E-Paper
Advertisement

Brahmamudi Serial Today Episode April 21st ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రాజు, ఇందుల మధ్య మొదలైన ప్రేమ

Brahmamudi Serial Today Episode April 21st ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రాజు, ఇందుల మధ్య మొదలైన ప్రేమ
Advertisement

Brahmamudi serial today Episode: ఇందు కాఫీ అడగ్గానే.. రాజు కాఫీ తీసుకొచ్చి ఇవ్వగానే.. ఇందు కోపంగా ఏంటి ఏదో ముష్టి దానికి ఇచ్చినట్టు ఇస్తున్నావు.. రెస్పెక్ట్‌ గా ఇవ్వు అంటుంది. దీంతో రాజు కూడా కోపంగా నీకు కాఫీ ఇవ్వడమే గొప్ప ఇంకా రెస్పెక్ట్ ఇవ్వాలా..? అంటుండగానే.. బయటి నుంచి ఎవరో డోర్‌ కొడుతుంటారు. ఆ సౌండ్‌కు లక్కీ పరుగెత్తుకుంటూ వచ్చి అరేయ్ ఎవర్రా డోర్‌ కొడుతుంది..? కొంపదీసి వీళ్ల రేఖ ఆంటీ అడ్రస్‌ కనుక్కుని వచ్చేసిందా..? ఏంటి..? అనగానే.. ఇందు భయంగా అలా అయితే నేను ఇరుక్కుంటాను అంటుంది. రాజు భయంగా నువ్వు ఇరుక్కోవడం కాదు మేము జైళుకు వెళ్తాం… అరేయ్‌ నువ్వు వెళ్లి ఎవరో చూడరా అనగానే.. లక్కీ కిటికీలోంచి చూస్తాడు. ఇంటి ఓనరు వచ్చి ఉంటాడు. లక్కీ కంగారుపడుతూ ఓరేయ్‌ ఈ ఇంటి ఓనరు వచ్చాడు అని చెప్పగానే.. రాజు అయితే వాడు లోపలికి వస్తే మాస్టర్‌ బెడ్‌రూంలోకి వెళ్తాడు..

మేము వెళ్లి రెండో బెడ్‌రూంలో ఉంటాము.. అంటూ రాజు, లక్కీ రెండో బెడ్‌రూంలోకి వెళ్తారు.   లక్కీ డోర్ తెరవగానే.. ఓనరు చూసి ఏంట్రా నువ్వు ఉన్నావు.. ఆ యాదగిరి ఎక్కడకు పోయాడు అని అడగ్గానే.. యాదగిరి యాదగిరి గుట్ట వెళ్లాడు.. మీరు వస్తున్నారని ఇల్లు క్లీన్‌ చేయమని నాకు చెప్పాడు అనగానే.. సరే సరే నాకు ఆకలిగా ఉంది భోజనం ఏర్పాటు చేయ్‌.. ఒకడు మందు తీసుకుని వస్తాడు ఆ ఏర్పాట్లు చేయ్‌ అంటూ ఓనరు రాజు, ఇందు  ఉన్న బెడ్‌రూంలోకి వెళ్తుంటే.. లక్కీ ఆపేసి సార్‌ మీరు మాస్టర్‌ బెడ్‌ రూంలో ఉండాలి కదా..? అని అడగ్గానే.. జ్యోతిష్యుడు మాస్టర్‌ బెడ్‌రూం వాడొద్దని చెప్పాడు.. ఇప్పుడు ఈ రెండో బెడ్‌రూంలోనే ఉంటాను అంటూ వెళ్తుంటాడు. ఓనరును చూసిన ఇందు, రాజు కప్‌బోర్డులో దాక్కుంటారు. లక్కీ, ఓనరు వెనకాలే వెళ్లి కంగారుపడుతుంటే..

Advertisement

ఓనరు ఏంట్రా అలా చూస్తున్నావు అని అడగ్గానే.. ఏం లేదు సార్‌ మీ బాత్రూం ఎలా ఉందో చూసి క్లీన్‌ చేసి వస్తాను అంటూ బాత్రూంలోకి వెళ్తాడు. కప్‌బోర్డులో దాక్కున్న రాజు, కంపర్ట్‌గా ఉందా అని ఇందును అడగ్గానే.. నీకు కంపర్ట్‌గా ఉంది కదా..? అనగానే.. చీచీ నేను అంత చీప్‌ కాదు అనగానే.. ఇందు కోపంగా ముందు ఇక్కడి నుంచి ఎలా బయటపడాలో ఆలోచించు.. ఊపిరి ఆడక చచ్చేలా ఉన్నాను అంటుంది. దీంతో రాజు ఇదిగో వాడు బాత్రూంలోకి వెళ్లగానే.. మనం బయటకు వెళ్లిపోదాం.. అని చెప్తాడు. లక్కీ మళ్లీ ఓనరు దగ్గరకు వెళ్లి రూం అంతా చూస్తుంటాడు. ఓనరు కోపంగా ఏం చూస్తున్నావురా… అంటే .. సార్‌ అది రూం అంతా బాగానే ఉందా..? అని చూస్తున్నాను అని చెప్పగానే.. ఓనరు కోపంగా లక్కీ ఓరేయ్‌ ముందు నువ్వు బయటకు వెళ్లు అంటూ బయటకు తోస్తాడు.

మరోవైపు కప్‌బోర్డులో ఉన్న ఇందు, రాజు మధ్య  గొడవ జరుగుతుంది. ఇంతలో ఓనరు కప్‌బోర్డు తెరవబోతుంటే.. లక్కీ టవల్‌ పట్టుకొచ్చి.. సార్‌ మీకు టవలే కదా కావాల్సింది.. ఇదిగో ఇది తీసుకొండి అంటాడు. దీంతో ఓనరు నీ దరిద్రమైన టవల్‌ నాకేమీ వద్దు అంటాడు. దీంతో సార్‌ అందులో ఉన్న టవల్ వాడి ఆరు నెలలు అవుతుంది. ఇది ఫ్రెష్‌గా ఉంది.. తీసుకోండి.. వెంటనే వెళ్లి స్నానం చేయండి సార్‌ అని చెప్పగానే.. సరే అంటూ ఓనరు బాత్రూంలోకి వెళ్లగానే.. ఇందు, లక్కీ కప్‌బోర్డు నుంచి బయటకు వెల్లిపోతారు.

Advertisement

తర్వాత ఓనరు ఫోన్‌ మాట్లాడుతూ హాల్లోకి రాగానే రాజు ఎదురుపడతాడు. అరేయ్‌ ఎవడ్రా నువ్వు అని అడగ్గానే.. లక్కీ పరుగెత్తుకుంటూ వచ్చి వాడు నా అసిస్టెంట్‌ సార్‌ అని చెప్పగానే.. ఓనరు త్వరగా వంట చేయమని ఒక లిస్ట్‌ ఇస్తాడు. ఆ లిస్టు చూసి లక్కీ, రాజు షాక్‌ అవుతారు. వెంటనే ఇందు దగ్గరకు వెళ్లి ఓనరు కోసం వంట చేయమని రిక్వెస్ట్‌ చేస్తారు. దీంతో ఇందు నాకు వంట చేసేంత టైం లేదు అంటుంది. దీంతో రాజు కోపంగా టైం లేకపోవడానికి అమ్మగారు ఏం చేస్తున్నారు. ఇక్కడ తిని ఖాళీగా కూర్చోవడమే కదా చేస్తే చేతులు ఏమైనా అరిగిపోతాయా..? అంటాడు. దీంతో చేతులే అరిగిపోతాయో..? కాళ్లే అరిగిపోతాయో అది నా ఇష్టం నీలాంటి వాళ్లు ఇలా అడిగితే అసలు చేయను అంటూ ఇందు చెప్పగానే.. లక్కీ బాధగా ఇప్పుడు మన మధ్య ఈగోలు అవసరమా అండి వంట చేయకపోతే వాడికి అనుమానం వస్తుంది.. అనుమానం వస్తే ఇంట్లోంచి మన అందరిని గెంటేస్తాడు.. అని చెప్పగానే..

ఇందు కోపంగా చూడు రిక్వెస్ట్‌ చేయడానికి వచ్చిన మీ గురువు గారు కనీసం రిక్వెస్ట్‌ చేయడం లేదు. ఆయనకు లేనిది నీకెందుకు అని ఇందు చెప్పగానే.. లక్కీ ఏదో మమ్మల్ని అర్థం చేసుకోండి అంటూ లక్కీ ప్రాధేయపడతాడు. మీ బాస్‌ ఏమీ అడగడం లేదేంటి  అంటూ ఇందు చెప్పగానే.. రాజు కూడా రిక్వెస్ట్‌ చేస్తాడు. దీంతో ఇందు వంట చేయడానికి ఓకే అంటుంది. తర్వాత బయటకు వెళ్లిన లక్కీ ఓనరుకు మందు కలుపుతూ కూర్చుంటాడు. మధ్యలో వంట చూస్తానని లక్కీ కిచెన్ లోకి వెళ్లగానే.. వెనకే వెళ్లిన ఓనరు కిచెన్‌లో ఇందును చూసి షాక్‌ అవుతాడు. ఏవడ్రా ఈ అమ్మాయి అని అడగ్గానే.. లక్కీ, రాజు, ఇందు షాక్‌ అవుతారు. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×