E-Paper
Advertisement

Brahmamudi Serial Today Episode April 13th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇందును కనిపెడతానన్న నందు

Brahmamudi Serial Today Episode April 13th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇందును కనిపెడతానన్న నందు
Advertisement

Brahmamudi serial today Episode: పోలీసులు వచ్చి రేఖ దగ్గర కిడ్నాప్‌ గురించి ఎంక్వైరీ చేస్తుంటారు. మీ ఇంట్లో వాళ్లే ఎవరో ఈ పని చేసి ఉండాలని లేదంటే కిడ్నాపర్లకు సాయం చేసి ఉండాలని అనుమానిస్తారు. దీంతో స్వాతి తెలిసే కదా అక్క తనను తాను కిడ్నాప్‌ చేసుకుంది. ఈ విషయం తెలిస్తే రేఖ ఆంటీ గుండె ఆగిపోతుందేమో అని మనసులో అనుకుంటుంది. ఇంతలో పోలీసులు మీరు ఫాంహౌస్‌లో బర్తుడే పార్టీ చేయాలని ఎప్పుడు అనుకున్నారు అని అడగ్గానే.. రేఖ నిన్ననే  అనుకున్నాం సార్‌ అని చెప్పగానే.. పోలీస్‌ షాక్‌ అవుతాడు. వాట్‌ నిన్నే అనుకున్నారా..? అనగానే.. శేషు షాకింగ్‌ గా ఏంటి సార్‌ నిన్న ఏమైనా రాహుకాలం, యమగండం లాంటివి ఏమైనా ఉన్నాయా అని అడగ్గానే..

పోలీస్‌ నోనో నా ఉద్దేశం అది కాదు. మీరు డిసైడ్‌ అయి ఇరవై నాలుగు గంటలు కూడా కాలేదు. కానీ ఆ కిడ్నాపర్లు అక్కడకి వచ్చి కిడ్నాప్‌ చేయడంలోనే అనుమానం ఉంది అని పోలీస్‌ చెప్పగానే.. ఐశ్వర్య షాక్‌ అవుతుంది. అమ్మో అటు తిరిగి ఇటు తిరిగి నేను ఇరుక్కునే ఉన్నాను అని మనసులో అనుకుని అది కాదు సార్‌ మనకు ముఖ్యం అసలు ఎవరు కిడ్నాప్‌ చేశారు. ఎందుకు కిడ్నాప్‌ చేశారు అనేది తెలుసుకోవాలి అనగానే.. అలా తెలియాలంటే ఇందు గారు కిడ్నాప్‌ అయిన విషయం పబ్లిక్‌ గా తెలియాలి అని చెప్పగానే.. వెంటనే అలా చేయండి సార్‌ నా మనవరాలి క్షేమమే మాకు ముఖ్యం అని అపర్ణ చెప్పగానే.. అలాగే వెంటనే చేస్తాం.. మీరు ఒకసారి పోలీస్‌ స్టేషన్‌కు వచ్చి కంఫ్లైంట్‌ ఇవ్వండి అని పోలీస్‌ చెప్పగానే..

Advertisement

రేఖ కోపంగా నో కంప్లైంట్‌ ఇవ్వడం కుదరదు సార్‌. కంప్లైంట్‌ ఇస్తే ప్రాబ్లం అవుతుంది అని చెప్పగానే.. పోలీస్‌ కంప్లైంట్‌ ఇవ్వకుండా మేము దీన్ని హ్యాండిల్‌ చేయలేం మేడం అని చెప్పగానే.. రేఖ నేను అసలు కంప్లైంట్‌ ఇవ్వను అనగానే.. అపర్ణ ఎందుకు కంప్లైంట్‌ ఇవ్వవు.. అని అడగ్గానే.. ఇలాంటి విషయాలు పబ్లిష్‌ అయితే కంపెనీలో చాలా ప్రాబ్లమ్స్‌ వస్తాయి. కంపెనీ షేర్స్‌ పడిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకే మీరు సీక్రెట్‌గా వెతకండి అని చెప్పగానే.. పోలీస్‌ సరే మేడం అంటూ వెళ్లిపోతాడు. అపర్ణ కోపంగా రేఖను తిడుతుంది. రేఖ, అపర్ణకు వార్నింగ్‌ ఇచ్చి వెళ్లిపోతుంది. స్వాతి మాత్రం ఆఫీసియల్‌గా కంప్లైంట్‌ ఇవ్వలేదు కాబట్టి ఇందు అక్కకు తగినంత టైం దొరుకుతుంది. ఏదో ఒక ప్లాన్‌ చేస్తుంది అనుకుంటుంది.

తర్వాత రూంలోకి వెళ్లిన అపర్ణను ఇందు గురించి సుభాష్‌ అడుగుతాడు. రేఖ కంప్లైంట్‌ ఇవ్వకుండా పోలీసులకు వెతకమని చెప్తుంది. అంటూ అపర్ణ బాధపడుతుంది. సుభాష్‌ కూడా ఎమోషనల్‌ అవుతాడు. మరోవైపు కిడ్నాప్‌ చేసిన రాజు ఒక్కరోజులో కోటి రూపాయలు వస్తున్నాయి అని కలలు కంటుంటాడు.  ఇంతలో వాళ్ల నాన్న ఫోన్‌ చేసి రెండు రోజుల నుంచి ఇంటికి రావడం లేదేంటని అనుమానంగా ఉందని తిడతాడు. దీంతో రాజు సాహు పని మీదే తిరుగుతున్నానని చెప్తాడు రాజు. ఇంతలో ఇందు కట్లు విప్పుకుని బయటకు వస్తుంది. దీంతో రాజు, లక్కీ షాక్‌ అవుతారు. ఇందును మళ్లీ కట్టేయడానికి ట్ర్రై చేస్తుంటే.. ఇందు అక్కడి నుంచి వెళ్లిపోతుంది. రాజు ఆపేసి నిన్ను నిజంగానే కిడ్నాప్‌ చేశాం అని చెప్పగానే.. ఇందు షాక్‌ అవుతుంది. మేము నువ్వు అనుకున్నట్టుగా నీ మనుసులం కాదు అంటూ ఇందును మళ్లీ కుర్చీకి కట్టేస్తారు.

Advertisement

మరోవైపు నందు వాళ్ల బాబాయ్‌ ఇంటికి వచ్చి రేఖ ఇంట్ల జరిగిన  విషయం మొత్తం చెప్పగానే.. అక్క ఎక్కడ ఉందో తాను పట్టుకొస్తానని చెప్తుంది. దీంతో అది అంత ఈజీ విషయం కాదు. ఈ విషయంలో నువ్వు ఇన్వాల్వ్‌ కాకపోవడమే మంచిది అంటాడు. కానీ నీ ద్వారా మనం అక్కను వెతుకుదాం అని చెప్తుంది నందు. మరోవైపు ఫాంహౌస్‌ లో ఉన్న సీసీటీవీ పుటేజీ చూసిన రేఖ ఆ ఇందుయే కావాలని తనను తాను కిడ్నాప్‌ చేసుకుందని భూషణ్‌ ఏం చేయాలో తెలుసు కదా అనగానే.. భూషణ్‌ వెళ్లి సుభాష్‌ను బయటకు తీసుకొస్తాడు. అపర్ణ వెనకాలే పరుగెత్తుకుంటూ వచ్చి రేఖ ఏంటిది అని అడగ్గానే.. చేసేదంతా చేసి బలే నాటకం ఆడుతున్నారు అంటూ రేఖ కోపంగా అపర్ణను తిడుతుంది. అర్థం కాక అపర్ణ అయోమయంగా చూస్తుంటుంది. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×