E-Paper
Advertisement

Big tv Kissik Talks: పెళ్లి విషయంలో ఇప్పటికీ రిగ్రేట్ ఉంది..ముందు ఆపని చేయమన్న శ్రీవాణి!

Big tv Kissik Talks: పెళ్లి విషయంలో ఇప్పటికీ రిగ్రేట్ ఉంది..ముందు ఆపని చేయమన్న శ్రీవాణి!
Advertisement

Big tv Kissik Talks: బుల్లితెరపై ప్రసారమైన చంద్రముఖి సీరియల్ ఎంతలా ఆదరణ పొందిందో అందరికీ తెలిసిందే. ఈ సీరియల్ ద్వారా నటి శ్రీవాణి (Sreevani)పూజ పాత్రలో నటించి మంచి సక్సెస్ అందుకున్నారు. ఇలా చంద్రముఖి సీరియల్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె ఇప్పటికే వరుస సీరియల్స్ లో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా నటిగా, హోస్ట్ గా, యూట్యూబర్ గా ఎంతో బిజీగా గడుపుతున్న శ్రీవాణి తాజాగా బిగ్ టీవీ కిస్సిక్ టాక్స్(Big tv kissik talks) కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈమె తన కెరియర్ గురించి అలాగే తన ఫ్యామిలీ గురించి ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకున్నారు.

చదువుకోలేకపోయాననే బాధ ఉంది..

ఇక శ్రీవాణి 17 సంవత్సరాల వయసులోనే ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈమె నటుడు విక్రమాదిత్యను ప్రేమించి వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు రాజనందిని అనే కుమార్తె ఉంది. నందిని కూడా ప్రస్తుతం ఢీ డాన్స్ షో కార్యక్రమంలో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. ఇలా చిన్న వయసులోనే పెళ్లి చేసుకున్న శ్రీవాణి తాజాగా పెళ్లి గురించి ఆసక్తికరమైన విషయాలను అభిమానులతో పంచుకున్నారు పెళ్లి తర్వాత ఏ విషయంలోనైనా రిగ్రెట్ గా ఫీలయ్యారా? అంటూ ప్రశ్న ఎదురైంది. ఈ ప్రశ్నకు శ్రీవాణి ఆసక్తికరమైన సమాధానం ఇవ్వడమే కాకుండా అందరికీ కొన్ని సలహాలు కూడా ఇచ్చారు.

ప్రతి ఒక్కరికి చదువు ముఖ్యం..

Advertisement

తాను ఇంటర్ సెకండియర్ పూర్తి అయిన తర్వాత పెళ్లి చేసుకున్నాను. పెళ్లి తర్వాత చదువు ప్రాధాన్యత ఏంటో తెలిసి వచ్చింది. అప్పుడు అనుకున్నాను చదువుకొని ఉంటే బాగుండేదే అనే భావన నాకు కలిగిందని అందుకే ప్రతి ఒక్కరూ కూడా చదువు పూర్తి చేసిన తరువాతనే మీరేమైతే కోరుకుంటున్నారో ఆ పనులు చేయండి. చదువు చాలా ముఖ్యం అంటూ ఈమె అందరికీ చదువుకోమని సలహా ఇచ్చారు. తన కూతురు కూడా ప్రస్తుతం ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతోందని తను పెద్దయిన తర్వాత సినిమాలలోకి వచ్చినా, లేదా ఏదైనా ప్రొఫెషన్ లో చేరిన మేం సపోర్ట్ చేస్తాం కానీ చదువు అయిపోయిన తరువాతనే అంటూ శ్రీవాణి రాజనందిని కెరియర్ గురించి కూడా తెలిపారు.

Advertisement

ప్రతి ఒక్కరికి చదువు అనేది చాలా ఇంపార్టెంట్ చదువు ఉంటేనే ఏ విషయంలోనైనా చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడగలం ఏ పనులైనా చేయగలం చదువు లేకపోతే ఇబ్బందులు పడాల్సి వస్తుందని నేను చాలా ఇబ్బందులు పడ్డానని శ్రీవాణి తెలిపారు. ఇక ఈమె తన పెళ్లి గురించి కూడా తెలిపారు. తాను ఏడో తరగతి చదువుతున్న సమయంలోనే ఇండస్ట్రీలోకి వచ్చాను అప్పటినుంచి విక్రమాదిత్య గారు నన్ను ఎన్నో విషయాలలో సపోర్ట్ చేశారు. ఒక యాంకర్ గా నటిగా ఇలా అన్ని విషయాలను సపోర్ట్ చేయడంతో తను నాకు పర్ఫెక్ట్ అనుకొని పెళ్లి చేసుకున్నాను అంటూ ఈ సందర్భంగా తన పెళ్లి గురించి కూడా శ్రీవాణి తెలియజేశారు.

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×