E-Paper
Advertisement

Big tv Kissik Talks: ఐ బొమ్మ రవి పై శ్రీవాణి కామెంట్స్… హ్యాపీగా చూడొచ్చు కదా అంటూ!

Big tv Kissik Talks: ఐ బొమ్మ రవి పై శ్రీవాణి కామెంట్స్… హ్యాపీగా చూడొచ్చు కదా అంటూ!
Advertisement

Big tv Kissik Talks: ఐ బొమ్మ రవి(Ibomma Ravi) ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఎక్కడ చూసిన ఈయన పేరే మారుమోగుతుంది. గత కొన్ని సంవత్సరాలుగా పెద్ద ఎత్తున సినిమాలను పైరసీ చేస్తూ కోట్లు సంపాదించడమే కాకుండా సినిమా ఇండస్ట్రీకి వేలకోట్ల రూపాయల నష్టాన్ని తీసుకువచ్చారు. ఇలా పైరసీ తిమింగలాన్ని పోలీసులు పట్టుకొని ప్రస్తుతం జైలులో ఉంచిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఐ బొమ్మ రవి ప్రస్తుతం చంచల్ గూడ జైలులో ఉన్నారు. మొదట 14 రోజులు పాటు రిమాండ్ విధించినప్పటికీ అనంతరం మరోసారి ఈయనకు రిమాండ్ విధించడంతో జైలులోనే ఉన్నారు. ఇక రిమాండ్ లో ఉన్న రవి నుంచి పోలీసులు పెద్ద ఎత్తున సమాచారం రాబట్టే ప్రయత్నాలు చేస్తున్నారు.

పైరసీ పెద్ద తప్పు..

ఇలా సినిమాలను పైరసీకి పాల్పడుతూ ఇండస్ట్రీకి పెద్ద ఎత్తున నష్టాలను తీసుకువచ్చిన రవి గురించి సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సెలెబ్రిటీలు మాట్లాడుతూ వారి అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. తాజాగా సీరియల్ నటి శ్రీవాణి (Sreevani)సైతం బిగ్ టీవీ కిస్సిక్ టాక్స్ (Big tv Kissik Talks)కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఐ బొమ్మ రవి గురించి ప్రశ్నలు ఎదురవడంతో ఆమె ఆసక్తికరమైన సమాధానాలను తెలియజేశారు. ఒక సినిమా ప్రేక్షకుల ముందుకు రావాలి అంటే నిర్మాతలు డబ్బు ఖర్చు చేయడం మాత్రమే కాదు ఆ సినిమా వెనుక కొన్ని వేల మంది శ్రమ ఉంటుందని తెలిపారు..

వేలమంది కష్టం వృధా..

Advertisement

సరైన సమయానికి భోజనం తినక, నిద్రలేక సినిమా కోసం కష్టపడుతూ ఆ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తే ఒక్క క్షణంలో ఆ సినిమాని పైరసీ చేసి వారందరి కష్టాన్ని వృధా చేసినట్టేనని తెలిపారు. ఒకవేళ సినిమాని థియేటర్లలో చూసే స్థోమత మీకు లేకపోతే సినిమా థియేటర్లో విడుదలైన నెల రెండు నెలలకే టీవీలలో ప్రసారమవుతుంది ఎంచక్కా ఫ్యామిలీతో కలిసి టీవీలో సినిమా చూస్తూ ఎంజాయ్ చేయండి కానీ దయచేసి ఇలాంటి పైరసీలకు పాల్పడుద్దని ఇది పూర్తిగా తప్పని తెలిపారు.

Advertisement

ఇక టీవీలో కూడా ఎన్నో రకాల సీరియల్స్ టీవీ షోస్ వస్తున్నాయి. వాటిని చూడండి అంటూ ఈ సందర్భంగా శ్రీ వాణి తెలిపారు. పనిలో పనిగా ఈమె తన యూట్యూబ్ ఛానల్ ప్రమోషన్ కూడా చేసుకున్నారు. మీకు ఇవేవీ నచ్చకపోతే శ్రీవాణి ఇంస్టాగ్రామ్ ,యూట్యూబ్ ఛానల్ కూడా చూసేయండి అంటూ సరదాగా మాట్లాడారు.. ఇలా శ్రీవాణి ఐ బొమ్మ రవి గురించి, సినిమా పైరసీ గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి అయితే ఈయన అరెస్ట్ కావడంతో సినిమా ఇండస్ట్రీ నుంచి వ్యతిరేకత వచ్చిన సోషల్ మీడియాలో మాత్రం భారీ స్థాయిలో రవికి మద్దతు లభిస్తున్న సంగతి తెలిసిందే. రవి పేదల పాలిట దేవుడని, వేల కోట్లు ఖర్చు చేసి సినిమాలు ఎవరు చేయమన్నారు అంటూ నిర్మాతలకు వ్యతిరేకంగా రవికి మద్దతు తెలియజేస్తున్న సంగతి తెలిసిందే.

Also Read: Big tv Kissik Talks: శ్రీ వాణి బంగారం విలువ 20 కోట్లు.. ఆస్తులు విలువ ఎంతో తెలుసా?

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×