E-Paper
Advertisement

Brahmamudi Serial Today August 13th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రుద్రాణికి అప్పు వార్నింగ్‌ – ఇంట్లో వాళ్లకు షాక్‌ ఇచ్చిన ధాన్యలక్ష్మీ  

Brahmamudi Serial Today August 13th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రుద్రాణికి అప్పు వార్నింగ్‌ – ఇంట్లో వాళ్లకు షాక్‌ ఇచ్చిన ధాన్యలక్ష్మీ  
Advertisement

Brahmamudi serial today Episode: అప్పు, కావ్యలు మామిడి కాయలు తింటుంటే అక్కడకి వచ్చిన రుద్రాణికి పిచ్చి పట్టేలా చేస్తుంది అప్పు. దీంతో రుద్రాణి కోపంగా అటుగా వెళ్తున్న ఇంద్రాదేవిని పిలుస్తుంది. ఏంటి రుద్రాణి అంటూ వచ్చిన ఇంద్రాదేవికి మీరే చెప్పండి అమ్మమ్మ గారు నేను అక్క కోసం అని ఈ మామిడి కాయలు తీసుకొస్తే.. ఈ రుద్రాణి గారు ఇవి పుల్లగా ఉన్నాయని ఇలాంటి పుల్లటి మామిడి కాయలు కడుపుతో ఉన్న వాళ్లు మాత్రమే తింటారని ఏదేదో అంటున్నారు.. అని చెప్తుంది. దీంతో అనడం కాదు అవి నిజంగానే పుల్లగా ఉన్నాయి. కావాలంటే ఒకసారి మా అమ్మను కూడా తిని చూడమను అంటుంది రుద్రాణి.

దీంతో ఏది ఇటివండి అని ఇంద్రాదేవి తింటుంది. పుల్లగా ఉన్నాయి కదా అమ్మా అంటుంది. నీ ముఖం ఇంత తియ్యగా ఉంటే పుల్లగా ఉన్నాయంటావేంటి..? అంటుంది. మరి రియాక్షన్‌ ఏంటి అలా పెట్టావు అని అడుగుతుంది రుద్రాణి. నీ రియాక్షన్‌ ఎలా ఉంటుందో చూద్దామని అంటూ ఇంద్రాదేవి చెప్పగానే.. కావాలంటే ఇంకొకటి తిని చూడండి రుద్రాణి గారు అంటుంది కావ్య. దీంతో  ఇంకొకటి తీసుకుని తిన్న రుద్రాణి అసలు మీ అందరికీ ఏమైంది ఇంత పుల్లగా ఉంటే తియ్యగా ఉన్నాయంటారేంటి..?  మీ వల్ల నోరంతా పాడై పోయింది. అర్జెంట్‌గా మౌత్‌ వాష్‌ చేసుకోవాలి అంటూ రుద్రాణి వెళ్లిపతుంది. రుద్రాణి వెళ్లిపోయాక కావ్య, ఇంద్రాదేవికి థాంక్స్‌ చెప్తుంది. థాంక్స్‌ ఏమీ వద్దు కానీ రుద్రాణితో జాగ్రత్తగా ఉండమని చెప్పి వెళ్లిపోతుంది.

Advertisement

స్వప్న, కనకానికి ఫోన్‌ చేసి అప్పు ప్రెగ్నెంట్‌ అయిందని చెప్తుంది. ఇద్దరూ హ్యాపీగా మాట్లాడుకుంటారు. ఇంతలో స్వప్న.. కావ్య, రాజ్‌ మధ్య జరిగిన విషయం చెప్తుంది. రాజ్‌ పెళ్లి చేసుకుందాం అని ప్రపోజ్‌ చేస్తే పెళ్లి చేసుకోనని చెప్పింది అంటూ జరిగింది మొత్తం చెప్తుంది. దీంతో కనకం కోపంగా కావ్యను తిడుతుంది. రేపు వచ్చి దాని సంగతి చెప్తాను అంటుంది.

తర్వాత అప్పును పిలిచిన ధాన్యలక్ష్మీ తన ఏడు వారాల నగలు తీసుకురమ్మని ప్రకాష్ కు చెప్పి నగలు తీసుకొచ్చాక అప్పుకు ఇస్తుంది. దీంతో రుద్రాణి తట్టుకోలేక ఏంటి ధాన్యలక్ష్మీ సడెన్‌గా నువ్వేంటి ఇంత చేంజ్‌ అయ్యావు అని అడుగుతుంది. దీంతో చేంజ్‌ అవ్వక అందరూ నీలా ఉంటారు అనుకుంటున్నావా..? ఏంటి రుద్రాణి అంటూ ఇంద్రాదేవి తిడుతుంది. మా ధాన్యానికి తన కోడలి మీద ప్రేమ పుట్టింది నగలు ఇస్తుంది. తప్పేం ఉంది. అప్పు నువ్వు నగలు తీసుకో..? అని చెప్పగానే.. ప్రకాష్‌ కలగజేసుకుని వదిన అది అప్పు మీద ప్రేమతో ఇవ్వడం లేదు. తన కడుపులో పెరుగుతున్న బిడ్డ మీద ఇస్తుంది. ఏం ధాన్యం అంతేనా..? అంటాడు. ఎవరి మీద ప్రేమతో ఇస్తే ఏంటి ప్రకాషం. మొత్తానికి ధాన్యలక్ష్మీ అప్పును కోడలిగా యాక్సెప్ట్‌ చేసింది అది చాలు అంటాడు.

Advertisement

ఇంతలో చేయకుండా ఎలా ఉంటుంది అన్నయ్యగారు.. ఇప్పుడు తన కడుపులో వారసుడు పెరుగుతున్నాడు కదా అంటూ ఎంట్రీ ఇస్తుంది కనకం. కనకాన్ని చూసిన అప్పు ఎమోషనల్‌ అవుతుంది. తర్వాత కనకం కోపంగా కావ్యను తిడుతుంది. ఇంతలో రాజ్‌ వచ్చి అదీ అలా అడగండి ఆంటీ.. చెప్పడి కళావతి గారు మీ అమ్మగారు అడుగుతున్నారు కదా చెప్పండి..? ఎందుకు నాతో పెళ్లి వద్దన్నాతో దానికి కారణం చెప్పండి అంటాడు. దీంతో ఏంటండి చెప్పేది మీతో పెళ్లికి ఒప్పుకోవడం ఒప్పుకోకపోవడం అనేది నా పర్సనల్‌ విషయం. మీ అందరికీ నేనెందుకు చెప్పాలి అంటుంది కావ్య.  అందుకే తల్లిగా నేను అడుగుతున్నాను కారణం ఏంటో నాకు చెప్పు అంటుంది కనకం. దీంతో అమ్మ నువ్వు ఇప్పుడు అప్పును చూడటానికి వచ్చావా..? ఇలా అందరి ముందు తిట్టి దోషిని చేయడానికి వచ్చావా..? అంటూ కావ్య  అడగ్గానే.. ఏం చేయాలో నాకు తెలుసు..? కానీ నువ్వు అల్లుడు గారితో పెళ్లి ఎందుకు వద్దంటున్నావో నాకు తెలియాల్సిందే..? అంటుంది. ఇంతలో అపర్ణ కూడా కనకం తర్వాత చెప్తా అంటుంది కదా..? చెప్తుందిలే.. అంటుంది. అయినా కనకం వినకుండా గట్టిగా అడిగేస్తుంది. దీంతో కావ్య కోపంగా కనకాన్ని తిట్టి ఇంకోసారి ఇక్కడకు రావొద్దు అంటూ వెళ్లిపోతుంది.

దీంతో కనకం బాధపడుతుంటే.. ఇంద్రాదేవి, అపర్ణ ఇద్దరూ కలిసి కనకాన్ని పక్కకు తీసుకెళ్లి నిజం చెప్తారు. దీంతో కనకం సంతోషంగా నిజంగానా..? నమ్మలేకపోతున్నాను అంటూ ఏడుస్తూ కావ్య దగ్గరకు వెళ్తుంది కనకం. కావ్యను చూసి ఏడుస్తుంది. కనకం ఏడుస్తుంది. ఇద్దరూ మాట్లాడుకోవడం దొంగచాటుగా వింటుంటే.. స్వప్న వచ్చి కోపంగా తిడుతుంది. రుద్రాణి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. కింద కనకం కోసం రాజ్‌ వెయిట్‌ చేస్తుంటాడు. ఇంతలో కనకం వస్తుంది. రాజ్‌ ఆత్రుతగా ఆంటీ నాతో పెళ్లి వద్దనడానికి కారణం ఏంటో కావ్య చెప్పిందా అని అడగ్గానే చెప్పింది అల్లుడు గారు కానీ అంతా మీ చేతుల్లోనే ఉంది బాబు అంటూ వెళ్లిపోతుంది కనకం. దీంతో రాజ్‌ కన్పీజ్‌ అవుతాడు. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×