E-Paper
Advertisement

Big Tv Kissik Talks: అమ్మ కోసమే బ్రతికాను… పల్సర్ బైక్ రమణ బ్రేకప్ లవ్ స్టోరీ..

Big Tv Kissik Talks: అమ్మ కోసమే బ్రతికాను… పల్సర్ బైక్ రమణ బ్రేకప్ లవ్ స్టోరీ..
Advertisement

Big Tv Kissik Talks: సింగర్ రమణ అంటే ఎవరు గుర్తుపట్టదు కానీ పల్సర్ బైక్ రమణ(Pulsar Bike Ramana) అంటే మాత్రం అందరికీ టక్కున ఈయన గుర్తుకు వస్తారు. పల్సర్ బైక్ పాట ద్వారా సెన్సేషనల్ గా నిలిచిన రమణ ప్రస్తుతం సింగర్ గా అలాగే యూట్యూబర్ గా ఎంతో బిజీగా ఉంటూ ఇండస్ట్రీలో మంచి సక్సెస్ అందుకున్నారు. ఈయన తన భార్య కుందనతో కలిసి పలు వీడియో సాంగ్స్ చేస్తూ మంచి ఆదరణ పొందారు. అలాగే హీరోగా కూడా ఒక సినిమాని చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న పల్సర్ బైక్ రమణ బిగ్ టీవీ కిస్సిక్ టాక్స్(Big tv kissik Talks) కార్యక్రమంలో పాల్గొన్నారు. తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు.

డ్రైవర్ అని రిజెక్ట్ చేసింది…

ఈ ప్రోమో వీడియోలో భాగంగా ఈయన తన కెరీర్ గురించి అలాగే తన ఫ్యామిలీ గురించి, సోషల్ మీడియా గురించి కూడా ఎన్నో ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.. ఇకపోతే పల్సర్ బైక్ రమణకు కూడా ఒక బ్రేకప్ లవ్ స్టోరీ ఉందని తన లవ్ స్టోరీని కూడా రివిల్ చేశారు. అందరిలాగే ఒక అమ్మాయిని చాలా ఇష్టంగానే ప్రేమించాను తనతోనే నా జీవితం అనుకున్నాను కానీ పెళ్లి సమయానికి నన్ను రిజెక్ట్ చేసి వెళ్లిపోయిందని తెలిపారు. నన్ను ప్రేమించడానికి ముందు నేను డ్రైవర్ అనే విషయం అమ్మాయికి తెలుసు డ్రైవర్ తోని ప్రేమలో పడింది, డ్రైవర్ తోనే సినిమాలకు, షికార్లకు వచ్చింది కానీ పెళ్లి చేసుకునే సమయానికి నేను చేసే పని గుర్తుకు వచ్చింది.

అమ్మాయి కోసం చావకూడదు.. అమ్మ కోసం బ్రతకాలి..

Advertisement

తాను ఒక డ్రైవర్ అని నన్ను రిజెక్ట్ చేసిందని తన బ్రేకప్ లవ్ స్టోరీని చెప్పారు. ఎవరు కూడా డ్రైవర్ కావాలని కోరుకోరు కానీ డ్రైవర్ అయ్యారు అంటే వారి వెనుక ఎన్నో బాధలు ఉంటాయని రమణ తెలిపారు. ఇలా అమ్మాయి బ్రేకప్ చెప్పడంతో ఫుల్లుగా మందు తాగి ఇంటికి వెళ్లాను. నన్ను అలా చూసి అమ్మ చాలా ఏడ్చిందని ఆ క్షణమే అనుకున్నాను అమ్మాయి కోసం చావకూడదు, అమ్మ కోసమే బ్రతకాలని నిర్ణయం తీసుకున్నాను అంటూ ఈయన తన బ్రేకప్ లవ్ స్టోరీ ని బయటపెట్టారు. ఇక పల్సర్ బైక్ రమణ అనంతరం కుందన అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం ఈ దంపతులకు ఒక కుమారుడు కూడా ఉన్నారు.

Advertisement

అమ్మ భార్య కొడుకుతో కలిసి రమణకు ఎంతో సంతోషంగా గడుపుతున్నారు. ఇక తన భార్య కుందనతో కలిసి యూట్యూబ్ వీడియోలు చేస్తున్న సంగతి తెలిసిందే. తన తండ్రి గురించి కూడా రమణ మాట్లాడుతూ మా నాన్న నా పెళ్లి జరిగిన నాలుగు నెలలకే చనిపోయారని ముందు రోజు సాయంత్రం తన భార్య ప్రెగ్నెంట్ అనే విషయం తెలిసింది. మరుసటి రోజు తెల్లవారుజామున మూడు గంటలకే మా నాన్న మరణించారని తిరిగి మా నాన్న నా కొడుకు రూపంలో నా దగ్గరికి వచ్చారు అంటూ ఈ సందర్భంగా తన తండ్రి మరణం గురించి కూడా రమణ గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యారు.

Also Read:Prashanth Varma: ప్రభాస్ ప్రశాంత్ వర్మ సినిమా ఆగిపోలేదు.. క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్!

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×