E-Paper
Advertisement

Brahmamudi Serial Today Episode April 10th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఆస్థి బాధ్యతలు రేఖకు అప్పగిస్తానన్న ఇందు

Brahmamudi Serial Today Episode April 10th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఆస్థి బాధ్యతలు రేఖకు అప్పగిస్తానన్న ఇందు
Advertisement

Brahmamudi serial today Episode: ఒకవైపు ఫంక్షన్‌కు అంతా రెడీ అవుతుంటే.. మరోవైపు రేఖ తన లాయర్లతో కలిసి మాట్లాడుతుంది. మీరు కాసేపు వెయిట్‌ చేయండి ఇందు వచ్చి సంతకం చేస్తుంది అని చెప్పగానే.. లాయర్‌ సరే మేడం కానీ ఇందు సంతకం చేయడం అందరి ముందు చేస్తే మంచిది అని చెప్పగానే.. ఎందుకు అని రేఖ అడుగుతుంది. దీంతో లాయరు.. అందరి ముందు ఇందు సంతకం చేస్తే అది మనం వీడియో తీసుకోవచ్చు.. అలాగే ఇందు తన ఇష్టప్రకారమే సంతకం చేసింది అనడానికి ఎవిడెన్స్‌ అవుతుంది అని చెప్పగానే.. భ్రమరాంబ కల్పించుకుని మీరేం భయపడకండి.. మా రేఖను ఎదిరించే ధైర్యం ఎవ్వరికీ లేదు అని చెప్తుండగానే.. రేఖకు శ్యాం ఫోన్‌ చేస్తాడు.

హలో శ్యాం గారు మీకోసమే ఎదురుచూస్తున్నాను ఇంకా రాలేదేంటి..? అని అడగ్గానే.. శ్యాం రావడానికే బయలుదేరాను కానీ ఇప్పుడే మా రిపోర్టర్‌ నుంచి ఒక ఇన్మఫర్మేషన్‌ వచ్చింది. అందుకే కాల్ చేశాను అని శ్యాం చెప్పగానే.. రేఖ ఏం అంటున్నారు మీరు అని అడుగుతుంది. ఈరోజు మీ ఇంటి నుంచి కాల్‌ చేసి ఈరోజు ఇందు గారి బర్తుడే లో తన చేత బలవంతంగా సంతకం  చేయించి ఆస్థి మొత్తం లాక్కోవాలని చూస్తున్నారని చెప్పారు. ఈ విషయంలో ఇందు గారికి సపోర్ట్‌ చేయాలని మీడియా వాళ్లందరూ రావాలని రిక్వెస్ట్‌ చేసుకున్నారు అని చెప్పగానే.. రేఖ షాక్‌ అవుతుంది. భ్రమరాంబ ఏమైంది రేఖ ఎందుకు టెన్షన్‌ పడుతున్నావు.. అని అడగ్గానే.. నువ్వుండు.. మరి మీరు ఏ డిసీజన్‌ తీసుకున్నారు అని రేఖ అడగ్గానే.. ఈ న్యూస్‌ అన్ని చానెల్స్‌ రిపోర్టర్స్‌కు వెళ్లిపోయింది. నేను ప్రెసిడెంట్‌ కాబట్టి అందరూ నాకు ఫోన్‌ చేసి అడుగుతున్నారు. మనిద్దరి మధ్య ఉన్న ర్యాపో వల్ల నేను మీకు కాల్ చేశాను. ఒక్కసారి ఈ విషయం పబ్లిష్‌ అయ్యిందంటే ఇక మీరేం చేయలేరు అని చెప్పగానే..

Advertisement

మా ఇంట్లో వాళ్లను నేను హ్యాండిల్‌ చేస్తాను. రిపోర్టర్స్‌ ను మీరు హ్యాండిల్‌ చేయండి.. ఈ విషయం బయటకు రాకూడదు.. అని చెప్పగానే.. దీంతో శ్యాం అంత మందిని కట్రోల్‌ చేయడం అంటే చాలా కష్టం మేడం అని చెప్పగానే.. గతంలో నాకోసం మీరు ఇలాంటి పనులు ఎన్నో చేశారు.. మీకు నేను  చాలానే చేశాను అంటూ రేఖ చెప్పగానే.. శ్యాం సరే అంటాడు. దీంతో కోపంగా రేఖ ఇందు రూంలోకి వెళ్లి అపర్ణ, ఇందులను తిడుతుంది. నువ్వు సంతకం పెట్టకపోతే నీ ముసలితాత, నాన్నమ్మలు బతకరని నీకు తెలుసు కదా..? అయినా ఎందుకు మీడియా వాళ్లకు చెప్పావు.. సంతకం చేయకుండా తప్పించుకుందామనుకుంటునావా.? అంటూ తిట్టగానే..

ఇందు భయంగా తనకు ఏమీ తెలియదని.. నేను ఎవ్వరికీ చెప్పలేదని బాధపడుతుంది.   భ్రమరాంబ, ఇందును తిడుతుంటే.. అపర్ణ కోపంగా భ్రమరాంబకు వార్నింగ్‌ ఇస్తుంది.  ఇంతలో సుభాష్‌ మీడియా వాళ్లకు తానే చెప్పానని అనడంతో అందరూ షాక్‌ అవుతారు. దీంతో రేఖ మీడియా వాళ్లు ఎవ్వరూ రావడం లేదని చెప్తుంది. దీంతో సుభాష్‌ షాక్‌ అవుతాడు. అప్పుడే రేఖ ఇంకో మాట చెప్తుంది. తాను మీడియా వాళ్లకు మాటిచ్చానని ఇంకోసారి మా ఇంటి నుంచి మీకు ఫోన్‌ రాదని చెప్పానని ఒకవేళ ఫోన్‌ వస్తే ఆ ఫోన్‌ చేసిన వాళ్లను చంపేస్తానని చెప్పాను అంటుంది. దీంతో ఇందు, అపర్ణ షాక్‌ అవుతారు.

Advertisement

తర్వాత ఇందు కేక్‌ కట్‌ చేయడానికి వస్తుంది… కిడ్నాప్‌ చేయడానికి రాజు, లక్కీ రెడీగా ఉంటారు. కేక్‌ కటింగ్‌ కు ముందు ఇందు తన గురించి మాట్లాడుతుంది. ఎమోషనల్‌ అవుతుంది. లక్కీ తీసుకొచ్చిన స్మోక్‌ మిషన్‌ పని చేయదు.. స్వాతి తీసుకొచ్చిన కిడ్నాపర్లు వెయిట్‌ చేస్తుంటారు. ఇంతలో ఇందు తన కోసం కష్టపడ్డ రేఖ ఆంటీకి నా ఆస్థి బాధ్యతలు అన్ని అప్పగించాలి అనుకుంటున్నాను అని చెప్తుంది. దీంతో అపర్ణ, స్వాతి, సుభాష్‌ షాక్‌ అవుతారు. రేఖ, భ్రమరాంబ, భూషణ్‌ హ్యాపీగా ఫీలవుతుంటారు. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×