E-Paper
Advertisement

Brahmamudi Serial Today August 22nd: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రాజ్‌కు నిజం చెప్పిన రుద్రాణి – షాక్‌లో రాజ్‌

Brahmamudi Serial Today August 22nd: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రాజ్‌కు నిజం చెప్పిన రుద్రాణి – షాక్‌లో రాజ్‌
Advertisement

Brahmamudi serial today Episode: ఎయిర్ ఫోర్ట్‌కు వెళ్తున్న రాజ్‌ను మధ్యలో వెళ్లి కలుస్తుంది రుద్రాణి మీరెందుకు వచ్చారని రాజ్‌ అడగ్గానే కావ్య రాదు కాబట్టే నేను వచ్చాను అని చెప్తుంది. ఎందుకు రాదు అని రాజ్‌ అడిగితే తను రాకూడదు కాబట్టి రాలేదు అని చెప్తుంది. నేను అమెరికా వెళ్తున్నాను అంటే తప్పకుండా వస్తుంది. నాకు నమ్మకం ఉంది తను తప్పకుండా వస్తుంది అంటాడు రాజ్‌. నేను కూడా అదే నమ్మకంతో చెప్తున్నాను. తను రాదు అని చెప్తుంది. ఏంటా నమ్మకం అని అడుగుతాడు రాజ్‌ తను నిన్ను ఫేస్‌ చేయలేదు కాబట్టి అని రుద్రాణి చెప్పగానే.. ఎందుకు ఫేస్‌ చేయలేదు అని రాజ్‌ అడుగుతాడు. నిజం బయటపడుతుంది కాబట్టి అని రుద్రాణి చెప్పగానే.. ఏంటా నిజం అని రాజ్‌ అడుగుతాడు. దీంతో అది నేను చెప్పలేను రామ్‌ అంటుంది రుద్రాణి. అబ్బా మీ అందరికీ ఏమైందండి అందరూ ఏదో నిజం ఉందంటారు. ఏంటా నిజం అంటే ఎవ్వరూ చెప్పరు ఎందుకు అయినా మీరు ఇప్పుడు ఇక్కడకు ఎందుకొచ్చారు చెప్పండి అని రాజ్‌ అడగ్గానే..

నిన్ను ఆపడానికి నువ్వు కావ్యను వదిలేసి ఇలా వెళ్లడం నాకు ఇష్టం లేదు.. అని రుద్రాణి చెప్పగానే.. రాజ్‌ కోపంగా అయితే మీరే ఉండండి నేను వెళ్లిపోతాను అంటూ రాజ్‌ కారు ఎక్కబోతుంటే.. కళావతి కడుపుతో ఉంది రామ్‌ అని రుద్రాణి చెప్తుంది. రుద్రాణి ఆ మాటకు రాజ్‌ షాక్‌ అవుతాడు. ఏంటండి మీరు చెప్పేది అంటూ తిరిగి వచ్చి అడుగుతాడు. అవును నేను చెప్పేది నిజం రామ్‌.. ఇన్ని రోజులు నువ్వు తన వెంట పడుతున్నా..? నీ ప్రేమను ఓప్పుకోకపోవడానికి కారణం తను ప్రెగ్నెంట్‌ అని చెప్తుంది. ఇంతలో అక్కడకు కావ్య వచ్చి ఏవండి మీతో ఒక విషయం చెప్పాలి అంటుంద. రాజ్‌ వెంటనే నువ్వు ప్రెగ్నెంటా..? అని అడుగుతాడు. కావ్య షాక్‌ అవుతుంది. నన్ను క్షమించు కళావతి రామ్‌ను ఆపడానికి నిజం చెప్పక తప్పలేదు అంటుంది రుద్రాణి.

Advertisement

ఇంతలో రాజ్‌ గట్టిగా నవ్వుతూ.. ప్లాన్‌ అదిరిపోయిందండి.. దీని మొత్తానికి సూత్రధారి ఎవరు..? మీరేనా..? అయినా మీరు కడుపుతో ఉన్నారంటే నేను ఎలా నమ్ముతాను అనుకున్నారు అంటూ మాట్లాడుతుంటే.. రుద్రాణి ఓరి తింగరోడా..? నేను చెప్పిందంతా అబద్దం అనుకున్నావా ఏంటి..? అని మనసులో అనుకుంటుంది. రాజ్‌ మాత్రం జోక్‌ అదిరిపోయిందండి. నవ్వలేక చచ్చిపోయాను అనుకోండి..  అయినా ఇలాంటి ప్రాంక్స్‌ అన్నీ వేరే వాళ్ల మీద వేసి ఉంటే నమ్మేవాణ్నేమో.. మీరేంటో.. మీ క్యారెక్టర్ ఏంటో తెలిసి కూడా పెళ్లి కాకుండానే.. మీరు కడుపుతో ఉన్నారని చెబితే నమ్మడానికి నేను పిచ్చోణ్ని అనుకున్నారా..? అంటాడు. రాజ్‌.

కావ్య మాత్రం అయ్యో రామ్ గారు నమ్మండి నేను చెప్పేది నిజం నేను ప్రెగ్నెంట్‌ ని మీకు దూరంగా ఉండటానికి.. మిమ్మల్ని పెళ్లి చేసుకోకుండా ఉండటానికి కారణం కూడా ఇదే నేను తల్లిని కాబోతున్నాను.. ఇక నమ్మడం నమ్మకపోవడం మీ చేతుల్లో ఉంది. అని చెప్పి కావ్య ఏడుస్తూ  వెళ్లిపోతుంది. కావ్య వెళ్లిపోయాక కళావతి గురించి నువ్వు బాగా అర్తం చేసుకున్నావు కదా రామ్‌.. తను ఏడుస్తూ చెప్పినా ఇంకా నమ్మవా..? తను కడుపుతో ఉంది. త్వరలోనే ఒక బిడ్డకు జన్మని కూడా ఇవ్వబోతుంది. ఇది నువ్వు నమ్మలేని నిజం అని చెప్పి రుద్రాణి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. రాజ్‌ షాకింగ్‌గా చూస్తుండిపోతాడు.

Advertisement

తర్వాత ఇంటికి వెళ్లిన రాజ్ కోపంగా అపర్ణ, ఇంద్రాదేవిలను బయటకు తీసుకెళ్లి కళావతి ప్రెగ్నెన్సీ రావడం ఏంటి అని నిలదీస్తాడు. నన్ను పెళ్లి చేసుకోకపోయినా కళావతి గారు ఇలా అబద్దం చెప్తున్నారు కదా..? అంటూ నిలదీస్తాడు. మీరైనా నిజం చెప్పండి నాన్నమ్మ అని అడుగుతాడు. దీంతో అపర్ణ, ఇంద్రాదేవి అది నిజమే కావ్య కడుపుతో ఉందని చెప్తారు. రాజ్ కోపంగా వాళ్లిద్దరిని తిట్టి కావ్యను అసహ్యించుకుని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. తర్వాత ఇంట్లోకి వెళ్లి అందరూ కలసి రుద్రాణిని తిడతారు. ఎందుకు నిజం చెప్పావు అంటూ నిలదీస్తారు. దీంతో రుద్రాణి అందరినీ తిట్టి వెళ్లిపోతుంది.

మరోవైపు యామిని తన తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లి బావతో నా పెళ్లి గురించి అడగండి అని చెప్తుంది. యామిని చెప్పినట్టే వెళ్లి వాళ్లు రాజ్‌ను పెళ్లి గురించి అడగ్గానే.. యామినిని నేను పెళ్లి చేసుకోలేను అంటూ వెళ్లిపోతాడు. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×