E-Paper
Advertisement

Punarnavi wedding: ప్రియుడుతో పెళ్లి పీటలెక్కిన బిగ్ బాస్ పునర్నవి.. ఫోటోలు వైరల్!

Punarnavi wedding: ప్రియుడుతో పెళ్లి పీటలెక్కిన బిగ్ బాస్ పునర్నవి.. ఫోటోలు వైరల్!
Advertisement

Punarnavi wedding: గత కొద్ది రోజులుగా తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన సెలబ్రిటీలు పెద్ద ఎత్తున పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగు పెడుతున్నారు. ఈ నేపథ్యంలోనే బిగ్ బాస్ బ్యూటీ పునర్నవి భూపాలం(Punarnavi Bhupalam) తన ప్రియుడు హేమంత్ వర్మ(Hemanth Varma)తో కలిసి పెళ్లి పీటలు ఎక్కారు ప్రస్తుతం వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పునర్నవి నటిగా పలు సినిమాలలో నటించి సందడి చేశారు. అనంతరం బిగ్ బాస్ కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొన్న ఈమె ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్నారు. అయితే ఇటీవల ఇండస్ట్రీకి దూరంగా విదేశాలలో ఉన్నత చదువుల కోసం వెళ్లారు.

ప్రియుడిని పెళ్లాడిన పునర్నవి..

ఇలా లండన్ లో ఉన్నత చదువులు చదువుతున్న ఈమె గత ఏడాది తన ప్రియుడిని అందరికీ పరిచయం చేశారు. పునర్నవి హేమంత్ వర్మ అనే అబ్బాయితో ప్రేమలో ఉన్న విషయాన్ని తెలియజేయడమే కాకుండా ఇటీవల ఎంతో ఘనంగా నిశ్చితార్థం కూడా జరుపుకున్నారు. అత్యంత సన్నిహితులు కుటుంబ సభ్యులు సమక్షంలో ఎంతో ఘనంగా పెళ్లి చేసుకున్నారు.ప్రస్తుతం ఈమెకు సంబంధించిన పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ విధంగా వీరి పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానులు కొత్త జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ఉయ్యాల జంపాలతో ఇండస్ట్రీకి పరిచయం..

Advertisement

ఇండస్ట్రీకి దూరమైన పునర్నవి ఇప్పుడు పెళ్లి చేసుకొని కొత్త జీవితంలోకి అడుగు పెట్టారు. మరి ఇప్పుడు తనకు సినిమా అవకాశాలు వస్తే తిరిగి ఇండస్ట్రీలోకి వస్తారా? లేదంటే ఇండస్ట్రీకి పూర్తిగా దూరంగా ఉంటారా? అనేది తెలియాల్సి ఉంది. ఇక ఈమె మొదటగా అవికా గోర్ రాజ్ తరుణ్ హీరో హీరోయిన్లుగా నటించిన ఉయ్యాల జంపాల అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాలో తన నటనతో ప్రేక్షకులను మెప్పించిన ఈమె అనంతరం పలు సినిమాలలో నటించే అవకాశాన్ని అందుకున్నారు.

Advertisement

ఇలా సినిమాలలో పునర్నవి నటించినప్పటికీ ఈ సినిమాల ద్వారా పెద్దగా సక్సెస్ మాత్రం అందుకోలేకపోయారు. అనంతరం ఈమెకు బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోలో కంటెస్టెంట్ గా పాల్గొనే అవకాశం వచ్చింది ఇలా సీజన్ 3 కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొన్న ఈమె ఈ కార్యక్రమం ద్వారా మంచి సక్సెస్ అందుకున్నారు. ఇక బిగ్ బాస్ కార్యక్రమంలో కొనసాగుతున్న సమయంలో ఈమె సింగర్ రాహుల్ తో రిలేషన్ లో ఉన్నారంటూ అప్పట్లో వార్తలు వచ్చాయి కానీ అదంతా నిజం కాదని తెలుస్తోంది. ఇక బిగ్ బాస్ తర్వాత పలు వెబ్ సిరీస్ లలో నటించిన ఈమె ప్రస్తుతం ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. పెళ్లి చేసుకున్న హేమంత్ వర్మ ప్రముఖ ఫోటోగ్రాఫర్ అని సమాచారం. మొత్తానికి పునర్నవి పెళ్లి చేసుకోవడంతో అభిమానులు కూడా అభినందనలు తెలుపుతున్నారు.

Also Read: Band Melam Trailer: బావా మరదళ్ల ప్రేమకథగా బ్యాండ్ మేళం.. ఆకట్టుకుంటున్న ట్రైలర్!

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×