E-Paper
Advertisement

పవన్ కళ్యాణ్ రాజకీయాల పై తమన్నా సింహాద్రి కామెంట్స్.. పొలిటిక జోకర్ అయ్యారంటూ!

పవన్ కళ్యాణ్ రాజకీయాల పై తమన్నా సింహాద్రి కామెంట్స్.. పొలిటిక జోకర్ అయ్యారంటూ!
Advertisement

Tamanna Simhadri: తమన్నా సింహాద్రి పరిచయం అవసరం లేని పేరు. బుల్లితెరపై పలు కార్యక్రమాలలో సందడి చేశారు. అనంతరం బిగ్ బాస్ 3 ద్వారా ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇక బిగ్ బాస్ 3 తర్వాత పలు కార్యక్రమాలలో కనిపించిన తమన్నా సింహాద్రి ఇటీవల కాలంలో పూర్తిగా బుల్లితెరకు దూరంగా ఉంటున్నారు. అయితే ఈమె ట్రాన్స్ జెండర్ గా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇటీవల ఈమె పెళ్లి చేసుకున్న విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు. అదేవిధంగా తాను తల్లి కాబోతున్నానని విషయాన్ని తెలియజేస్తూ తమన్న బేబీ బంప్ ఫోటోలను కూడా షేర్ చేశారు.

పవన్ కళ్యాణ్ పై తమన్నా సింహాద్రి కామెంట్స్..

ఇకపోతే తమన్నా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా రాజకీయాల గురించి ప్రశ్నలు ఎదురవడంతో ఈమె పవన్ కళ్యాణ్ రాజకీయాలపై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఈమె ఒకానొక సమయంలో ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎన్నికలలో పోటీ చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో మీపై చాలా ట్రోల్స్ వచ్చాయి, కాస్త నవ్వుల పాలయ్యారు అనిపించిందా అంటూ ప్రశ్న ఎదురయింది. ఈ ప్రశ్నకు తమన్నా సమాధానం చెబుతూ.. పవన్ కళ్యాణ్ లాంటి వారి గురించే ఇప్పుడు ఎన్నో విమర్శలు వస్తున్నాయి ఆయనే ఒక పొలిటికల్ జోకర్ అయ్యారనీ మాట్లాడుతున్నారు. అలాంటి వ్యక్తి గురించి విమర్శలు వచ్చినప్పుడు నా గురించి రావడం సర్వసాధారణమే ఇలాంటి వాటిని నేను పట్టించుకోనని తెలిపారు.

నాకు చాలా క్యాస్ట్ ఫీలింగ్ ఉంది..

Advertisement

ఇక ఈమె రాజకీయాల గురించి మాట్లాడుతూ.. తనకు చాలా క్యాస్ట్ ఫీలింగ్ ఉందని తెలిపారు. మా కాపు కులం నుంచి నాయకుడు ముఖ్యమంత్రి కావాలని మేము కోరుకున్నాం అందుకే జనసేన జెండా పట్టుకొని విజయవాడ వీధుల్లో వీధి వీధి తిరిగి జనసేన పార్టీ కోసం తాను కష్టపడ్డానని అయితే నాకు టికెట్ రాని నేపథ్యంలో రామచంద్ర యాదవ్ గారు నన్ను గుర్తించడంతో ఆయన పార్టీ తరపున నేను ఎమ్మెల్యేగా పోటీచేసానని తెలిపారు.

పవన్ జోకర్ అయ్యారు..

ఇక పవన్ కళ్యాణ్ గారు ఎన్నికలకు ముందు ఎన్నో వాగ్దానాలు చేశారు. తన ఆఫీసులో ఒక అప్లికేషన్ ఫిల్ చేస్తే దాని ద్వారా తాను ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటిస్తానని చెప్పారు .కానీ పవన్ కళ్యాణ్ గారు ఆ పని చేయలేదని చంద్రబాబు నాయుడు గారితో కలిసి టికెట్లని తెలుగుదేశం పార్టీ వారికే ఇచ్చారని తమన్నా తెలిపారు. అయితే మా కులం వ్యక్తిని ముఖ్యమంత్రిగా చూడటం కోసం ఎంతోమంది మేం కష్టపడ్డాము కానీ పవన్ కళ్యాణ్ వెళ్లి చంద్రబాబు నాయుడుతో కలిసి ఆయనని ముఖ్యమంత్రిని చేశారు. ఇలా పవన్ కళ్యాణ్ రాజకీయాల విషయంలో జోకర్ అయ్యారు అంటూ ఎంతో మంది ఆయనపై విమర్శలు చేస్తున్నారని ఈ సందర్భంగా తమన్నా సింహాద్రి చేసిన కామెంట్స్ ప్రస్తుతం సంచలనంగా మారాయి.

Advertisement

Also Read: ప్రియుడితో బ్రేకప్ ..పెళ్లి చేసుకొని షాక్ ఇచ్చిన బుల్లితెర నటి కీర్తి భట్..ఫోటోలు వైరల్!

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×