E-Paper
Advertisement

Brahmamudi Serial Today Episode April 30th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇందును చంపేస్తానన్న రాజు

Brahmamudi Serial Today Episode April 30th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇందును చంపేస్తానన్న రాజు
Advertisement

Brahmamudi serial today Episode: ఫంక్షన్‌ అయిపోయాక ఫంక్షన్‌ అయిన ఖర్చు కన్నా డబుల్‌ వచ్చిన వాళ్ల దగ్గర చదివింపులు వసూలు చేయాలని లక్కీ, రాజు నిర్ణయిస్తారు. అనుకున్నట్టుగానే.. భోజనం చేసి వెళ్తున్న వాళ్లను చదివింపులు ఇవ్వమని అడుగుతుంటారు. ఇందు చూసి తిడుతుంది. సారీ బాబాయ్‌ చదివింపులు ఏమీ లేవు మీరు వెళ్లండి చెప్పి ఆయన వెళ్లిపోగానే.. అసలు మీ గురించి మీరు ఏమనుకుంటున్నారు. అనగానే.. మీరు ఏమనుకుంటున్నారో అది చెప్పండి అంటాడు లక్కీ.. అసలు మీకు బుద్ది లేదు అనుకుంటున్నాను. ఎవరైనా ఇలా చదివింపులు తీసుకుంటారా..? అని ఇందు అడగ్గానే..

లక్కీ ఎందుకు తీసుకోరు పెళ్లిళ్లు, బర్తుడే పార్టీలు ఇలా ఏ పార్టీ చేసినా చదివింపులు తీసుకుంటారు కదా ఫంక్షన్‌కు ఖర్చు చేసిన డబ్బుల్లో సగం చదివింపులు తెచ్చిపెడతాయి తెలుసా..? అని చెప్పగానే.. ఇందు కోపంగా మనం పెళ్లి చేయలేదు పెళ్లి రోజు సెలబ్రేట్‌ చేశాం.. అని చెప్పగానే.. ఆ ఫంక్షన్‌లో భోజనం చేసి చదివింపులు పెట్టి వెళ్లిపోతారు. ఇక్కడ కూడా భోజనం చేసి వెళ్లిపోతారు కదా చదివింపులు అక్కడ తీసుకోవడం ఎందుకు ఇక్కడ ఎందుకు తీసుకోకూడదు అని చెప్పగానే.. ఇందు తిడుతుంది.

Advertisement

దీంతో రాజు కూడా నేను వద్దన్నాను.. కానీ వీడు వినడం లేదు. డబ్బా తెచ్చి మరీ డబ్బులు వసూలు చేద్దాం అన్నాడు అంటూ చెప్పగానే.. ఇందు కోపంగా ఇక ఆపుతానా నీ నాటకాలు తనకు అంత నాలెడ్జీ లేదు. మీరేం చేసినా ప్లాన్‌ నీది.. ఫాలో అయ్యేది తను.. ఇలాంటి పనులు చేయకు అది నేను ఉండగా చేయకు నాకు నచ్చదు.. కొంచెం బుద్దిగా ఉండండి.. లేకపోతే నేనేం చేస్తానో తెలుసుగా.. అంటూ చెప్పగానే.. లక్కీ తెలుసు సిస్టర్‌ నువ్వు వెళ్లు ఇక్కడ టేబుల్‌ ఉండదు.. వసూలు చేయడం ఉండదు అని చెప్పగానే.. ఇందు వెళ్లిపోతుంది. లక్కీ మాత్రం నవ్వుతూ ఒరేయ్‌ మామ నువ్వు ప్లేట్‌ తిప్పేసినా తను మాత్రం మన క్యారెక్టర్స్‌ బాగా చదివేసిందిరా..? అంటాడు.

తర్వాత అందరూ ఇంట్లో కూర్చుని ఉండగా ఇందు అందరికీ పాయసం తీసుకొచ్చి ఇస్తుంది. పాయసం తీసుకున్న చలపతి హ్యాపీగా ఉంది తల్లి.. నీ వల్లే ఈ ఫంక్షన్‌ ఇంత గ్రాండ్ గా జరిగింది. వచ్చిన వాళ్లందరూ మమ్మల్ని అప్యాయంగా పలకరిస్తుంటే.. ఇది చాలు అనిపించింది. లైఫ్‌లో ఈ రోజు మాత్రం మర్చిపోలేము అమ్మ.. అని చెప్పగానే.. లక్ష్మీ కూడా అవునమ్మా..? మాకు ఇద్దరు కొడుకులు ఉన్నారు కానీ ఏనాడు ఇలా చేయలేదు.. నీలాంటి అమ్మాయి మా ఇంటి కోడలు అయితే బాగుండు అనిపిస్తుంది అంటుంది. చలపతి కూడా ఏ చిన్న లోటు కూడా లేకుండా ఫంక్షన్‌ చాలా బాగా చేశావమ్మా అంటూ చెప్తుండగానే.. ఒక్కటి తగ్గింది అంటూ రాజుకు డబ్బులు ఇచ్చిన రౌడీ సాహు వస్తాడు. ఏం తగ్గింది నీకు పాయసం ఇవ్వడం తగ్గిందా ఇదా తీసుకో అంటూ చలపతి పాయసం ఇస్తాడు.

Advertisement

అయినా సాహు ఒక్కటి తగ్గింది. ఒక్కటి తగ్గింది అంటుంటే ఆ ఒక్కటి ఏంటో నువ్వే చెప్పరా అంటాడు చలపతి. అదే బావగారు కేక్‌ తగ్గింది. ఓరేయ్‌ ఆ కేక్‌ ఇటు తీసుకురండిరా అని చెప్పగానే.. రౌడీలు కేక్‌ తీసుకొస్తారు. సాహుతో పాటు అందరూ కలిసి ఆ కేక్‌ కట్‌ చేయిస్తారు. రాజు, లక్కీ మాత్రం టెన్షన్‌ పడుతుంటారు. కేక్‌ కట్‌ చేసిన చలపతి, లక్ష్మీకి తినిపించబోతుంటే.. రాజు కేక్‌ తినొద్దు నాన్న అంటాడు. సాహు మాత్రం ఏంటి ఆ కేక్‌ లో విషం కలిపానని డౌటా అలాంటిదేం లేదు.. బావ గారు మీరు తినండి.. అక్కకు తినిపించండి అంటూ చెప్పగానే.. చలపతి లక్ష్మీ, రాజు లకు కేక్‌ తినిపిస్తాడు. ఇంతలో సాహు బావగారు మీరు కేక్‌ తింటూ ఉండండి.. రాజు నేను బయటకు వెళ్లి కాస్త మాట్లాడుకుని వస్తాము అంటూ రాజును తీసుకుని బయటకు వెళ్లి రాజును డబ్బులు అడుగుతాడు.

24 గంటల్లో డబ్బులు ఇవ్వకపోతే మీ వాళ్ల ఆయుష్సు రేఖ తగ్గిపోతూ ఉంటుంది. అంటూ వార్నింగ్‌ ఇచ్చి వెళ్లిపోతాడు. రాజు కోపంగా రేఖకు ఫోన్‌ చేసి డబ్బులు అరైంజ్‌ అయ్యాయా..? అని అడుగుతాడు. లేదు.. ఇంకా కాలేదు.. అని రేఖ చెప్పగానే.. మీరు కిడ్నాప్‌ను చాలా లైట్‌ గా తీసుకున్నట్టున్నారు. ఇంకో 24గంటల్లో డబ్బులు ఇవ్వకపోతే మీ అమ్మాయిని చంపేస్తాను అంటూ వార్నింగ్ ఇచ్చి కాల్‌ కట్‌ చేస్తాడు రాజు. పక్కనే ఉన్న లక్కీ షాక్‌ అవుతాడు. మరోవైపు రేఖ డబ్బుల గురించి ఆలోచిస్తూ టెన్షన్‌ పడుతుంది. మరోవైపు ఆఫీసులో ఉన్న శృతి రాజ్‌, కావ్యలను గుర్తు చేసుకుని ఎమోషనల్‌ అవుతుంది.

మరోవైపు రేఖ డబ్బులు ఇవ్వకపోతే ఏంటి పరిస్తితి అని రాజు ఆలోచిస్తుంటాడు. ఇందు వచ్చి ఏంటి ఆలోచిస్తున్నావు.. డబ్బుల గురించా అంత డబ్బు ఒకేసారి వస్తే ఏం చేయాలో ప్లాన్‌ చేస్తున్నావా..? అంటూ అడుగుతుంది. నీకు అద్బుతమైన ఫ్యామిలీ ఉంది. డబ్బుల కోసం ఎందుకు అడ్డదారి తొక్కుతున్నావు అంటూ అడుగుతుంది. దీంతో డబ్బులు లేకపోతే ఎలాంటి పరిస్థితులు ఉంటాయో నీకేం తెలుసు..? మాకు తెలుసు అంటూ తన కష్టాలను చెప్తాడు రాజు. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×