E-Paper
Advertisement

Brahmamudi Serial Today Episode April 25th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇంటికి వచ్చిన ఇందును చూసి కంగారు పడ్డ చలపతి

Brahmamudi Serial Today Episode April 25th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇంటికి వచ్చిన ఇందును చూసి కంగారు పడ్డ చలపతి
Advertisement

Brahmamudi serial today Episode: ఇంటికి వచ్చిన రాజు, ఇందులను చూసి వెంకట్‌ షాక్ అవుతాడు. వెంటనే అటూ చూడండి నాన్న అంటాడు. లక్ష్మీ, చలపతి ఇద్దరూ వారివైపు చూసి షాక్‌ అవుతారు. షాకింగ్‌ గా చలపతి ఏమేయ్‌ రాత్రి వీడికోసం ఒక అమ్మాయి వచ్చింది ఇప్పుడు పెద్దొడు ఇంకొకమ్మాయిని తీసుకొచ్చాడు అసలేం జరుగుతుందే మన ఇంట్లో అనగానే.. నోరు మూయండి ఈగలు దూరతాయి అంటుంది లక్ష్మీ. రాజు, ఇందు దగ్గరకు రాగానే చలపతి అరేయ్‌ ఇన్నాళ్లు నువ్వు ఆ లక్కీ గాడిలా వెధవ అనుకున్నాను. కానీ నీక్కూడా అమ్మాయి ఫ్రెండ్‌ ఉందా.. ఏమ్మా బయట మంచి కుర్రోళ్లు, చదువుకున్న కుర్రోళ్లు చాలా మంది ఉన్నారు కదమ్మా..? అనగానే.. రాజు కోపంగా నాన్న అంటాడు. చలపతి మాత్రం ఎందుకమ్మా ఇలాంటి వెధవను ప్రేమించి జీవితాన్ని నాశనం చేసుకున్నావు అనగానే..

రాజు కోపంగా నాన్న కొంచెం ఓవర్‌ అయింది. తను నా గర్ల్‌ ఫ్రెండ్‌ కాదు అని చెప్పగానే.. చలపతి మరి ఎవరు అని అడగ్గానే.. రాజు చెప్తాను ఉండు అంటూ ఈవిడ మా అమ్మ అని చెప్పగానే.. ఇందు ఓహో నువ్వు రెండు ముద్దులు తింటే బాధపడేది ఈవిడేనా అంటూ హలో ఆంటీ అంటుంది. దీంతో రాజు మనసులో ఇదేంటి ఇందాక దీని మాటలు విని రాత్రి చెప్పిందంతా మర్చిపోయింది అనుకున్నాను అనుకుంటూ ఒకరినొకరిని పరిచయం చేస్తుంటే.. అందరి గురించి రాజు ఏం చెప్పాడో అవి గుర్తు చేస్తుంది ఇందు. దీంతో రాజు అనవసరంగా దీనికి అన్ని విషయాలు చెప్పాను అని మనసులో అనుకుంటాడు. ఇంతలో చలపతి రాజును దగ్గరకు లాక్కుని అరేయ్‌ రాజు ఏంట్రా ఇంటి గుట్టు మొత్తం చెప్పేశావా..? అయినా అందరి గురించి మంచి చెప్పి నా గురించి బ్యాడ్ గా చెప్తావా..? అసలు ఈ అమ్మాయి ఎవరు అని అడగ్గానే.. రాజు ఈ రోజు పెళ్లి.. అనగానే..

Advertisement

అయితే ఈరోజు పెళ్లి చేసుకుని వచ్చారా..? అని కంగారుపడుతుంటాడు. దీంతో రాజు నాన్న నేను చెప్పేది పూర్తిగా విను.. అంటూ ఇందు ఈవెంట్‌ మేనేజర్‌ అని మీ 25వ పెళ్లి రోజును గ్రాండ్‌గా చేద్దామని వచ్చింది అని చెప్పగానే.. చలపతి కోపంగా ఫంక్షన్‌ చేయడానికి మన దగ్గర డబ్బులు ఎక్కడివి అని చెప్పగానే.. ఈవిడ జీరో బడ్జెట్‌ లో మొత్తం గ్రాండ్‌గా ఈవెంట్‌ చేస్తుందట అని చెప్పగానే.. రూపాయి ఖర్చు లేకుండా ఎలా చేస్తావమ్మా అంటూ చలపతి అడగ్గానే.. అంటే మనకి ఉన్నంతలో ఆ కొబ్బరికొమ్మలో ఒక చిన్న పందిరి వేసి అంగరంగవైభవంగా మీ 25 సంవత్సరాల పెళ్లి సంభరాలు అంబరం అంటేలా చేస్తాను. మీరు నన్ను నమ్మండి.. ఆంటీ అంకుల్‌ మీరు లోపలికి వెళ్లి రెడీ అవ్వండి.. మీరు పెళ్లి రోజు వేసుకున్న బట్టలు వేసుకోండి అని చెప్తుంది. లక్ష్మీ, చలపతి రెడీ అవ్వడానికి లోపలికి వెళ్తారు.

మరోవైపు నిద్ర పోతున్న లక్కీని ఇంటి ఓనరు వెళ్లి నీళ్లు కొట్టి నిద్ర లేపుతాడు. లక్కీ నిద్ర లేవగానే.. రాత్రి ఎవడ్రా నన్ను కొట్టింది. అంటూ లక్కీని కొడుతుంటాడు. ఎందుకు సార్ కొడుతున్నారు.. అర్థం అయింది సార్‌ నేను మిమ్మల్ని కొట్టానని మీరు నన్ను కొడుతున్నారు అంటూ ఇరిటేట్‌ అవుతూ ఓనరు రాత్రి చేసిన నిర్వాకం చెప్తాడు. దీంతో అలాంటి పనులు చేశానా..? నేను అంటూ ఓనరు అక్కడి నుంచి వెళ్లిపోతాడు. వెంటనే లక్కీ, రాజుకు ఫోన్‌ చేసి ఎక్కడికి వెళ్లిపోయావు అంటూ అడగ్గానే.. ఇంటికి వెళ్లానని రెండు కిలోల చికెన్‌ తీసుకుని మా ఇంటికి రా అని చెప్తాడు. ఇందు ఎక్కడుంది అని అడగ్గానే.. నాతో పాటు నా కొంపలోనే ఉంది రా అంటూ చెప్తాడు. లక్కీ సరే అంటాడు.

Advertisement

మరోవైపు వెంకీ కోసం నందు అక్కడే ఉన్న ఇందును చూసి  ఆశ్చర్యపోతుంది. నువ్వేంటి అక్కా ఇక్కడున్నావు అని అడగుతుంది. ఇంతలో రాజు వచ్చి ఈవెంట్‌ ప్లానర్‌ లే అంటాడు. ఇందు ఏయ్‌ నువ్వేంటి ఇలా వచ్చావు అని అడగ్గానే.. వెంకట్‌ నా ఫ్రెండ్‌ అని చెప్పగానే.. ఇందు చెట్టు ఎక్కడం వచ్చి దిగడం రాదని తెలిస్తే చెప్పాలి కదా అని కోప్పడుతుంటే.. నందు వాడికి మొహమాటం అక్కా ఏదీ బయటకు చెప్పుకోలేడు. ఎంత బాధ ఉన్నా మనసులోనే బాధపడతాడు అంటుంది. దీంతో ఇందు ఇదిగో ఇలా మొహమాట పడితే ప్రాణాలు పోతాయి అంటుంది. దీంతో వెంకట్‌ ఇక్కడ నిజంగానే ప్రాణాలు పోయేలా ఉన్నాయి.. ఒరేయ్‌ అన్నయ్య నీకు దండం పెడతారా..? నన్ను కిందకు దించేయ్‌ అనగానే..

రాజు ఒక పెద్ద క్లాత్‌ తీసుకొచ్చి పట్టుకుని ఇందులో దూకమని వెంకట్‌ కు చెప్తాడు. అది చూసి వెంకట్ భయంతో దిగడమే కాదు.. దూకడం అంటే ధైర్యం లేదు అంటాడు. ఇంతలో నందు వెళ్లి నిచ్చెన తీసుకొచ్చి చెట్టుకు వేస్తుంది. ఓరేయ్‌ వెంకటేశ్వర్లు దిగు అంటుంది. వెంకట్‌ కిందకు దిగి వస్తాడు. థాంక్స్‌ ఫ్రెండ్‌ అంటే నువ్వే.. నువ్వు నా ప్రాణాలు కాపాడటానికే వచ్చావు అంటూ చెప్పగానే.. సరే నీతో మాట్లాడడదామని వచ్చాను.. ఇక వెళ్తాను.. అనగానే. వెంకట్ ఏయ్‌ ఎక్కడకు వెళ్లేది ఇంట్లో ఫంక్షన్‌ చేస్తున్నాము ఉండు అంటాడు. ఇక నలుగురు కలిసి ఫంక్షన్‌ పనులు చేస్తుంటారు. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×