E-Paper
Advertisement

Big tv kissik talks promo: రీతూ బ్యాడ్.. క్యారెక్టర్ మంచిది కాదు..రీతూ ఎమోషనల్ కామెంట్స్ !

Big tv kissik talks promo: రీతూ బ్యాడ్.. క్యారెక్టర్ మంచిది కాదు..రీతూ ఎమోషనల్ కామెంట్స్ !
Advertisement

Big tv kissik talks promo: బుల్లితెర నటిగా పలు సీరియల్స్ ద్వారా ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకున్న రీతు ప్రస్తుతం బుల్లితెర కార్యక్రమాలలో పాల్గొంటూ సందడి చేస్తున్నారు. ఇటీవల ఈమె బిగ్ బాస్ సీజన్ 9 కంటెస్టెంట్ గా పాల్గొని సందడి చేశారు ఈ కార్యక్రమం అనంతరం పలు బుల్లి తెర కార్యక్రమాలలో పాల్గొంటూ బిజీగా ఉన్నారు. ఇకపోతే రీతు చౌదరి తాజాగా బిగ్ టీవీ కిస్సిక్ టాక్స్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా తనకు ఎదురైన అవమానాలు గురించి మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. తన గురించి సోషల్ మీడియాలో ఎన్నో రకాల విమర్శలు వచ్చాయని తెలియజేశారు. నాకు కుటుంబ పరంగా కూడా ఎవరి సపోర్ట్ లేదని, నేను, అన్న, అమ్మ మాత్రమే ఉన్నామని తెలిపారు.

పవన్ కు చాలా చెప్పారు…

బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అందరికోసం ఎంతోమంది వచ్చారు కానీ నా కోసం ఎవరు రారని తెలియజేశారు. ఇక రీతు బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు బయట ధర్మా మహేష్, గౌతమి వివాదంలో రీతూ చౌదరికి సంబంధించిన వివాదం చెలరేగింది. అయితే ఈ విషయం గురించి హౌస్ లో నీకు ఎవరు చెప్పలేదా? అంటూ ప్రశ్న ఎదురయింది. ఈ ప్రశ్నకు సమాధానం చెబుతూ హౌస్ లోకి వచ్చిన వాళ్ళు ఎవరూ నాకు చెప్పలేదు కానీ ఫైర్ స్ట్రోమ్ సమయంలో కంటెస్టెంట్లు హౌస్ లోకి అడుగు పెట్టినప్పుడు పవన్ కు చాలా చెప్పారని రీతు తెలియజేశారు.

అమ్మకు ధైర్యం చెప్పాను కానీ…

Advertisement

రీతూతో ఎందుకు క్లోజ్ గా ఉంటున్నావు? ఆమె చాలా బాడ్ అంటూ పవన్ కి చెప్పారని రీతు ఎమోషనల్ అయ్యారు. అదేవిధంగా ఓటింగ్ కోసం అమ్మ మా బంధువులకు తెలిసిన వాళ్లకు ఫోన్లు చేస్తే మీ అమ్మాయి క్యారెక్టర్ మంచిది కాదంట అంటూ చాలా అవమానించారని రీతు తెలియజేశారు. అమ్మ వీటిని తలుచుకొని బాధపడితే అమ్మకు నేను ధైర్యం చెప్పాను కానీ వాష్ రూమ్ వెళ్లి ఎంతలా ఏడ్చేదాన్నో నాకు మాత్రమే తెలుసు అంటూ రీతు ఈ సందర్భంగా తెలియజేశారు. ఇలా ఎన్నో అవమానాలను భరించానని తెలియ చేశారు.

Advertisement

ఇక నాకంటూ చావు వస్తే మా అన్నయ్య అమ్మ కంటే త్వరగా చనిపోవాలని నాకు వాళ్ళ తప్ప ఇంకెవరు లేరు, వాళ్ళు లేకుండా నేను ఉండలేను అందుకే నేనే ముందు పోవాలని కోరుకుంటాను అంటూ కాస్త ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం ఈ ప్రోమో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక పూర్తి ఎపిసోడ్లో భాగంగా రీతు ఇంకా ఎలాంటి విషయాలను అభిమానులతో పంచుకున్నారనేది తెలియనుంది. ఇక బిగ్ బాస్ తర్వాత రీతు పవన్ ఇద్దరూ కలిసి బీబీ జోడి డాన్స్ షోలో కంటెస్టెంట్ గా సందడి చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇలా వీరిద్దరూ మరోసారి బీబీ జోడీ కార్యక్రమంలో జంటగా కనిపించబోతున్న నేపథ్యంలో వీరి రిలేషన్ గురించి కూడా మరోసారి చర్చలు తెరపైకి వచ్చాయి.

Also Read: Big tv kissik talks promo: బిగ్ బాస్ వల్ల లవ్ లో పడ్డాను.. డెమోన్ అని పిలిచిన పర్లేదు!

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×