E-Paper
Advertisement

Bigg Boss Rohini: బిగ్ బాస్ రోహిణిపై వ్యక్తిగత విమర్శలు.. దెబ్బకు శాపనార్థాలు పెట్టిన నటి!

Bigg Boss Rohini: బిగ్ బాస్ రోహిణిపై వ్యక్తిగత విమర్శలు.. దెబ్బకు శాపనార్థాలు పెట్టిన నటి!
Advertisement

Bigg Boss Rohini:బుల్లితెర సెలబ్రిటీ రోహిణి (Rohini ) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తన అద్భుతమైన కామెడీ టైమింగ్ తో అందరి దృష్టిని ఆకట్టుకున్న ఈ చిన్నది .. మొదట యాంకర్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా తన కెరియర్ ను ప్రారంభించింది. ఆ తర్వాతే సీరియల్స్ లోకి అడుగుపెట్టి పర్వాలేదనిపించుకున్న ఈమె.. జీ తెలుగులో ప్రసారమైన ‘కొంచెం ఇష్టం కొంచెం కష్టం’ సీరియల్ లో నెల్లూరు యాసలో నవ్వులు పూయించింది.. తర్వాత జబర్దస్త్ లోకి అడుగుపెట్టిన మరింత పాపులారిటీ సొంతం చేసుకుంది. ఇక్కడ కామెడీ పంచులతో .. అద్భుతమైన పర్ఫామెన్స్ తో అందరి దృష్టిని ఆకట్టుకున్న రోహిణి.. మధ్యలో ఇన్స్పెక్టర్ కిరణ్ వంటి బుల్లితెర సీరియల్స్ తో కూడా నటించి ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యింది . పైగా అప్పట్లో టిక్ టాక్, డబ్స్ స్మాష్ లో కామెడీ రీల్స్ , వీడియోలు చేసి సోషల్ మీడియాలో ఫాలోయింగ్ సొంతం చేసుకున్న రోహిణి.. ఆ ఫేమ్ తో బిగ్ బాస్ తెలుగు సీజన్ 3లో కంటెస్టెంట్ గా అడుగుపెట్టింది. ఇక్కడ కూడా తనదైన పర్ఫామెన్స్ తో అందరినీ మెప్పించింది.

సినిమాలు, షోలతో బిజీగా మారిన రోహిణి..

బుల్లితెర సీరియల్స్ , షోలలోనే కాదు సినిమాలలో కూడా సందడి చేసింది హ్యాపీ బర్త్డే, భాగ్యనగర్ వీధుల్లో గమ్మత్తు, మత్తు వదలరా , బంగార్రాజు , హనుమాన్ వంటి చిత్రాలతో పాటు సేవ్ ద టైగర్స్ వంటి వెబ్ సిరీస్ లలో కూడా కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక అలాగే బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లో వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చి మరోసారి అభిమానులను ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ.. పెళ్లీడు వచ్చినా పెళ్లి చేసుకోకుండా ఇంకా ఒంటరిగానే సినిమాలు, షోలు అంటూ కెరియర్ ను కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలోనే పలు ఇంటర్వ్యూలలో ఎంతో మంది యాంకర్లు పెళ్లి ఎప్పుడు అని అడగగా.. నవ్వుతూ తప్పించుకునే రోహిణి..మరోసారి ఈ ప్రస్తావన రావడంతో సదరు యాంకర్ పై ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా శాపనార్థాలు కూడా పెట్టేసింది.

ఆదివారం విత్ స్టార్ మా పరివారం ప్రోమో రిలీజ్..

Advertisement

అసలు విషయంలోకి వెళ్తే.. శ్రీముఖి, ఎక్స్ప్రెస్ హరి, ముక్కు అవినాష్ కలయికలో బుల్లితెర సెలబ్రిటీలతో సందడి చేస్తున్న షో “ఆదివారం విత్ స్టార్ మా పరివారం”. ప్రతి ఆదివారం స్టార్ మాలో ప్రసారమయ్యే ఈ కార్యక్రమం ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచుతోంది. ఇక ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ఈసారి కొత్తగా ఈ షో సిద్ధమైపోయింది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఇందుకు సంబంధించిన ప్రోమోని స్టార్ మా విడుదల చేయగా.. ఇందులో బుల్లితెర నటులు , సెలబ్రిటీలు సందడి చేశారు.

రోహిణి పై వ్యక్తిగత అటాక్..

ముందుగా యూట్యూబర్ నిఖిల్ విజయేంద్ర సింహతో శ్రీముఖి మాట్లాడుతూ.. ఈ ఏడాది నీ పెళ్లి అనే వార్త గురించి సత్య మాత్రమే కాదు బయట అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు అని చెప్పింది . ఇక మధ్యలో దూరిన రోహిణి చివరికి ఇతడిని కూడా నీ పెళ్లి ఎప్పుడు అని అడుగుతున్నారు. నన్ను మాత్రం అడగడం లేదు అని ప్రశ్నించింది. వాడికి పెళ్లి వయసు వచ్చింది కాబట్టి అడిగారు నీది పెళ్లి వయసు దాటిపోయింది.. ఇక దేని గురించి అడుగుతామని ఎక్స్ప్రెస్ హరి కౌంటర్ వేస్తాడు.

Advertisement

ALSO READ:Trisha Krishnan: రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న త్రిష.. పొత్తులో కీలకం కానుందా?

శాపనార్ధాలు పెట్టిన రోహిణి..

దాంతో సీరియస్ అయిన రోహిణి నీకు పెళ్లి అవ్వలేదు కదా.. అస్సలు అవ్వదు.. వీడు నాతో పాటు సింగిల్ గానే ఉండిపోతాడు.. అంటూ శాపనార్ధాలు పెట్టడంతో హరి కూడా షాక్ అవుతాడు.. ఇక ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఇక ఇది చూసిన అభిమానులు కొంతమంది ఆశ్చర్యపోతుంటే.. మరికొంతమంది షో టి ఆర్ పి రేటింగ్ కోసం ఇలా కామెంట్లు చేశారు అని అభిప్రాయాలు పంచుకుంటున్నారు

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×