E-Paper
Advertisement

Kissik Talks: అతడంటే పిచ్చి..కానీ అలా చేస్తారనుకోలేదు – ప్రియా శెట్టి!

Kissik Talks: అతడంటే పిచ్చి..కానీ అలా చేస్తారనుకోలేదు – ప్రియా శెట్టి!
Advertisement

Kissik Talks: బిగ్ టీవీ ఎక్స్ క్లూజివ్ గా నిర్వహిస్తున్న కిస్సిక్ టాక్స్ కార్యక్రమానికి ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీలు హాజరయ్యి.. తమ వృత్తిపరమైన వ్యక్తిగత జీవిత విషయాలను అలాగే సమాజంలో యువత ఎలా ఉంటున్నారు? ఎలా ఉండాలి? అనే అంశాలపై చర్చిస్తూ అందరిని ఆకట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఈ కిస్సిక్ టాక్స్ కార్యక్రమానికి కూడా విపరీతమైన ఆదరణ లభిస్తోంది.అందులో భాగంగానే తాజా ఎపిసోడ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో అగ్నిపరీక్ష షో ద్వారా తనను తాను ప్రూవ్ చేసుకొని బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 లోకి కంటస్టెంట్ గా అడుగుపెట్టి మొదటిలోనే అందరిలో అటెన్షన్ క్రియేట్ చేసింది ఈ ముద్దుగుమ్మ.

బిగ్ బాస్ కి వెళ్ళాకే ఆ భయం పోయింది – ప్రియా శెట్టి

ఆమె ఎవరో కాదు ప్రియా శెట్టి. క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో.. సింపుల్ స్మైల్ తో అందరి హృదయాలను దోచుకున్న ప్రియా శెట్టి అటు స్ట్రైట్ ఫార్వర్డ్ నేచర్ తో అందరిని మెప్పించింది అయితే తాజాగా కిస్సిక్ టాక్స్ లో పాల్గొన్న ప్రియా శెట్టి అతడంటే తనకు పిచ్చి అని, అది దేవుడిచ్చిన బంధం అంటూ అతడిపై తన ప్రేమను ఒలకబోసింది. అతను ఎవరో కాదు బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 విన్నర్ కళ్యాణ్ పడాలతో ఉన్న బాండింగ్ గురించి ఆమె చెప్పుకొచ్చింది. మొదటగా తన పర్సనల్ విషయాల గురించి మాట్లాడుతూ..” చిన్నప్పటి నుంచే నాకు సినిమాలలో ఆసక్తి ఉండేది. నటనపై ప్రత్యేక ఇష్టం ఉండడం వల్లే పలు ఆడిషన్ లకి వెళ్లేదాన్ని. కాకపోతే ఇండస్ట్రీలో బ్యాక్ గ్రౌండ్ లేకపోవడం, కుటుంబ సభ్యుల భయం కారణంగా వచ్చిన అవకాశాలను కూడా నేను వదులుకున్నాను. ఇక బిగ్ బాస్ షో లో నన్ను చూసిన తర్వాత నా తల్లిదండ్రులలో విశ్వాసం పెరిగింది. ఇప్పుడు నేను ఏ పరిస్థితినైనా ఎదుర్కోగలను అని వారు బలంగా నమ్ముతున్నారు ” అంటూ ప్రియా శెట్టి తెలిపింది.

అతడంటే పిచ్చి.. చాలా సంతోషంగా ఫీలయ్యా – ప్రియా శెట్టి

Advertisement

మీకు ఎవరంటే బాగా ఇష్టం.. ఎవరికి మీరు థాంక్స్ చెప్పాలనుకుంటున్నారు అని వర్షా అడగగా.. బిగ్ బాస్ విన్నర్ కళ్యాణ్ పడాలకు నేను ప్రత్యేకంగా థాంక్స్ చెప్పాలి. కళ్యాణ్ అంటే నాకు చాలా ఇష్టం. ఒకరకంగా చెప్పాలంటే పిచ్చి .అతడిని చిన్న తమ్ముడిలా భావిస్తాను . కళ్యాణ్ విషయంలో నేను చాలా పొసెసివ్ గా ఉండేదాన్ని. ఎలా ఉంటున్నాడో? ఏం చేస్తున్నాడో ? అని ఎక్కువగా ఆలోచించేదాన్ని..ముఖ్యంగా కళ్యాణ్ తో హౌస్ లో నాకున్న బాండింగ్ చాలా ప్రత్యేకం . సొంత తమ్ముడితో ఉండే అనుబంధంలా నాకు అనిపించేది. ఇక కళ్యాణ్ విన్నర్ అవ్వడం నాకు చాలా ఆనందం కలిగించింది. కళ్యాణ్ కప్పు గెలిచినప్పుడు నేనే గెలిచినంత సంతోషంగా ఫీల్ అయ్యాను. కప్పు పట్టుకొని స్టేజ్ మొత్తం డాన్స్ చేసి సెలెబ్రేట్ చేశాను” అంటూ కళ్యాణ్ తో తనకున్న అనుబంధం గురించి చెప్పుకొచ్చింది ప్రియా శెట్టి.

ALSO READ:క్షణక్షణం ఉత్కంఠ.. మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ లతో.. ఓటీటీని దున్నేస్తున్న మూవీ!

తనూజా పై ప్రియా శెట్టి కామెంట్..

Advertisement

అలాగే తనూజ గురించి మాట్లాడుతూ..” హౌస్ లో ఉన్నప్పుడు తనూజాతో నేను చాలా క్లోజ్ గా ఉండేదాన్ని. ఇక బయటకు వచ్చిన తర్వాత సెలబ్రిటీలు కదా వాళ్ళు మనతో ఏం మాట్లాడతారు అనుకున్నాను. కానీ తనుజా అలా కాదు. నాతో ఇప్పటికీ కూడా చాలా క్లోజ్ గా ఉంటుంది. మా స్నేహం బయటకు వచ్చిన తర్వాత కూడా అలాగే కొనసాగుతోంది. ప్రతి ఈవెంట్ లో కలుస్తూ టచ్ లోనే ఉన్నాము. ఆమె వ్యక్తిత్వం నన్ను బాగా ఫిదా చేసింది ” అంటూ తెలిపింది. ప్రస్తుతం ప్రియా శెట్టి చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×