E-Paper
Advertisement

Brahmamudi Serial Today Episode April 29th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: చలపతి మాటలకు ఎమోషనల్ అయిన ఇందు, నందు 

Brahmamudi Serial Today Episode April 29th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: చలపతి మాటలకు ఎమోషనల్ అయిన ఇందు, నందు 
Advertisement

Brahmamudi serial today Episode: లక్కీ హ్యాపీగా అందరికీ నిమ్మరసం ఇచ్చామని ఇక ఎవ్వరూ కూడా ఎక్కువగా చికెన్‌ తినరని మన కోసం దాచుకోవచ్చని రాజుతో చెప్తుంటే నందు వచ్చి అంత లేదు ఎవ్వరికైనా కప్పు చికెన్‌ మాత్రమే అయినా మీరు తీసుకొచ్చిన చికెన్‌ను వీళ్లకు సరిపెట్టడమే ఎక్కువ ఇంకా పక్కకు పెడతాడంట ఏం మనిషివి నువ్వు అంటూ తిట్టగానే.. లక్కీ కోపంగా ఇప్పుడు నేను ఏమన్నాను అని అలా అంటున్నావు. ఓరేయ్‌ మామ నేను ఉండనురా వెళ్లిపోతాను అని వెళ్లబోతుంటే.. నందు వెళితే వెళ్లు  ఎవరిని బెదిరిస్తున్నావు అంటుంది. దీంతో లక్కీ నాకు ఇంత అవమానం జరిగిన తర్వాత కూడా నేను ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండను. మీరే ఫంక్షన్‌ చేసుకోండి.. ఆ ఒక్క కప్పు చికెన్‌ మీరే తినండి.. అంటూ రాజు చేయి పట్టుకుని వెళ్తున్నానురా అంటూ ఆగిపోతూ.. అరేయ్‌ మామ నీవు కూడా నేను వెళ్లిపోతుంటే ఉండమని అనడం లేదు.. అనగానే..

రాజు కోపంగా రేయ్‌ సైలెంట్‌గా ఉండు అని చెప్పగానే.. లక్కీ చూశారా..? మా వాడు ఉండమన్నాడు కాబట్టి ఉండిపోతున్నాను.. అరేయ్‌ మామ ఆకలి దంచేస్తుందిరా భోజనాలు స్టార్ట్‌ చేద్దామా..? అనగానే.. ఇంకెంచెం ఓపిక పట్టు అంటూ ఇందు చెప్తూ.. వెంకట్‌ దండలు తీసుకొచ్చి ఇవ్వగానే.. అవి లక్ష్మీ, చలపతిలకు ఇస్తూ.. మీరిద్దరూ ఈ దండలు మార్చుకోండి అని చెప్తుంది. లక్ష్మీ, చలపతి దండలు మార్చుకుంటారు. తర్వాత వాళ్లకు స్వీటు ఇచ్చి ఒకరికొకరు తినిపించుకోమని చెప్తుంది. స్వీట్లు తినిపించుకున్న తర్వాత అందరూ వాళ్లను విష్‌ చేస్తారు. తర్వాత ఇందు అంకుల్‌ మీకు పెళ్లై 25 సంవత్సరాలు అయింది కదా..? ఈ ఇరవై అయిదు సంవత్సరాల్లో ఒకరికొకరు సాగించిన మీ జీవిత ప్రయాణం గురించి మాతో షేర్‌ చేసుకోండి అని చెప్తుంది. దీంతో చలపతి ఏం చెప్పాలమ్మా..? ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి..? ఎలా మొదలు పెట్టాలో అర్థం కావడం లేదు.. అంటూ సిగ్గు పడుతుంటే.. ఈ మేడం గారు చెప్పే వరకు ఊరుకునేలా లేరు.. అందరూ మనవాళ్లే కదా చెప్పండి అంటుంది లక్ష్మీ.

Advertisement

దీంతో చలపతి, లక్ష్మీ తన జీవితం గురించి చెప్పడం మొదలుపెడతాడు. వాళ్లిద్దరి మాటలు వింటున్న రాజు, వెంకట్‌ ఎమోషనల్‌ అవుతారు. ఒకరిని ఒకరు హగ్‌ చేసుకుని హ్యాపీగా ఉంటారు. వాళ్లను చూసిన ఇందు ఏడుస్తుంటే.. నందు చూసి అక్కా ఏమైందక్కా అని అడుగుతుంది. దీంతో ఇందు ఏం లేదు.. మా అమ్మానాన్న గుర్తుకు వచ్చారు. ఒకవేళ వాళ్లు ఉండి ఉంటే చాలా బాగుండేది అనగానే.. నందు కూడా నా జీవితం కూడా బాగుండేది అనగానే.. ఇందు ఏంటి అంటున్నావు..? అని అడగ్గానే.. ఏం లేదు అక్కా వాళ్లు ఉండి ఉంటే అంటున్నావు వాళ్లు లేరా..? అని అడగ్గానే.. ఇందు ఏడుస్తూ.. లేరు చనిపోయారు. నేను పెద్దింట్లో అందరి మధ్య ఉంటాను. కానీ మా అమ్మానాన్న లేని లోటు ప్రతిక్షణం నాకు తెలుస్తుంది అంటూ ఏడుస్తూంటే..

నందు కూడా అవునక్కా వాళ్లు ఉండి ఉంటే మన లైఫ్‌ వేరేలా ఉండేది అని మనసులో అనుకుని బాధపడుతుంది. ఇంతలో ఇందు అవును మీ అమ్మానాన్న ఏం చేస్తుంటారు అని అడగ్గానే.. నందు కూడా లేరు బాబాయ్‌ మాత్రమే ఉన్నారు.. మనం తెలిసో తెలియకో ఇద్దరం ఒకే పడవలో ప్రయాణిస్తున్నాం అంటూ ఇద్దరూ ఎమోషనల్‌ అవుతారు. తర్వాత అందరికీ భోజనాలు రెడీ చేస్తారు. అందరూ భోజనం చేస్తుంటే.. వెనక నుంచి దొంగచాటుగా వెళ్లిన లక్కీ రెండు కప్పుల చికెన్‌ తీసుకెళ్తుంటే.. ఇందు పట్టుకుని తిడుతుంది. తర్వాత వెంకట్‌, నందు దగ్గరకు వెళ్లి నా పెళ్లిలో కూడా ఇలాగే వచ్చి వడ్డిస్తావా..? అని అడుగుతాడు. నేను లేకుండా నీ పెళ్లి ఎలా జరుగుతుందిరా.. మాటలు ఆపి ముందు పని చూడరా అని చెప్తుంది.  మరోవైపు లక్కీ, రాజు ఇద్దరూ కలిసి వచ్చిన వాళ్ల దగ్గర చదివింపులు తీసుకోవాలని చూస్తే.. ఇందు చూసి కోపంగా తిడుతుంది. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

Advertisement

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×