E-Paper
Advertisement

సైలెంట్ గా పెళ్లి చేసుకుని షాక్ ఇచ్చిన బిగ్ బాస్ బ్యూటీ.. వరుడు ఎవరంటే?

సైలెంట్ గా పెళ్లి చేసుకుని షాక్ ఇచ్చిన బిగ్ బాస్ బ్యూటీ.. వరుడు ఎవరంటే?
Advertisement

Film industry:ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలు తమ మనసుకు నచ్చిన వారిని చెప్పా పెట్టకుండా పెళ్లి చేసుకొని సడన్ సర్‌ప్రైజ్ ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మొన్నటికి మొన్న కొంతమంది బుల్లితెర నటీమణులు ఇలాగే పెళ్లి చేసుకొని సడన్ షాక్ ఇవ్వగా .. ఇప్పుడు మరో బుల్లితెర నటి, బిగ్ బాస్ ఓటీటీ 2 మాజీ కంటెస్టెంట్ సడన్గా పెళ్లి చేసుకుని అభిమానులను ఆశ్చర్యపరిచింది. ముఖ్యంగా తన పెళ్లిలో సంతరించుకున్న ఒక ప్రాముఖ్యత అందరి దృష్టిని ఆకట్టుకుంటుంది. మరి ఆమె ఎవరు ? ఆమె పెళ్లి ఎక్కడ జరిగింది ? ఆమె పెళ్లిలో చోటు చేసుకున్న ఆ ప్రత్యేక పరిణామం ఏంటి? అనే విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

సైలెంట్ గా పెళ్లి చేసుకున్న బిగ్ బాస్ బ్యూటీ..

ఆమె ఎవరో కాదు ప్రముఖ నటి పాలక్ పుర్స్వానీ. తన చిరకాల ప్రియుడితో ఈమె ఏడు అడుగులు వేసింది. ముఖ్యంగా సద్గురుకి చెందిన ఈషా ఫౌండేషన్ లో తన ప్రియుడు రోహన్ ఖన్నాను ఈమె వివాహం చేసుకుంది. గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న పాలక్ – రోహన్ ఖన్నా ఎట్టకేలకు కుటుంబ సభ్యులను ఒప్పించి , చడీ చప్పుడు లేకుండా సైలెంట్ గా అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి చేసుకుని.. ఆ ఫోటోలను ఇంస్టాగ్రామ్ వేదికగా పంచుకున్నారు. దీంతో అభిమానులు, సినీ సెలబ్రిటీలు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

తొలి ఆధ్యాత్మిక వివాహంగా..

Advertisement

కోయంబత్తూర్ లోని ఈషా ఫౌండేషన్ లో సుమారుగా 112 అడుగుల ఎత్తున ఆది యోగి విగ్రహం ముందు జరిగిన తొలి ఆధ్యాత్మిక వివాహంగా ఈ పెళ్లి నిలుస్తోంది. ఈ పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోలను తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేయడంతో అసలు విషయం కాస్త బయటకు వచ్చింది. మొత్తానికైతే ఈషా ఫౌండేషన్ లో ఆ పరమశివుని విగ్రహం ముందు జరిగిన ఈ వేడుక నెట్టింట అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఆదియోగి విగ్రహం ముందు మూడు ముళ్ళతో ఒక్కటైన ఈ జంట ఆ విగ్రహం నుండి ఇటుగా నడుచుకుంటూ వస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

పాలక్ – రోహన్ లవ్ స్టోరీ..

వీరిద్దరి మధ్య 2024లో పరిచయం ఏర్పడింది. ఏడాది తిరగకుండానే టర్కీ పర్యటనలో రోహన్ ఆమెకు ప్రపోజ్ చేశాడు . గత ఏడాది ఏప్రిల్ లో నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట.. తాజాగా పెళ్లి చేసుకుని అభిమానులను సర్ప్రైజ్ చేశారు. ఎరుపు , గులాబీ , గోధుమ రంగుల కలయికతో ఉన్న పెళ్లి లెహంగాలో అద్భుతంగా కనిపించగా.. రోహన్ లేత గోధుమ రంగు షేర్వానీలో మెరిశాడు. పైగా ఈ ఫోటోలను పాలక్ షేర్ చేస్తూ..” కొన్ని ప్రేమకథలను ఆ దేవుడే రచిస్తాడు ..మా ప్రేమ కథను మహాదేవుడు ఎంపిక చేశారు.. రెండు ఆత్మలు శాశ్వతంగా ఒక్కటయ్యాయి. 26.06.26 అంటూ పోస్ట్ పెట్టింది . పాలక్ పెట్టిన ఈ పోస్ట్ ను బట్టి చూస్తే వీరి వివాహం రెండు వారాల క్రితమే జరిగినట్లు తెలుస్తోంది.

Advertisement

ALSO READ:శ్రీలీలతో విభేదాలపై స్పందించిన నిర్మాత.. మరీ ఇంత దారుణమా?

పాలక్ కెరియర్..

ఈమె కెరియర్ విషయానికి వస్తే ..2014లో టీవీ నటిగా తన కెరియర్ ను ప్రారంభించిన ఈమె బడే భయ్యాకి దుల్హనియా, రుహానియత్, యే రిష్తే హై ప్యార్ కే, ఏక్ ఆస్థా ఐసీ భీ, బడీ దేవరాణి వంటి సీరియల్స్ లో కనిపించి పాపులారిటీ అందుకుంది. ముఖ్యంగా 2019లో నాచ్ బలియే 9, 2023 లో బిగ్ బాస్ ఓటిటి సీజన్ 2 లో కూడా పాల్గొని సందడి చేసింది.

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×