E-Paper
Advertisement

Big tv kissik talks Promo: లవ్ ఫెయిల్యూర్… అందుకే సక్సెస్ అయ్యాను : హైపర్ ఆది

Big tv kissik talks Promo: లవ్ ఫెయిల్యూర్… అందుకే సక్సెస్ అయ్యాను : హైపర్ ఆది
Advertisement

Big tv kissik talks Promo: బుల్లితెర కమెడియన్ గా ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తూ ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్న హైపర్ ఆది(Hyper Aadi) ప్రస్తుతం బుల్లితెర కార్యక్రమాలతో పాటు వెండితెర సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. జబర్దస్త్ కామెడీ షో(Jabardasth Comedy Show) ద్వారా అందరికీ కమెడియన్ గా పరిచయమైన ఆది ఈ కార్యక్రమం ద్వారా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం జబర్దస్త్ షోకి దూరంగా ఉన్నప్పటికీ శ్రీదేవి డ్రామా కంపెనీ, ఢీ డాన్స్ షో కార్యక్రమంలో హైపర్ ఆది సందడి చేస్తున్నారు అదేవిధంగా వెండితెర సినిమాలలో కూడా అవకాశాలు అందుకుంటూ వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.

పెళ్లంటే చాలా బాధ్యత..

ఇక హైపర్ ఆది ఏదైనా స్కిట్ చేశారు అంటే కచ్చితంగా ఆ స్కిట్ లో అమ్మాయిలపై పెద్ద ఎత్తున పంచ్ డైలాగులు వేస్తూ ఉంటారు. కానీ నిజజీవితంలో ఆది అమ్మాయిలకు ఎంతో గౌరవం ఇస్తారని ఇప్పటికే ఎంతోమంది తెలియచేశారు అయితే తాజాగా ఈయన బిగ్ టీవీ కిస్సిక్ టాక్స్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రోమోలో భాగంగా హైపర్ ఆది పెళ్లి గురించి ప్రస్తావనకు వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఆది పెళ్లి చేసుకోవాలంటేనే భయం వేస్తోంది. పెళ్లి ఎంతో బాధ్యతతో కూడుకున్న విషయం.. ఇప్పుడు బయట అమ్మాయిలు అబ్బాయిలని చంపడం వంటివి చూస్తుంటే భయం వేస్తోంది అంటూ మాట్లాడారు.

ఫెయిల్యూర్ ను సక్సెస్ గా మార్చుకోవాలి..

Advertisement

ఇలా పెళ్లి తర్వాత భార్యాభర్తల మధ్య గొడవలు రావడం గురించి కూడా మాట్లాడారు. అమ్మాయి మాట అబ్బాయి వినాలి, అబ్బాయి మాట అమ్మాయి వినాలి కానీ భార్య భర్తల మాట బయట వాళ్ళు వినకూడదు. ఎప్పుడైతే బయట వాళ్ళు వింటారో అప్పుడే సమస్యలు వస్తాయని తెలిపారు. ఇక బ్రేకప్ గురించి కూడా ప్రశ్న ఎదురు కావడంతో హైపర్ ఆది తనకు బ్రేకప్ ఉందని తెలిపారు. తనకు లవ్ బ్రేకప్ అవ్వటం వల్లే లైఫ్ లో సక్సెస్ అయ్యానని హైపర్ ఆది తెలియచేశారు. ఫెయిల్యూర్ ను సక్సెస్ గా మార్చుకున్న వాడే అసలైన లవర్ అంటూ హైపర్ ఆది తెలియచేశారు.

Advertisement

మరి హైపర్ ఆది ఎవరిని ప్రేమించారు? ఎందుకు ఆయన లవ్ బ్రేకప్ అయ్యింది? ఆ అమ్మాయి వివరాలు ఏంటి? అనేది తెలియాలి అంటే పూర్తి ఎపిసోడ్ ప్రసారమయ్యే వరకు ఎదురు చూడాల్సిందే. ఈ కార్యక్రమానికి సంబంధించిన పూర్తి ఎపిసోడ్ శనివారం రాత్రి 8 గంటలకు బిగ్ టీవీలో ప్రసారమవుతుంది. ఇక ఆది ఇండస్ట్రీలోకి రాకముందే ఓ అమ్మాయితో ప్రేమలో పడ్డారని, కాలేజీ చదివే సమయంలోనే బ్రేకప్ జరిగిందంటూ గతంలో తెలిపారు. మరి ఈయన లవ్ బ్రేకప్ గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఆది తన ఫ్యామిలీ గురించి తన తోటి నటీనటుల గురించి అలాగే రాజకీయాల గురించి కూడా ప్రస్తావించినట్టు తెలుస్తోంది. ఇండస్ట్రీలో బిజీగా ఉన్న ఆది తనకు అవకాశం దొరికిన ప్రతిసారి రాజకీయాల గురించి కూడా మాట్లాడుతూ వార్తల్లో నిలుస్తుంటారు.

Also Read: Big tv kissik talks Promo: పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితే చంపేస్తాం.. హైపర్ ఆదికి బెదిరింపులు

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×