తాను. మా బావ సంతోషం కంటే నాకు ఏదీ ముఖ్యం కాదు. చెప్పు కళావతి మా బావను వద్దు అనడానికి  నీ దగ్గర ఉన్న కారణం ఏంటి.? ఆ దేవుడి దయ వల్ల మా బావకు ఏమీ కాలేదు కాబట్టి సరిపోయింది. ఒకవేళ ఏదైనా అయ్యుండి తన ప్రాణాలు పోయి ఉంటే.. అని యామిని అనగానే.. కావ్య కోపంగా యామినిని కొడుతుంది. ఒక్కసారి ఆయన గురించి పిచ్చి వాగుడు వాగావంటే చంపేస్తాను.

ఆయన ఎక్కడ ఉన్నా క్షేమంగా ఉండాలి.. సంతోషంగా ఉండాలి. దానికోసం నా జీవితాన్ని పణంగా పెట్టడానికి నేను సిద్దంగా ఉంటాను అంటుంది. దీంతో యామిని ఓహో మా బావ ప్రాణానికి అంత విలువ ఇచ్చేదానివే అయితే మరి తన ప్రేమను ఎందుకు అంగీకరించడం లేదు. తను నీతో కలిసి ఏడడుగులు నడవాలనుకుంటే ఎందుకు ఒప్పుకోవడం లేదు. చూశావా బావ నీ మీద ఇష్టం ఉన్నట్టు నటిస్తుంది. కానీ ఎందుకు పెళ్లి చేసుకోవు అంటే మాత్రం తన దగ్గర సమాధానం లేదు. ఇదంతా చూస్తుంటే నీకు ఇంకా అర్థం కావడం లేదా..? బావ.  ఈ కళావతి నిన్ను మోసం చేస్తుంది. కావాలనే నీతో ఎమోషనల్‌గా ఆడుకోవాలని చూసింది. నువ్వు ఇష్టపడుతున్నావని తెలిసి తన వెంట తిప్పుకోవాలని చూసింది. ఇప్పుడు పెళ్లి అనే సరికి ముఖం చాటేస్తుంది. ఈ కళావతి ఒప్పుకుంటుందని ఇంకా నమ్మకం ఉందా బావ  అంటూ యామిని కావ్యను తిడుతుంది.

Advertisement

తన మీద నమ్మకం ఉంది కాబట్టే ఇంత దూరం ప్రయాణించాను. నన్ను వద్దు అనడానికి కళావతి వద్ద ఏ కారణాలు ఉన్నాయో నాకు తెలియదు కానీ ఇంత ప్రేమ చూపిస్తున్న ఈ కుటుంబాన్ని మాత్రం వదులుకోలేను. వీళ్ల మీద కోపంతో నీతో రాలేను. కళావతి గారు వద్దు అన్నంత మాత్రాన ఈ కుటుంబాన్ని ఎలా వదిలేస్తాను.. అంటాడు. యామిని అది కాదు బావ అంటుంటే.. యామిని అమ్మతో కాసేపు మాట్లాడి వస్తాను నువ్వు వెళ్లు అంటాడు రాజ్‌. ఇంతలో రుద్రాణి కలగజేసుకుని రాజ్‌, యామిని ఇంకా బాధపెట్టకు.. నీకోసం ఎంత కంగారు పడిందో తెలుసా..? మేమంతా ఇక్కడే ఉంటాము కదా…? నువ్వు ఎప్పుడైనా రావొచ్చు రామ్‌ అని చెప్తుంది.

ఇంద్రాదేవి కోపంగా తను ఇక్కడే ఉంటానంటే మధ్యలో నువ్వేంటి.. అమ్మా యామిని మీ బావను మేము ఏమీ చేయము రాత్రికి ఇంటికి వస్తాడు వెళ్లు.. అంటుంది. యామిని వెళ్లిపోతుంది. కావ్య వెనకాలే వెళ్తుంది. హలో యామిని ఇక నీ నాటకాలు ఆపేయ్‌.. నువ్వు ఎన్ని చేసినా ఆయన నా కోసం వచ్చాడు. మా ఇద్దరి మధ్య ఉన్నది బ్రహ్మముడి దాన్ని నువ్వేమీ చేయలేవు. ఏదో ఒక రోజు నేను ఆయనకు నిజం చెప్పే రోజు వస్తుంది. నువ్వు ఆయన్ని సొంతం చేసుకోవడానికి ఆడిన డ్రామాలు అన్ని బయట పెడతాను అంటూ వార్నింగ్‌ ఇస్తుంది. యామిని కూడా నువ్వే ఏదేదో చేస్తుంటే.. నేను చూస్తూ ఊరుకుంటానా..? నేను ఏదో ఒకటి  చేస్తాను. బావ నాకు దక్కకపోతే… ఇంకెవ్వరికీ దక్కనివ్వను అంటూ వెళ్ళిపోతుంది.

Advertisement

తర్వాత రాత్రికి అపర్ణ, ఇంద్రాదేవి ఇద్దరూ కలిసి రాజ్‌ను తిడతారు. ఒక్కసారి రిజెక్ట్‌ చేసిందని ఇంత దిగజారుతావా..? అంటూ క్లాస్‌ తీసుకుంటారు. ఇప్పుడు నీకు ఏం జరగలేదు కాబట్టి సరిపోయింది. కానీ ఏదైనా జరగరానిది జరిగితే ఏంటి పరిస్థితి.. కావ్య ఒప్పుకునేంత వరకు తిరగాలి.. అంతే కానీ ఇంత పిచ్చి పని చేయాలా..? అంటూ క్లాస్‌ తీసుకుంటారు. దీంతో రాజ్ సారీ చెప్పి వెళ్లబోతుంటే కావ్య వస్తుంది. కావ్యను చూసిన రాజ్‌ మీకు నా మీద ప్రేమ ఉందని తెలుసు.. కానీ మీరు నా ప్రేమను రిజెక్ట్‌ చేయడానికి ఏదో కారణం ఉంటుంది. ఆ కారణం ఏంటో తెలుసుకుంటాను అంత వరకు ప్రయత్నం చేస్తూనే ఉంటాను కళావతి గారు అని చెప్పి వెళ్లిపోతాడు రాజ్‌.

ఇంటికి వెళ్లిన రాజ్‌కు కోపంగా ఉన్న యామిని కనిపిస్తుంది. ఏంటి యామిని అలా ఉన్నావు అని అడుగుతాడు రాజ్‌. దీంతో యామిని కోపంగా కావ్యను తిడుతుంది. దీంతో రాజ్‌ కూల్‌గా కావ్య గురించి కావ్యకు తన మీద ప్రేమ ఉందని చెప్తాడు. దీంతో యామిని ఇరిటేటింగ్‌గా ఫీలవుతుంది. తర్వాత కావ్య హాస్పిటల్‌కు వెళ్తుంది. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×