E-Paper
Advertisement

Haritha Harish: భార్య కాళ్లు పట్టుకొని క్షమాపణలు చెప్పిన మాస్క్ మ్యాన్ హరిత హరీష్.. తప్పు చేశానంటూ

Haritha Harish: భార్య కాళ్లు పట్టుకొని క్షమాపణలు చెప్పిన మాస్క్ మ్యాన్ హరిత హరీష్.. తప్పు చేశానంటూ
Advertisement

Haritha Harish: తెలుగు బుల్లితెర పై ప్రసారమైన అతి పెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా ఎంతో మంది మంచి ఆదరణ సొంతం చేసుకున్నారు. ఇలా ఈ కార్యక్రమాల ద్వారా గుర్తింపు పొందిన వారిలో మాస్క్ మెన్ హరిత హరీష్(Haritha Harish) ఒకరు. బిగ్ బాస్ 9(Bigg Boss 9) కార్యక్రమంలో భాగంగా కామన్ మ్యాన్ క్యాటగిరిలో భాగంగా కొంతమంది సామాన్య వ్యక్తులకు కూడా కంటెస్టెంట్లుగా పాల్గొనే అవకాశాన్ని ఇచ్చారు. ఇలా కామన్ మెంట్ క్యాటగిరిలో భాగంగా హౌస్ లోకి వెళ్లినటువంటి వారిలో హరిత హరీష్ ఒకరు.

భార్యకు క్షమాపణలు చెప్పిన మాస్క్ మెన్..

ఈయన పేరు హరీష్ అయినప్పటికీ తన భార్య మీద ఎంతో ఇష్టమైన ప్రేమ గౌరవం ఉన్న నేపథ్యంలో తన భార్య పేరును తన పేరు పక్కన పెట్టుకొని హరిత హరీష్ గా చలామణి అవుతున్నారు. ఇక ఈ విషయాన్ని అగ్ని పరీక్ష సమయంలో తెలియజేశారు అయితే ఒకసారి తనకు కోపం వచ్చి తన భార్యపై చేయి చేసుకున్నాననే విషయాన్ని కూడా హరిత హరీష్ చెప్పడంతో ఈయనపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. ఇలా ముక్కు సూటిగా మొండితనంతో బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్ గా కొన్ని వారాలపాటు కొనసాగిన ఈయన అనంతరం ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చారు.

ఆడవారిపై చేయి చేసుకోవడం తప్పు..

Advertisement

ఇలా బిగ్ బాస్ ద్వారా మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకున్న హరిత హరీష్ ప్రస్తుతం స్టార్ మా లో ప్రసారం కాబోతున్న మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ (Mad For Each Other)అనే కార్యక్రమంలో తన భార్య హరిత(Haritha)తో కలిసి పాల్గొనబోతున్నారు తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రోమోలో భాగంగా హరీష్ తన భార్య కాళ్లు పట్టుకొని తనకు క్షమాపణలు కోరారు. ఇలా తన భార్యకు క్షమాపణలు చెప్పడమే కాకుండా మగాడు ఫిజికల్ గా స్ట్రాంగ్ గా ఉంటాడని చెప్పి ఆడవారిపై చేయి ఎత్తడం చాలా తప్పు అంటూ ఈ సందర్భంగా క్షమాపణలు కోరారు. ప్రస్తుతం ఈ ప్రోమో వీడియో వైరల్ అవుతుంది. ఇక ఈ కార్యక్రమం మార్చి 15 నుంచి స్టార్ మా లోను అలాగే జియో హాట్ స్టార్ లో ప్రసారం కాబోతోంది.

Advertisement

ఇక ఈ కార్యక్రమంలో రియల్ కపుల్స్ పాల్గొని సందడి చేయబోతున్నారు దాదాపు పది వారాల పాటు ఈ కార్యక్రమం ఉండబోతుందని తెలుస్తుంది. అచ్చం బిగ్ బాస్ తరహాలోనే ఈ షోని సరికొత్తగా స్టార్ మా ప్లాన్ చేశారు. ఇందులో భాగంగానే హరిత హరీష్ సైతం జంటగా పాల్గొన్నారు. బిగ్ బాస్ హౌస్లో అనుకున్న విధంగా సక్సెస్ అందుకోలేకపోయినా హరీష్ ఈ కార్యక్రమం ద్వారా అయినా సక్సెస్ అందుకుంటారా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇక కార్యక్రమంలో ఎక్కువగా బుల్లితెర జంటలు పాల్గొనబోతున్నారు. ఇక ఈ కార్యక్రమానికి నటి లయతో పాటు సీనియర్ హీరోయిన్ ,రాధిక, డైరెక్టర్ అనిల్ రావిపూడి జడ్జెస్ గా వ్యవహరించగా యాంకర్ గా శ్రీముఖి కొనసాగున్నారు. ప్రస్తుతం ప్రోమో వీడియో వైరల్ అవుతుంది.

Also Read: Bellamkonda Srinivas: బెల్లంకొండ శ్రీనివాస్ పెళ్లి.. అమ్మాయి బ్యాక్ గ్రౌండ్  ఏంటో తెలుసా?

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×