E-Paper
Advertisement

బిగ్ బాస్ దశావతారంపై బిగ్ అప్డేట్.. ఆ రోజే షో ప్రారంభం!

బిగ్ బాస్ దశావతారంపై బిగ్ అప్డేట్.. ఆ రోజే షో ప్రారంభం!
Advertisement

Bigg Boss 10: స్మార్ట్ ఫోన్ చేతిలోకి వచ్చిన తర్వాత బుల్లితెర లేదు వెండితెర లేదు.. తమకు నచ్చిన కంటెంట్ ను క్షణాల్లో చూసేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు యువత. ఇక అందులో భాగంగానే వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షోగా గుర్తింపు తెచ్చుకున్న బిగ్ బాస్ షో గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తెలుగులో ఇప్పటికే 9 సీజన్లు దిగ్విజయంగా పూర్తి చేసుకున్న ఈ షోని అభిమానులు ఎంతగా ఆదరిస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అటు టీవీలలో ఇటు సెల్ ఫోన్ లో ఎప్పుడు ఎక్కడ కావాలన్నా సరే ఈ షో చూసే వీలు కల్పిస్తున్నారు నిర్వాహకులు.

బిగ్ బాస్ దశావతారానికి ప్రారంభమైన సెట్ వర్క్..

అందులో భాగంగానే సీజన్ 10 కోసం ఎదురు చూస్తుండగా.. బిగ్ బాస్ దశావతారం ప్రారంభం అంటూ ఇటీవల ఒక వీడియో రిలీజ్ చేసి అంచనాలు పెంచేశారు. మునుపటిలాగా కాకుండా ఈ బిగ్ బాస్ దశావతారం పేరిట రాబోతున్న సీజన్ 10 లో ఎవరు ఊహించని టాస్కులు ఉండబోతున్నాయని హోస్ట్ నాగార్జున తెలిపారు . ఇక అందుకు తగ్గట్టుగానే 10వ సీజన్ కి కూడా తొమ్మిదవ సీజన్ లాగా అగ్నిపరీక్ష పేరుతో మరో షో నిర్వహించడానికి జియో హాట్ స్టార్, స్టార్ మా సంస్థలు సిద్ధమవుతున్నాయి. ఈ మేరకు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. బిగ్ బాస్ సీజన్ 10 కి సంబంధించిన సెట్ వర్క్ కూడా ప్రారంభమైంది.

Advertisement

also read:నాగార్జున 100వ మూవీ నుండీ బిగ్ అప్డేట్.. ఫస్ట్ లుక్ , టైటిల్ గ్లింప్స్ కి ముహూర్తం ఫిక్స్!

ఆ రోజు నుంచే షో ప్రారంభం..

త్వరలోనే ఈ సెట్ వర్క్ ను పూర్తి చేసేసి.. బిగ్ బాస్ సీజన్ 10 ను సెప్టెంబర్ 6వ తేదీ నుంచి ప్రారంభించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇకపోతే బిగ్ బాస్ మొదటి సీజన్ కి ఎన్టీఆర్, రెండవ సీజన్ కి నాని హోస్ట్ గా వ్యవహరించగా.. ఇక మూడవ సీజన్ నుండి ఇప్పటివరకు విజయవంతంగా హోస్ట్ గా వ్యవహరిస్తున్న నాగార్జున ఈ పదవ సీజన్ కి కూడా హోస్ట్ గా వ్యవహరించబోతున్నారు. ముఖ్యంగా గత సీజన్లతో పోల్చుకుంటే ఈ షో మరింత భిన్నంగా ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా సెట్ ను కూడా డిజైన్ చేయడానికి నిర్వాహకులు భారీ ప్లాన్ చేశారట.అందుకే సెట్ పనులు ఈరోజు ప్రారంభం అవ్వగా.. త్వరలోనే పూర్తి చేసి షోని త్వరగా ప్రారంభించడానికి మేకర్స్ సిద్ధమవుతున్నారు.

అగ్నిపరీక్ష కూడా త్వరలో ప్రారంభం..

Advertisement

ఇక దీనికి సమాంతరంగానే బిగ్ బాస్ అగ్నిపరీక్ష షో నిర్వహించి, దీని ద్వారా కొంతమంది కామన్ పీపుల్స్ ని ఎంపిక చేసి హౌస్ లోకి పంపించబోతున్నారు. మొత్తానికి అయితే అగ్నిపరీక్ష ద్వారా నెగ్గిన 8 మంది కంటెస్టెంట్స్ ను హౌస్ లోకి పంపిస్తుండగా.. నేరుగా 14 మంది సెలబ్రిటీలను హౌస్ లోకి తీసుకురాబోతున్నారు. మరి ఈసారి గందరగోళం ఇంకెలా ఉండబోతుందో చూడాలి.

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×