E-Paper
Advertisement

Demon Pawan: డెమోన్ పవన్ ఫస్ట్ ఫ్లైట్ జర్నీ.. దేవుడు ఇలా రాసిపెట్టాడంటూ ఎమోషనల్!

Demon Pawan: డెమోన్ పవన్ ఫస్ట్ ఫ్లైట్ జర్నీ.. దేవుడు ఇలా రాసిపెట్టాడంటూ ఎమోషనల్!
Advertisement

Demon Pawan: డెమోన్ పవన్ పరిచయం అవసరం లేని పేరు. తణుకు జిల్లాకు చెందిన పవన్ సినిమాలపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి రావడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఆ సమయంలోనే తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమంలో కామన్ మ్యాన్ క్యాటగిరిలో సామాన్యులకు కూడా అవకాశాలు కల్పిస్తున్నారనే విషయం తెలుసుకున్న ఈయన బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొనడం కోసం ప్రయత్నాలు చేశారు అయితే ఈ కార్యక్రమానికి సెలెక్ట్ అయిన పవన్ అగ్ని పరీక్షలో కూడా తన సత్తా చూపిస్తూ బిగ్ బాస్ అవకాశాన్ని అందుకున్నారు. ఇక ఈ కార్యక్రమంలో టాప్ 3 కంటెస్టెంట్ గా 15 లక్షల ప్రైజ్ మనీ తీసుకుని హౌస్ నుంచి బయటకు వచ్చారు.

క్యాన్సర్ తో పవన్ తండ్రి మరణం..

ఇక ఈ కార్యక్రమం తర్వాత పవన్ ప్రస్తుతం పలు బుల్లితెర కార్యక్రమాలలో పాల్గొంటూ సందడి చేస్తున్నారు. ఇదిలా ఉండదా ఇటీవల పవన్ తండ్రి దుర్గాప్రసాద్(Durga Prasad) మరణించిన విషయం తెలిసిందే. గత కొద్ది రోజులుగా ఈయన టంగ్ క్యాన్సర్ తో బాధపడుతున్నారు. తనకు ఇప్పటికే సర్జరీ చేయించి ట్రీట్మెంట్ అందించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. తన తండ్రి ట్రీట్మెంట్ కోసమే పవన్ బిగ్ బాస్ నుంచి టాప్ త్రీ కంటెంట్ గా 15 లక్షల ప్రైజ్ మనీతో బయటకు వచ్చి ట్రీట్మెంట్ అందించారు.. ఇక తన తండ్రి ఆరోగ్య పరిస్థితి పూర్తిగా విషమించడంతో గత కొద్దిరోజుల క్రితం మరణించిన సంగతి తెలిసిందే.

అమ్మానాన్నలతో వెళ్లాలనుకున్నా..

Advertisement

ఇలా పవన్ తండ్రి మరణించడంతో సోషల్ మీడియా వేదికగా ఎంతో మంది అభిమానులు పవన్ కుటుంబానికి సానుభూతి తెలియజేశారు. పవన్ తండ్రి మరణ వార్త తెలియగానే బిగ్ బాస్ కంటెస్టెంట్లు ఇమ్మాన్యూయేల్, రీతూ చౌదరి వెళ్లిన సంగతి తెలిసిందే. ఇకపోతే తాజాగా పవన్ తన సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోని షేర్ చేశారు. ఇందులో భాగంగా తన ఫస్ట్ ఫ్లైట్ జర్నీ (First Flight Journey)గురించి చెప్పుకువచ్చారు. ప్రతి ఒక్కరికి ఫస్ట్ ఫ్లైట్ జర్నీ చాలా స్పెషల్ గా ఉంటుంది నేను కూడా మా అమ్మ నాన్నలు లేదా నా ఫ్రెండ్స్ తో కలిసి ఫస్ట్ ఫ్లైట్ జర్నీ చేయాలి అనుకున్నాను . ఆ ఫ్లైట్ జర్నీ జీవితాంతం నాకు గుర్తుండిపోవాలని కోరుకున్నాను.

?igsh=d3RybWlxNHhsemdt

Advertisement

ఇలా తాను ఊహించిన దానికి భిన్నంగా జరుగుతోందని తెలిపారు. దురదృష్టవశాత్తు నేను ఎప్పటికీ మా నాన్నతో కలిసి ఫ్లైట్ ఎక్కలేను అందుకే మా నాన్న కోసం మొదటిసారి ఫ్లైట్ లో కాశీ వెళ్తున్నాను. దేవుడు నాకు ఇలాగే రాసి పెట్టాడేమో , ఇలా మా నాన్న కోసం మొదటిసారి విమానంలో కాశీ వెళ్లడం నాకు ఎంతో ప్రత్యేకంగా నిలుస్తుందని ఈయన మొదటి విమాన ప్రయాణం గురించి ఎమోషనల్ అయ్యారు అయితే తన తండ్రి కర్మకాండల నిమిత్తం పవన్ కాశీ వెళ్తున్నారని స్పష్టమవుతుంది. ఇలా తండ్రితో కలిసి వెళ్లాలనుకున్న పవన్ తండ్రి కోసం కాశి వెళ్తున్నానని చెప్పడంతో ఇది కాస్త వైరల్ అవుతుంది.

Also Read: Singer Chinmayi: వైరముత్తు జ్ఞానపీఠ అవార్డు.. పవన్ కళ్యాణ్ పై చిన్మయి ఫైర్.. ఏమి తెలియదంటూ!

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×