E-Paper
Advertisement

Brahmamudi Serial Today August 19th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: నిజం చెప్పిన కనకం – షాక్‌లో రుద్రాణి, రాహుల్‌   

Brahmamudi Serial Today August 19th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: నిజం చెప్పిన కనకం – షాక్‌లో రుద్రాణి, రాహుల్‌   
Advertisement

Brahmamudi serial today Episode: రాజ్‌ వెళ్లి కావ్యను పెళ్లి చేసుకుందామని అడగ్గానే.. ఇంకోసారి పెళ్లి అంటే బాగుండదని.. అలాగైతే ఇంటికి రావొద్దని.. ఎంత చెప్పినా ఇంకా వస్తానంటే నేనే ఎటైనా వెళ్లిపోతాను అంటుంది. దీంతో రాజ్‌ మీరు ఎక్కడికి వెళ్లొద్దు నేనే వెళ్లిపోతాను అంటూ రాజ్‌ చెప్పగానే.. స్వరాజ్ అంకుల్‌ అనుకుంటూ వస్తాడు. స్వరాజ్‌ను తీసుకుని రాజ్‌ వెళ్లిపోతాడు. కావ్య ఎమోషనల్‌ అవుతుంది. సారీ అండీ మీతో ఇలా కఠినంగా మాట్లాడక తప్పలేదు అని మనసులో అనుకుంటుంది.

లోపల కనకం హ్యాపీగా ఫీలవుతూ.. చూశారా వదిన గారు అల్లుడి గారితో అక్షింతలు ఎలా వేయించానో అంటుంది. చూశాములే చేతితో ఎలా వేయించావో అంటుంది ఇంద్రాదేవి. దీంతో కనకం అబ్బా కావ్యకు తన భర్త చేత అక్షింతలు వేయించామా లేదా..? అన్నదే చూడాల్సింది. ఎలా వేయించామా అన్నది కాదు.. చూశారా మనం అనుకున్నట్టుగానే వరలక్ష్మీ వ్రతం పూర్తి చేశాము అంటుంది. మరోవైపు రుద్రాణి రాహుల్‌ ను తిడుతుంది. రాహుల్ నన్నేం చేయమంటావు అమ్మ టాబ్లెట్‌ పని చేయకపోతే నేనేం చేయాలి అంటాడు. ఇంతలో అప్పు కళ్లు తిరిగి కింద పడిపోతుంది. రాహుల్‌, రుద్రాణి హ్యాపీగా ఫీలవుతారు. చూశామా మమ్మీ టాబ్లెట్‌ పని చేసింది అంటాడు రాహుల్‌. అవునురా..? దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్టు  ఆ రాజ్‌ ఉండగా పని చేసి ఉంటే బాగుండేది అంటుంది.

Advertisement

ఇక అందరూ అప్పును పట్టుకుని కంగారు పడుతుంటారు. ఇంతలో  స్వప్న డాక్టర్ కు ఫోన్‌ చేస్తుంది. డాక్టర్‌ వచ్చి అప్పును చెక్‌ చేస్తుంది. అప్పు కళ్లు తెరిచి చూసి ఏమైంది డాక్టర్‌ నాకు అసలు ఏమీ అర్థం కాలేదు అని అడుగుతుంది. దీంతో డాక్టర్‌ నీకు ఫుడ్‌ ఇన్ఫెక్షన్‌ అయింది అని చెప్తుంది. నేనేం తినలేదు డాక్టర్‌ ఇడ్లీ తప్పా ఏమీ తినలేదని చెప్తుంది అప్పు. దీంతో  మరేమైనా తీసుకున్నావా..? అంటూ డాక్టర్‌ అడగ్గానే.. రెగ్యులర్‌గా వాడే టాబ్లెట్‌ వాడాను అని చెప్తుంది అప్పు.  డాక్టర్‌ ఆ టాబ్లెట్‌ చూసి ఇది ఎక్స్‌ఫైర్‌ అయిపోయింది. ఇది ఎందుకు వేసుకున్నావు అంటూ బయటకు వచ్చి అందరికీ అదే విషయం చెప్పి డాక్టర్‌ వెళ్లిపోతుంది. వెంటనే రుద్రాణి ఏంటి కావ్య ఇది చూసుకోవాలి కదా..? ఇలా చేశావేంటి..? అని అడుగుతుంది. దీంతో అపర్ణ టాబ్లెట్‌ వేసుకుంది అప్పు అయితే కావ్యను ఎందుకు నిలదీస్తున్నావు అంటుంది. ఎందుకంటే  ఆ టాబ్లెట్‌ ఇచ్చింది కావ్య కాబట్టి అని రుద్రాణి చెప్పగానే అందరూ షాక్‌ అవుతారు.

ఏంటి కావ్య నేను చెప్పింది నిజమే కదా..? మార్నింగ్‌ అప్పుకు ఆ టాబ్లెట్‌ ఇచ్చింది నువ్వే కదా..? అని అడుగుతుంది. దీంతో అవును ఆ టాబ్లెట్‌ ఇచ్చింది నేనే కానీ..? అంటూ కావ్య అంటుండగానే ధాన్యలక్ష్మీ కోపంగా ఇంకా కానీ అంటూ మాట్లాడుతున్నావేంటి..?  అసలు ఏం చేయాలి అనుకుంటున్నావు నువ్వు.. నటించకు నీ మనసులో ఏముందో తెలుసుకోలేనంత అమాయకురాలిని ఏమీ కాదు నేను అంటుంది. దీంతో రుద్రాణి తనను అని ప్రయోజనం ఏముంది ధాన్యలక్ష్మీ నేను ముందు నుంచి నీకు చెప్తూనే ఉన్నాను. నీ కోడలిని జాగ్రత్తగా చూసుకోవాలి అని కానీ నువ్వే వినిపించుకోలేదు. ఇప్పుడు చూడు ఏమైందో.. అంటుంది. దీంతో ధాన్యలక్ష్మీ ఈ ఇంట్లో ఎవ్వరిని నమ్మినా నమ్మకపోయినా నిన్ను నమ్మాను.. కానీ మనసులో ఇంత కుట్ర పెట్టుకుని నా కొడలి కడుపును పోగొట్టాలని చూస్తావు అనుకోలేదు అంటుంది.

Advertisement

ధాన్యలక్ష్మీ ఏం మాట్లాడుతున్నావు నువ్వు కావ్య అలా చేస్తుందని అసలు నువ్వు ఎలా అనగలుగుతున్నావు.. తను ఏంటో నీకు తెలియదా..? పైగా తన చెల్లెలి కడుపును పోగొట్టాలని ఎందుకు  అనుకుంటుంది. అని అపర్ణ అడగ్గానే.. ఎందుకంటే.. తను తల్లి కాలేకపోయింది కాబట్టి అక్కా..?    ఈ ఇంటికి కోడలిగా మొదట అడుగుపెట్టింది తనే కాబట్టి తనే మొదటి వారసుడిని ఇవ్వాలని ఎన్నో  కలలు కనింది. కానీ రాజ్‌ తో గొడవలు పడటం వల్ల అది జరగలేకపోయింది. ఇప్పుడు తనకు దక్కని అదృష్టం అప్పుకు దక్కిందని ఈర్షతో ఈ పని చేసింది. నా మాట నిజం కాదని తనను చెప్పమనండి.. అంటుంది. దీంతో అపర్ణ కోపంగా నోటికి ఎంత మాటొస్తే అంత మాట అనేయడమేనా..? అసలు తను అంటూ అపర్ణ నిజం చెప్పబోతుంటే కావ్య ఆపేస్తుంది. ఏంటక్కా ఇది నువ్వేదో చెప్పాలి అనుకోవడం కావ్య ఆపేయడం నేను ఏమైనా తప్పు చేశానా..? అంటుంది.

దీంతో చిన్నత్తయ్యా అది ఎక్కడో పొనపాటు జరిగి ఉంటుంది అని కావ్య చెప్పగానే.. ధాన్యలక్ష్మీ పొరపాటు కాదు కావాలనే చేశావు అంటుంది. దీంతో అందరూ షాక్‌ అవుతారు. ధాన్యలక్ష్మీ కోపంగా కావ్యను తిడుతుంది. దీంతో కళ్యాణ్‌, కావ్యను వెనకేసుకొస్తే కళ్యాణ్‌ ను కూడా తిడుతుంది. కావ్యను గొడ్రాలు అంటూ తిడుతుంది. దీంతో కనకం కోపంగా ధాన్యలక్ష్మీని తిడుతూ కావ్య ఇప్పుడు గర్భవతి అంటూ నిజం చెప్తుంది. అందరూ షాక్ అవుతారు. ఇంతలో అప్పు బయటకు వచ్చి మా అమ్మ చెప్పింది నిజమే అత్తయ్యా అంటూ చెప్తుంది. కనకం ఏడుస్తూ అపర్ణ, ఇంద్రాదేవి లకు సారీ చెప్పి అక్కడి నుచి వెళ్లిపోతుంది. ధాన్యలక్ష్మీ బాధపడుతుంది. నేను పెద్ద తప్పు చేశాను.. వెంటనే కావ్యతో మాట్లాడాలి  అంటూ వెళ్తుంది. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×