E-Paper
Advertisement

Sri Satya: పెళ్లి వద్దు.. అమ్మను కావాలంటున్న బిగ్ బాస్ బ్యూటీ…ఇదేం కోరిక తల్లి?

Sri Satya: పెళ్లి వద్దు.. అమ్మను కావాలంటున్న బిగ్ బాస్ బ్యూటీ…ఇదేం కోరిక తల్లి?
Advertisement

Sri Satya: బుల్లితెర కార్యక్రమాల ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో శ్రీ సత్య ఒకరు. ఈమె ముద్దమందారం, త్రినయని, నిన్నే పెళ్ళాడుతా వంటి సూపర్ డూపర్ సీరియల్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న శ్రీ సత్య అనంతరం బిగ్ బాస్ రియాలిటీ షోలో పాల్గొని సందడి చేశారు. ఈమె సీజన్ 6 కార్యక్రమంలో పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమం ద్వారా అర్జున్ కళ్యాణ్ తో ఈమె లవ్ ట్రాక్ నడిపారంటూ అప్పట్లో పెద్ద ఎత్తున వార్తలు కూడా హల్చల్ చేశాయి.

అమ్మను కావాలని ఉంది..

ఇలా బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్న శ్రీ సత్య(Sri Satya) ఈ కార్యక్రమం అనంతరం ఈమె పలు బుల్లితెర కార్యక్రమాలతో పాటు డాన్స్ కార్యక్రమాలలో సందడి చేస్తూ బిజీగా ఉన్నారు. ఇలా కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న శ్రీ సత్య తాజాగా ఒక పాడ్ కాస్ట్ లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈమె తన కెరీర్ కి సంబంధించిన విషయాలతో పాటు వ్యక్తిగత విషయాలు గురించి కూడా అభిమానులతో పంచుకున్నారు. శ్రీ సత్య పెళ్లి గురించి కూడా ఈ సందర్భంగా ప్రస్తావనకు రావడంతో ఈమె పెళ్లిపై తన అభిప్రాయాలను తెలియజేశారు.

అమ్మాయిని దత్తత తీసుకుంటా..

Advertisement

ఇలా శ్రీ సత్య మాట్లాడుతూ జీవితంలో తనకు పెళ్లి చేసుకోవాలనే ఆలోచన లేదని, ఎప్పటికీ రాదని తెలిపారు. ఇలా పెళ్లి చేసుకోకపోయినా పిల్లలు కావాలని అమ్మను అవ్వాలని ఉంది అంటూ తన మనసులో కోరికను బయటపెట్టారు. అమ్మగా మారాలి అంటే నేనే పిల్లలను కనాల్సిన అవసరం ఏమాత్రం లేదు మన దేశంలో ఎన్నో అనాధ ఆశ్రమాలు ఉన్నాయని వీటి నుంచి కచ్చితంగా ఒక అమ్మాయిని దత్తత తీసుకొని తనకు అమ్మగా మారి ఆలనా పాలన చూసుకుంటానని శ్రీ సత్య తెలియజేశారు. ఇక అబ్బాయిలను మాత్రం తాను దత్తత తీసుకోనని వారిని హ్యాండిల్ చేయటం నావల్ల కాదు అంటూ ఈ సందర్భంగా ఈమె తెలియజేశారు.

పెళ్లి ఆలోచనలు లేవు..

Advertisement

ఇలా పెళ్లి వద్దు పిల్లలు కావాలంటూ ఈమె చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇటీవల కాలంలో ఎంతోమంది సెలబ్రిటీలు పెళ్లిళ్లకు దూరంగా ఉన్నప్పటికీ పిల్లలను దత్తత తీసుకుంటూ వారి బాగోగులను చూసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే శ్రీ సత్య కూడా అనాధ పిల్లలకు తల్లిగా మారుతాను అంటూ చెప్పడంతో అభిమానులు ఈమె మంచి మనసు పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక శ్రీ సత్య ప్రస్తుతం పలు టీవీ షో లతోపాటు ఈవెంట్స్ అలాగే సినిమాలలో చిన్న చిన్న పాత్రలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. అలాగే ఈమె ఇంస్టాగ్రామ్ యూట్యూబ్ ద్వారా కూడా తనకు సంబంధించిన విషయాలను వీడియోల రూపంలో తెలియజేస్తూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో కూడా భారీ స్థాయిలో అభిమానులను సొంతం చేసుకున్నారు.

Also Read: BMW Censor: సెన్సార్ పూర్తి చేసుకున్న రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×