E-Paper
Advertisement

Brahmamudi Serial Today Episode April 16th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇందు, రాజు భార్యాభర్తలని పోలీసులకు చెప్పిన లక్కీ

Brahmamudi Serial Today Episode April 16th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇందు, రాజు భార్యాభర్తలని పోలీసులకు చెప్పిన లక్కీ
Advertisement

Brahmamudi serial today Episode: రాజు, రేఖకు ఫోన్‌ చేసి డబ్బులు ఎప్పుడు పంపిస్తారు అంటూ భయపెడుతుంటే.. ఇందు మాత్రం ఏదో ఒకటి మాట్లాడండి అని చెప్తుంది. అప్పుడే భ్రమరాంబ ఫోన్‌ తీసుకుని ఇందు వస్తేనే డబ్బులు వస్తాయి. ఆస్థులు మొత్తం ఇందు పేరు మీదే ఉన్నాయి అంటూ చెప్పగానే.. రాజు కోపంగా ఏంటి నాకు ఆవు పులి కథ చెప్తున్నారా..? అయితే ఓకే సరదాగా మీ అమ్మాయి వేలు కట్‌ చేసి పంపిస్తాను..ఆ వేళిలో సంతకం చేసి డబ్బులు పంపించండి అంటూ బెదిరించగానే.. అందరూ షాక్‌ అవుతారు. రేఖ ఫోన్‌ తీసుకుని వద్దు అలా చేయోద్దు.. రెండు రోజుల్లో డబ్బు అరైంజ్‌ చేస్తాము అని చెప్తుంది.

అప్పుడే నందు ఇంకాసేపు మాట్లాడుతూ ఉండండి కాల్‌ ట్రేస్‌ చేస్తాము అంటుంది. దీంతో రేఖ ఏం మాట్లాడాలో అర్థం కాక తిన్నారా..? అంటుంది. రాజు ఏంటి అని అడగ్గానే.. అదే మా అమ్మాయి తిన్నదా..? అని అడగ్గానే.. రాజు కోపంగా తన సంగతి మేము చూసుకుంటాము కానీ డబ్బుల సంగతి మీరు చూడండి అని చెప్తాడు.. మరి ప్లేస్‌ ఏంటి..? ఎక్కడ డబ్బులు ఇవ్వాలి అని అడగ్గానే.. ముందు డబ్బులు రెడీ చేసుకోండి ప్లేస్‌ తర్వాత చెప్తాను అంటూ కాల్ కట్‌ చేస్తాడు.  నందు కానిస్టేబుల్‌ను కాల్ ట్రేస్‌ చేశారా..? అని అడగ్గానే.. మేడం ప్లేస్‌ ఎక్కడుందో తెలిసిపోయింది. ఆ ఏరియాలో వెళ్లి కనుక్కోవచ్చు.. అని చెప్పగానే.. రేఖ కూడా ఏమైంది లోకేషన్‌ సెర్చ్‌ చేశారా..? అని అడగ్గానే.. ఎగ్జాక్ట్‌ లోకేషన్‌ తెలియకపోయినా..? ఏరియా తెలిసింది ఇక అక్కడికి వెళ్లి పట్టుకోవచ్చు అని చెప్తుంది. దీంతో ఐశ్వర్య భయంగా లోపలికి వెళ్లిపోతుంది. రేఖ, భూషణ్‌ కోటి రూపాయల గురించి ఆలోచిస్తుంటారు.

Advertisement

లక్కీ లెక్కలు కడుకుంటే.. ఏంట్రా గాలిలో లెక్కలు కడుతున్నావు అంటూ అడగ్గానే.. డబ్బులు రాగానే.. ఒక కారు కొని బంజారాహిల్స్‌ వెళ్లి మంచి షోరూంలో బ్రాండెడ్‌ బట్టలు కొనాలి అని చెప్పగానే.. అంత వద్దు వచ్చిన డబ్బులు అలా ఖర్చు చేస్తే మనం మళ్లీ రోడ్డు మీదకు రావాల్సిందే అంటూ మాట్లాడుకుంటుంటే.. ఇంతలో పోలీసులు వస్తారు. ఇల్లు మొత్తం సోదా చేయాలని చెప్తారు దీంతో రాజు, లక్కీ షాక్‌ అవుతారు. ఏమైందని రాజు అడగ్గానే.. పక్క వీధిలో దొంగతనం జరిగింది. అందుకే ఇక్కడ ప్రతి ఇల్లు సోదా చేస్తున్నామని చెప్పగానే.. రాజు, లక్కీ ఊపిరి పీల్చుకుంటారు. పోలీసులు బలవంతంగా ఇల్లు సెర్చ్‌ చేయబోతుంటే అప్పుడే రూంలోంచి తప్పించుకుని ఇందు వస్తుంది. ఇందును చూసిన రాజు, లక్కీ షాక్‌ అవుతారు. పోలీస్‌ ఆ అమ్మాయి ఎవరు అని అడగ్గానే.. కంగారులో లక్కీ మా వాడి వైఫ్‌ సార్ అని చెప్తాడు. రాజు వైఫ్‌ ఏంట్రా.. అనగానే..

లక్కీ కోపంగా ఒరేయ్‌ మీ ఇద్దరికి గొడవలు వచ్చినంత మాత్రాన నీ భార్య కాకుండా పోతుందా..? నా చెల్లితో నేను మాట్లాడతాను కదా..? నేను వచ్చిందే అందుకు కదా..? అంటూ సిస్టర్‌ సముద్రం అన్నాక అలలు సంసారం అన్నాక గొడవలు కామన్‌.. ఒక్కసారి మా వాడి ముఖం చూడండి మీరు కనక వీడిని వదిలేస్తే పిచ్చోడు అయిపోతాడు.. అంటూ లక్కీ చెప్తుంటే.. రాజు కోపంగా ఓరేయ్‌ లక్కీ.. అంటాడు. నేను మాట్లాడుతున్నాను కదరా నువ్వాగు.. ఫ్లీజ్‌ సిస్టర్‌ కావాలంటే మా వాడి తరపున నేను నీ కాళ్లు మొక్కుతాను.. అంటూ ఇందు కాళ్ల మీద పడిపోతాడు లక్కీ.. అంతా చూసిన పోలీస్‌.. లేవయ్యా లేవ్‌.. ఈ రోజుల్లో కూడా ఇలాంటి ఫ్రెండ్‌ ఉన్నందుకు మీరు చాలా అదృష్టవంతులు.. అంటూ పోలీస్‌ లక్కీకి సారీ చెప్పి వెళ్లిపోతాడు.

Advertisement

నందు, ఇందు కోసం వెతుకుతుంటే వెంకట్‌ తనకు హెల్ప్‌ చేయమని వెనకాలే వెళ్తుంటాడు. నందు కోపంగా తిడుతుంది. అయినా వినకుండా వెంకట్‌ తన లవ్‌ కోసం హెల్ప్‌ చేయమని అడుగుతుంటాడు. ఇంతలో రాజు ఇంట్లో నుంచి వచ్చిన పోలీసులు నందుకు ఎదురుపడతారు. కిడ్నాప్‌ గురించి చెప్తుంది. అలాంటి వారు ఇక్కడ ఎవ్వరూ కనిపించలేదు అని చెప్తాడు పోలీస్‌. మరోవైపు రూంలో రాజు, లక్కీని తిడుతుంటాడు ఎందుకు అంత మాటన్నావు అంటూ తిడుతుంటాడు. ఇందు కూడా తన వాళ్లను కాపాడుకోవాలి అందుకోసం తాను ప్లాన్‌ చేశానని అ డబ్బేదో మీకే ఇస్తామని చెప్తుంది ఇందు. రాజు, లక్కీ ఇందును నమ్మరు. బయటకు వెళ్లబోతుంటే.. అప్పుడే అక్కడ నందు, వెంకట్‌ రావడం చూసి భయపడతారు. లోపలికి వెళ్లిపోతారు. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×