E-Paper
Advertisement

రూ.25లక్షలు ఇస్తా.. ఫామ్ హౌస్ కి రా.. లైంగిక వేధింపులపై బిగ్ బాస్ బ్యూటీ షాకింగ్ కామెంట్స్!

రూ.25లక్షలు ఇస్తా.. ఫామ్ హౌస్ కి రా.. లైంగిక వేధింపులపై బిగ్ బాస్ బ్యూటీ షాకింగ్ కామెంట్స్!
Advertisement

Kirrak sita:సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉందంటూ ఎంతోమంది సెలబ్రిటీలు మీడియా ముందు ధైర్యంగా చెప్పిన విషయం తెలిసిందే. కొంతమంది తమను వేధించిన వారి పేర్లను నేరుగా బయట పెడితే.. మరికొంతమంది వారి పేర్లను ప్రస్తావించకుండా తమకు జరిగిన అన్యాయాన్ని మాత్రమే అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ముఖ్యంగా మరికొంతమంది ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో ఇలాంటి వేధింపులు ఎదుర్కొన్నామని చెబితే.. మరి కొంతమంది చిన్న వయసులోనే ఇలాంటి సమస్యలు తప్పలేదు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అటు యూట్యూబ్ ద్వారా ఇటు బిగ్ బాస్ ద్వారా ఇటీవల సినిమాలతో కూడా మంచి పాపులారిటీ అందుకున్న ఒక బ్యూటీ తనను మానసికంగా, లైంగికంగా వేధింపులకు గురి చేశారని.”రూ.25 లక్షలు ఇస్తాను.. ఫామ్ హౌస్ కి రా” అంటూ అత్యంత దారుణంగా తనతో మాట్లాడినట్లు చెప్పుకొచ్చింది.

బేబీ సినిమాతో ఊహించని గుర్తింపు..

ఆమె ఎవరో కాదు కిర్రాక్ సీత. ఆనంద్ దేవరకొండ హీరోగా, యూట్యూబర్ వైష్ణవి చైతన్య హీరోయిన్గా తొలి పరిచయంలో వచ్చిన చిత్రం బేబీ. ఈ సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ పాత్రలో నటిస్తూనే మరొకవైపు విలనిజాన్ని కనబరిచి అందరి దృష్టిని ఆకట్టుకుంది. ఈ ఒక్క సినిమాతో వెలుగులోకి వచ్చింది ఈ ముద్దుగుమ్మ. అయితే ఈ సినిమాలో నటించడానికి కంటే ముందే యూట్యూబ్ లో బోల్డ్ వీడియోలు చేస్తూ మరింత పాపులారిటీ సొంతం చేసుకుంది. ముఖ్యంగా బూతు కంటెంట్ చేస్తూ క్రేజ్ అందుకుంది. ఇక అలా యూట్యూబ్ లో సందడి చేస్తున్న సమయంలోనే టీవీ షోలు , సినిమాలలో కూడా ఆఫర్లు లభించాయి. అంతేకాదు బిగ్ బాస్ సీజన్ 8లో 9వ కంటెంట్ గా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది కూడా..

నిర్మాత పై క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు…

Advertisement

ఇదిలా ఉండగా సీత ఒక ఇంటర్వ్యూలో పాల్గొని..” చిన్న వయసులోనే సినిమాలలో అవకాశాల పేరుతో ఫామ్ హౌస్ కి రావాలని ఒత్తిడి తెచ్చారు. ఒక నిర్మాత రూ.25 లక్షలు ఇస్తాను.. ఫామ్ హౌస్ కి రా అంటూ నన్ను ప్రలోభ పెట్టారు. అయితే నాకు ఆ వయసులోనే అది కరెక్ట్ కాదు అని అనిపించి నో చెప్పాను. ఇప్పటికీ అలాంటి కాల్స్, మెసేజ్లు ఎన్నో వస్తూ ఉంటాయి” అంటూ తాను ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి చెప్పుకొచ్చింది సీత. ప్రస్తుతం సీత చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

also read:శ్రీదేవితో పెళ్లి రూమర్స్‌పై జేడీ చక్రవర్తి క్లారిటీ!

కిర్రాక్ సీత బ్యాక్ గ్రౌండ్..

Advertisement

సీత బ్యాక్ గ్రౌండ్ విషయానికి వస్తే.. ఈమె పక్కా రాయలసీమ అమ్మాయి. ఈమె తండ్రి ఒక ప్రభుత్వ ఉద్యోగి కాగా తల్లి హౌస్ వైఫ్.. నంద్యాలలో పుట్టి పెరిగిన సీత, ఆ తర్వాత హైదరాబాద్ ఉప్పల్ ప్రాంతంలో స్థిరపడ్డారు. 17 ఏళ్ల వయసు నుంచే తన తల్లిదండ్రులపై ఆధారపడకూడదని భావించిన ఈమె.. ఒకవైపు చదువుకుంటూనే మరొకవైపు ట్యూషన్స్ కూడా చెప్పింది. సినిమాలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నప్పుడు ఎన్నో కష్టాలు కూడా పడింది. అలా యూట్యూబ్లో బోల్డ్ గా కనిపించే సీత రియల్ లైఫ్ లో మాత్రం అలా కాదు. ఎలాంటి చెడు నిర్ణయాలు తీసుకోకుండా.. ఎవరికి లొంగకుండా తనను తాను నిరూపించుకుంటూ ముందుకు వెళ్తోంది . ఇక ఈమె భరతనాట్యం , కూచిపూడి లో మంచి ప్రావీణ్యత కూడా సంపాదించుకుంది.

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×