E-Paper
Advertisement

పెళ్లిపీటలెక్కిన బిగ్ బాస్ ప్రియాంక..ఇలా షాక్ ఇచ్చేందేంటి భయ్యా!

పెళ్లిపీటలెక్కిన బిగ్ బాస్ ప్రియాంక..ఇలా షాక్ ఇచ్చేందేంటి భయ్యా!
Advertisement

Priyanka Singh: వెండితెర, బుల్లితెర సెలబ్రిటీలంతా వరుసగా పెళ్లి పీటలెక్కుతున్న వేళ.. తాజాగా బిగ్ బాస్ బ్యూటీ ప్రియాంక సింగ్ పెళ్లి వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. పట్టుచీర, ఒంటినిండా నగలతో పెళ్లికూతురిలా ముస్తాబైన ఫోటోలు చూసి ఫ్యాన్స్ అంతా షాక్ తిన్నారు. నిజంగానే ప్రియాంక ఏడడుగులు వేయబోతుందా? లేక ఇదంతా ఏదైనా ప్రాజెక్ట్ కోసమా? అనే కన్ఫ్యూజన్ నెటిజన్లలో మొదలైంది. అసలు ఆమె పెళ్లి వెనుక ఉన్న అసలు మ్యాటర్ ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

పెళ్లికూతురిలా మెరిసిపోయిన ప్రియాంక:

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ప్రియాంక సింగ్ తాజాగా కొన్ని ఫోటోలు, వీడియోలు షేర్ చేసింది. అందులో ఆమె అచ్చం పెళ్లికూతురిలా పట్టుచీర కట్టుకుని, మెడలో భారీ నగలు వేసుకుని మురిసిపోతూ కనిపించింది. ఇది చూసిన నెటిజన్లు ఒక్కసారిగా కన్ఫ్యూజ్ అయ్యారు. “అరే.. ప్రియాంక పెళ్లి చేసేసుకుందా?” అని కొందరు, “వరుడు ఎవరో చెప్పకుండానే ఇలా షాక్ ఇచ్చిందేంటి?” అని మరికొందరు కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు. అయితే, ఆ ఫోటోల వెనుక ఉన్న అసలు విషయం ఏంటంటే.. అది ఒక ప్రైవేట్ బ్రాండ్ కోసం చేసిన యాడ్ షూట్ మాత్రమే.

జబర్దస్త్ నుంచి బిగ్ బాస్ వరకు:

Advertisement

ప్రియాంక సింగ్ ప్రయాణం అందరికీ తెలిసిందే. ‘జబర్దస్త్’ షోలో సాయి తేజగా లేడీ గెటప్స్ వేస్తూ అందరినీ నవ్వించిన ఆమె, ఆ తర్వాత లింగ మార్పిడి చేయించుకుని ప్రియాంక సింగ్‌గా మారింది. బిగ్ బాస్ సీజన్ 5లో కంటెస్టెంట్‌గా అడుగుపెట్టి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. హౌస్‌లో ఉన్నప్పుడు తోటి కంటెస్టెంట్ మానస్‌తో ఆమె చేసిన సందడి, తన మనసులోని భావాలను ధైర్యంగా చెప్పడం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. తన తండ్రికి లింగ మార్పిడి విషయం చెప్పిన ఆ ఎమోషనల్ క్షణాలను ఎవరూ మర్చిపోలేరు.

తండ్రి ప్రేమే అసలైన గెలుపు:

లింగ మార్పిడి చేయించుకున్న విషయం తన తండ్రికి ఎలా చెప్పాలో తెలియక బిగ్ బాస్ హౌస్‌లోనే ఆవేదన వ్యక్తం చేసిన ప్రియాంక.. బయటకు వచ్చాక అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆమె తండ్రి మొదట షాక్ తిన్నా, ఆ తర్వాత తన బిడ్డను ప్రేమగా దగ్గరకు తీసుకున్నారు. ఇక సమాజం ఏమనుకున్నా పర్వాలేదు, నా బిడ్డ నాకు ముఖ్యమని ఆయన చూపించిన ప్రేమ అప్పట్లో వైరల్ అయ్యింది. ప్రస్తుతం ప్రియాంక తన తండ్రి ఆశీస్సులతో కెరీర్‌లో ముందుకు సాగుతూ తనకంటూ ఒక అందమైన లోకాన్ని నిర్మించుకుంటోంది.

Advertisement

ALSO READ:ఓటీటీలోకి రాధికా శరత్ కుమార్ తాయ్ కెలవి.. స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడంటే?

పెళ్లి ఎప్పుడు అంటే?

ప్రస్తుతానికి ప్రియాంక సింగ్ పెళ్లి చేసుకోలేదు కేవలం షూటింగ్ కోసమే అలా రెడీ అయ్యింది. అయితే, ఆమె ఫోటోలు చూస్తుంటే నిజంగానే పెళ్లికళ వచ్చేసిందని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. ఒకప్పుడు ఎన్నో అవమానాలు ఎదుర్కొన్న ప్రియాంక, ఇప్పుడు ధైర్యంగా తన లైఫ్‌ను లీడ్ చేయడం చాలా మందికి స్ఫూర్తినిస్తోంది. మరి ఈ బ్యూటీ నిజంగానే ఎప్పుడు పెళ్లి పీటలెక్కుతుందో, ఆ లక్కీ పర్సన్ ఎవరో తెలియాలంటే ఆమె స్వయంగా ప్రకటించే వరకు వెయిట్ చేయాల్సిందే. ఏదేమైనా ప్రియాంక ఫోటోలు మాత్రం నెట్టింట సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి!

?utm_source=ig_web_copy_link&igsh=NTc4MTIwNjQ2YQ==

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×