E-Paper
Advertisement

Big tv kissik talks promo: డ్రెస్సింగ్ స్టైల్ పై దివి హాట్ కామెంట్స్..ఇప్పుడు కాకపోతే ఎప్పుడంటూ!

Big tv kissik talks promo: డ్రెస్సింగ్ స్టైల్ పై దివి హాట్ కామెంట్స్..ఇప్పుడు కాకపోతే ఎప్పుడంటూ!
Advertisement

Big TV Kissik talks Promo: బిగ్ టీవీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కిస్సిక్ టాక్స్ (Kissik Talks)కార్యక్రమంలో భాగంగా ప్రతివారం పలువురు సెలబ్రిటీలు పాల్గొంటూ సందడి చేస్తున్నారు. ఇక ఈవారం ఈ కార్యక్రమంలో భాగంగా సినీనటి బిగ్ బాస్ కంటెస్టెంట్ దివి వాద్య(Divi Vadthya) పాల్గొన్నారు. తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా దివి సినిమాలకు సంబంధించిన విషయాలతో పాటు తన వ్యక్తిగత విషయాలు గురించి కూడా అభిమానులతో పంచుకున్నారు. ఈ నేపథ్యంలోనే డ్రెస్సింగ్ స్టైల్ గురించి కూడా ఈమెకు ప్రశ్నలు ఎదురయ్యాయి. ఇటీవల టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో మహిళల వస్త్రధారణ గురించి పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే.

నచ్చిన బట్టలు ఇప్పుడే వేసుకోవాలి..

ఈ నేపథ్యంలోనే వర్ష దీవికు డ్రెస్సింగ్ స్టైల్ గురించి ప్రశ్నలు వేశారు. వయసులో ఉన్నాము మనకు నచ్చిన స్కర్ట్, షాట్స్ ఇప్పుడు వేసుకోకపోతే ఇంకెప్పుడు వేసుకుంటాము. మనం ఎలాంటి బట్టలు వేసుకొని అయినా బయటకు వెళ్ళినప్పుడు మన గురించి ఎవరేం మాట్లాడినా పట్టించుకోకూడదు అంటూ ఈమె డ్రెస్సింగ్ స్టైల్ పై తన అభిప్రాయాన్ని తెలియజేయడంతో కొందరు సానుకూలంగా స్పందించగా మరికొందరు విమర్శలు కురిపిస్తున్నారు. ఇక వస్త్రధారణ విషయంలో ప్రతి ఒక్కరికి ఒకొక అభిప్రాయం ఉంటుంది. వారి అభిప్రాయాలతో పని లేకుండా మనకు నచ్చినట్టు మనం ఉండాలన్న ఉద్దేశంతోనే దివి ఈ కామెంట్స్ చేశారని తెలుస్తుంది.

డ్రెస్సింగ్ స్టైల్ పై వివాదం…

Advertisement

ఇలా హీరోయిన్లు మహిళలు వేసుకునే వస్త్రధారణ కారణంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారంటూ ఇటీవల ఒక నటుడు చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్ చిత్ర పరిశ్రమలోనే తీవ్రదుమారం రేపాయి. ఇక ఈ విషయంపై ఎంతమంది సెలబ్రిటీలు స్పందిస్తూ వారి అభిప్రాయాలను తెలియజేశారు. తాజాగా దివి సైతం తన అభిప్రాయాన్ని తెలపటంతో ఈ కామెంట్స్ కాస్త వైరల్ అవుతున్నాయి. ఇక దివి కెరియర్ మొదట్లో మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టి అనంతరం పలు షార్ట్ ఫిలిమ్స్ చేసి మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఈ నేపథ్యంలోనే సినిమాలలో అవకాశాలను అందుకుంటూ కీలకపాత్రలలో కనిపిస్తూ సందడి చేశారు.

Advertisement

మహర్షి సినిమా ద్వారా ఈమె మొదటిసారి వెండితెరపై సందడి చేసిన దివి ప్రస్తుతం పలు సినిమాలు నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. ఇక దివి సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు.. ఈ నేపథ్యంలోనే ఈమెకు బిగ్ బాస్ సీజన్ ఫోర్ రియాలిటీ షోలో కంటెస్టెంట్ గా పాల్గొనే అవకాశం లభించింది. బిగ్ బాస్ తర్వాత మరింత క్రేజ్ సొంతం చేసుకున్న ఈమె ప్రస్తుతం ఇండస్ట్రీలో కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు.

Also Read: Big tv kissik talks promo: ఆ క్షణం చచ్చిపోయాను .. అంత ఈజీగా మర్చిపోలేము.. దివి ఎమోషనల్

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×