E-Paper
Advertisement

ఆ డైరెక్టర్ ఆర్టిస్టులను కొడితే సెలబ్రిటీలు అవ్వాల్సిందే… లక్కీ హ్యాండ్ అంటున్న సమన్ శెట్టి !

ఆ డైరెక్టర్ ఆర్టిస్టులను కొడితే సెలబ్రిటీలు అవ్వాల్సిందే… లక్కీ హ్యాండ్ అంటున్న సమన్ శెట్టి !
Advertisement

Big Tv Kissik Talks: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో కమెడియన్లకు సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఏ ఇండస్ట్రీలోనూ లేని విధంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది కమెడియన్లుగా కొనసాగుతుందని ఆదరణ సొంతం చేసుకున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ కమెడియన్ గా మంచి గుర్తింపు పొందిన వారిలో సుమన్ శెట్టి (Suman Shetty)ఒకరు. జయం సినిమా ద్వారా కమెడియన్ గా ఇండస్ట్రీకి పరిచయమైన ఈయన తెలుగు తమిళ కన్నడ భాషలలో ఏకంగా 300కు పైగా సినిమాలు చేసి ఎంతో మంచి ఆదరణ పొందారు. ఇలా వరుస సినిమాలలో నటిస్తూ ఉన్న సుమన్ శెట్టి ఇటీవల ఇండస్ట్రీకి కొంత గ్యాప్ ఇచ్చారు.

నాకు ఈ జీవితం ఇచ్చింది తేజ గారే..

ఇలా కొంత విరామం తర్వాత ఈయన బిగ్ బాస్ సీజన్ 9 కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొని సందడి చేశారు. ఈ కార్యక్రమంలో 14 వారాలపాటు హౌస్ లో కొనసాగిన సుమన్ శెట్టి ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత వరుస సినిమా అవకాశాలను అందుకుంటు కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. తాజాగా ఈయన కిస్సిక్ టాక్స్ (Kissik Talks) కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా తనకు సినిమా అవకాశం రావడం గురించి తన డైరెక్టర్ తేజ(Teja) గారి గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. డైరెక్టర్ తేజ ఎంతోమంది కొత్త వాళ్లను ఇండస్ట్రీకి పరిచయం చేసిన సంగతి తెలిసిందే. అలా తేజ గారు తనకు అవకాశం ఇచ్చారని నేను ఈ స్థాయిలో ఉన్నాను అంటే అందుకు కారణం తేజ గారని జీవితాంతం ఆయనకు రుణపడి ఉంటానని సుమన్ శెట్టి తెలిపారు.

నేను రోడ్డున పడినప్పుడు మీ ఇంటికి వస్తా..

Advertisement

ఇక ఇల్లు కట్టిస్తున్న సమయంలో తేజ గారు నాతో మాట్లాడుతూ నేను కొత్త వాళ్లకి ఎప్పుడు అవకాశాలు ఇస్తుంటాను ఎప్పుడు నా పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు .నేను రోడ్డు మీదకు వచ్చిన రోజు కచ్చితంగా మీ ఇంటికి వస్తాను నాకోసం ఒక గది కట్టించు అని చెప్పారు. అందుకే గురువు గారి కోసం ఒక గది కట్టించి పెట్టానని, అందులో నాకు వచ్చిన అవార్డులన్నీ పెట్టాను అంటూ సుమన్ శెట్టి తెలిపారు. ఇక తేజ గారి గురించి మాట్లాడుతూ తేజ గారు చెప్పిన విధంగా ఆర్టిస్టులు చేయకపోతే ఆయన కోపంతో కొడతారు.. మనం స్కూల్ కి వెళ్తే చెప్పింది చేయకపోతే టీచర్ ఎలా కొడతారో తేజ గారు కూడా అంతేనని తెలిపారు.

Advertisement

ఇకపోతే తేజ గారు ఎవరినైతే కొడతారో వాళ్ళు మాత్రం కెరియర్ పరంగా ఇండస్ట్రీలో సెలబ్రిటీలు అవుతారని ఆయనది లక్కీ హ్యాండ్ అంటూ సుమన్ శెట్టి తెలిపారు. నిజం సినిమా టైంలో సర్ కొంచెం కెరియర్ పరంగా వీక్ అయిపోతున్నాను నన్ను కొట్టండి అంటూ ఆయన దగ్గరికి వెళ్లానని ఈ సందర్భంగా సుమన్ శెట్టి గుర్తు చేసుకున్నారు . ఇక తేజ గారి కోసం ఏదైనా చేయాలంటే మీరు ఏం చేస్తారు? అనే ప్రశ్న ఈ సందర్భంగా ఎదురయింది.. గురువుగారి కోసం నేనేం చేయడానికి అయినా సిద్ధంగా ఉన్నాను. అయితే గురువుగారికి నేను సహాయం చేసే పరిస్థితి రాకూడదని కోరుకుంటాను అంటూ సుమన్ శెట్టి చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Also Read: వైయస్ జగన్ కు సినిమా అవకాశం.. ఇన్నేళ్ల తర్వాత బయట పెట్టిన డైరెక్టర్.. సినిమా ఏదంటే?

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×