E-Paper
Advertisement

Brahmamudi Serial Today August 18th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  అందరి ముందు కావ్యను కడుపు వచ్చిందన్న స్వరాజ్‌ – అయోమయంలో పడిపోయిన రాజ్‌

Brahmamudi Serial Today August 18th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  అందరి ముందు కావ్యను కడుపు వచ్చిందన్న స్వరాజ్‌ – అయోమయంలో పడిపోయిన రాజ్‌
Advertisement

Brahmamudi serial today Episode: గార్డెన్‌లో చాక్లెట్‌ తింటున్న జూనియర్ స్వరాజ్‌ దగ్గరకు వెళ్తుంది రుద్రాణి. నీకు చాక్లెట్‌ ఇచ్చిన కావ్యకు కంగ్రాట్స్‌ చెప్పవా అని అడుగతుంది. చాక్లెట్‌ ఇస్తే ఎవరైనా థాంక్స్‌ చెప్తారు కానీ కంగ్రాట్స్‌ ఎందుకు చెప్తారు అని స్వరాజ్‌ అడగ్గానే.. చాక్లెట్‌ ఇస్తే థాంక్స్‌ చెప్పాలి స్వరాజ్‌ కానీ నీకు చాక్లెట్‌ ఇచ్చిన ఆంటీ నీతో ఆడుకోవడానికి ఒక బుల్లి స్వరాజ్‌ను ఇస్తుంది కదా..? అందుకని కంగ్రాట్స్‌ చెప్పమంటున్నాను అని రుద్రాణి చెప్పగానే.. ఏంటి ఆంటీ నాకు ఫ్రెండ్‌ను ఇవ్వబోతుందా..? అయితే ఇప్పుడే కగ్రాట్స్‌ చెప్పి వస్తాను ఇప్పుడు తను ఎక్కడ ఉంది అని అడుగుతాడు. లోపల హాల్లో ఉంది వెళ్లు వెళ్లి కంగ్రాట్స్‌ చెప్పు అంటుంది. ఆలాగే అంటూ స్వరాజ్‌ వెళ్లిపోతాడు. కావ్య ఇక నువ్వు ప్రెగ్నెంట్‌ అనే విషయాన్ని బయట పడకుండా ఎలా ఆపుతావో నేను చూస్తాను అనుకుంటుంది రుద్రాణి.

లోపలికి పరుగెత్తుకుంటూ వెళ్లిన స్వరాజ్‌ నేరుగా కావ్య దగ్గరకు వెళ్లి కంగ్రాట్స్‌ ఆంటీ అంటాడు. నాకెందుకు చెప్తున్నావురా..? అని కావ్య అడగ్గానే.. నువ్వు కడుపుతో ఉన్నావు కదా..? త్వరలోనే నువ్వు నాకు ఒక ఫ్రెండ్‌ను ఇస్తున్నావు కదా… అందుకే చెప్తున్నాను ఆంటీ అని స్వరాజ్‌ అనగానే అందరూ షాక్‌ అవుతారు. ఏంటి ఆంటీ అలా చూస్తున్నావు.. నేను తెలుసుకుని వచ్చి కంగ్రాట్స్‌ చెబితే కనీసం థాంక్స్‌ కూడా చెప్పవా..? అంటూ అడుగుతాడు. దీంతో రుద్రాణి ఇప్పుడు ఆ కావ్య ఏం చెప్తుందో నేను చూస్తాను.. అంటుంది. రాహుల్ కూడా నేను చూస్తాను.. అంటాడు. ఇంతలో కనకం ఒరేయ్‌ నా కూతురు కడుపుతో ఉందని నీకెలా తెలుసు..? అని అడుగుతుంది. తెలుసుకున్నాను అని స్వరాజ్‌ చెప్పగానే.. అదేరా ఎలా తెలుసుకున్నావు..? అని అడుగుతుంది కనకం.

Advertisement

అదిగో ఆ ఆంటీ చెప్పింది అని రుద్రాణిని చూపిస్తాడు స్వరాజ్‌. దీంతో రాహుల్‌ నీకు అసలు బుద్ది ఉందా..? చిన్న పిల్లలకు ఏం చెప్పాలో ఏం చెప్పకూడదో తెలియదా..? అంటూ తిడుతుంది ఇంద్రాదేవి. రాజ్‌ వచ్చి ఇప్పుడు చిన్న పిల్లాడికి ఏ విషయం చెప్పాలా చెప్పకూడదా అనేది ఇంపార్టెంట్‌ కాదు నాన్నమ్మ. కళావతి కడుపుతో ఉందని ఎందుకు చెప్పింది అని అడుగుతాడు. రుద్రాణి భయంగా కావ్య నరు తెరచి నిజం చెప్తుంది అనుకుంటే ఇది అటూ తిరిగి ఇటు తిరిగి నా మీదకు వచ్చిందే..? ఇప్పుడు ఎలా అని మనసులో అనుకుంటుంది. ఏంటి రుద్రాణి గారు కళావతి కడుపుతో ఉందని చెప్పారా.? అని రాజ్‌ అడగ్గానే.. అవును కడుపుతో ఉందని చెప్పాను.. కానీ నేను వాడికి చూపించింది అప్పును వాడు వెళ్లి కళావతిని అడిగాడు దానికి నేనేం చేయను.. అంటుంది.

దీంతో విన్నారా..? బాబు రుద్రాణి గారు మా అప్పును చూపిస్తే.. వాడు కళావతిని అడిగాడంటా అంటుంది కనకం. దీంతో రాజ్ ఒక్క నిమిషం నా గుండె ఆగినంత పనైంది తెలుసా..? అనగానే.. కనకం నాకు కూడా.. అంటుంది. దీంతో రాజ్‌ మీకు ఎందుకు టెన్షన్‌ అంటాడు.. దీంతో కనకం ముందు మీరు ఎందుకు టెన్షన్‌ పడ్డారు చెప్పండి అని అడుగుతుంది. పెళ్లి కాకుండానే కళావతి గారికి కడుపు వచ్చిందంటే టెన్షన్‌ పడరా..? అంటాడు రాజ్‌. నేను కూడా అందుకే పడ్డాను బాబు అంటుంది కనకం. అసలు ఇదంతా ఆ బాబు వల్లే వచ్చింది అంటుంది రుద్రాణి . ఇంద్రాదేవి కోపంగా  కాదు నీ వల్ల వచ్చింది. ఆ దేవుడు నీకు నోరు ఇచ్చారు కదా..? అప్పు కడుపుతో ఉందని చెప్పాలా..? వేలు పెట్టి చూపించాలా..? అంటుంది.

Advertisement

దీంతో రుద్రాణి ఇది మరీ బాగుంది అమ్మా నాకేం తెలుసు ఇలా జరుగుతుందని చెప్తుంది. అయినా మీరేంటి కళావతి గారు అలా షాక్‌లో ఉండిపోయారు. వాడు అడగ్గానే నిజం చెప్పొచ్చు కదా..? అంటాడు రాజ్‌. ఇంతలో కనకం అంటే బాబు మనం అందరం ఎలా షాక్‌ అయ్యామో తను కూడా షాక్‌ అయ్యుండొచ్చు కదా..? అంటుంది. ఇంద్రాదేవి కూడా అవును అంతే అంటుంది. ఇంతలో పంతులు వ్రతానికి మూహూర్తం దగ్గర పడుతుందని పిలవగానే అందరూ పూజ దగ్గరకు వెళ్తారు. పూజ అయిపోతుంది. రాజ్‌ అక్షింతలు అందరికీ ఇస్తాడు. ఒక్కోక్కరుగా తమ భర్తల దగ్గర అక్షింతలు తీసుకుంటారు కనకం నాటకం ఆడి రాజ్‌ చేత కావ్యకు అక్షింతలు వేయిస్తుంది. రుద్రాణి, రాహుల్ షాక్‌ అవుతుంది. పంతులు వచ్చి ఇక వ్రతం నిర్విఘ్నంగా జరిగింది అని చెప్పగానే అందరూ హ్యపీగా ఫీలవుతుంది.

తర్వాత రాజ్‌, కావ్యను గార్డెన్‌ లోకి తీసుకెళ్లి నా చేతిలో అక్షింతలు అనుకోకుండా మీ తల మీద పడితేనే ఇంట్లో వాళ్లు ఎంతో హ్యాపీగా ఉన్నారు. ఇక మనం పెళ్లి చేసుకని నేను నీకు జీవితాంతం తోడు ఉంటే వాళ్లు ఎంత సంతోషిస్తారో కదా..? కారణం ఏంటో తెలియడం లేదు కానీ నా మనసు మిమ్మల్ని తప్పా ఎవరిని యాక్సెప్ట్‌ చేయడం లేదు అంటూ రాజ్‌ చెప్తుండగానే.. కావ్య ఎమోషనల్‌ అవుతుంది. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×