E-Paper
Advertisement

Big Tv Kissik Talks : యాంకర్ రవిని తొక్కేయడానికి క్షుద్ర పూజలు..ఎవరా లేడీ యాంకర్?

Big Tv Kissik Talks : యాంకర్ రవిని తొక్కేయడానికి క్షుద్ర పూజలు..ఎవరా లేడీ యాంకర్?
Advertisement

Big tv Kissik Talks: బిగ్ టివి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కిస్సిక్ టాక్స్ (Kissik Talks)కార్యక్రమంలో భాగంగా ఎంతో మంది సెలబ్రిటీలు పాల్గొని సందడి చేస్తున్నారు .తాజాగా ఈ కార్యక్రమానికి యాంకర్ రవి (Anchor Ravi)హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా రవి తన కెరియర్ గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను అభిమానులతో పంచుకున్నారు అయితే తనపై ఇండస్ట్రీలో జరుగుతున్న కుట్ర గురించి కూడా రవి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా యాంకర్ వర్ష రవిని ప్రశ్నిస్తూ మీకు వెన్నుపోటు పొడిచిన వారు ఉన్నారా అంటూ ప్రశ్నించింది. ఈ ప్రశ్నకు రవి సమాధానం చెబుతూ మనుషులు ఎప్పుడూ వెన్నుపోటే పొడుస్తారు అంటూ సమాధానం ఇచ్చారు.

రవి పై క్షుద్ర పూజలు..

ఇకపోతే ఈ కార్యక్రమంలో ఈయన మాట్లాడుతూ తనపై క్షుద్ర పూజలు చేశారని తెలిపారు. సాధారణంగా ఇండస్ట్రీలో ఒకరు ఎదుగుదల కావాలి అంటే ఒకరిని తొక్కేయాలి అని చాలామంది చెబుతూ ఉంటారు. యాంకర్ గా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్న రవి ఎదుగుదలను చూసి ఓర్వలేక తన తోటి యాంకర్ తనపై చేతబడి చేయించారని, క్షుద్ర పూజలు చేశారని ఈయన షాకింగ్ విషయాలను బయట పెట్టారు. ఇలా రవి పై క్షుద్ర పూజలు చేయించింది లేడీ యాంకర్ అనే విషయాన్ని కూడా ఈయన తెలియజేయడంతో ఈ కామెంట్స్ కాస్త వైరల్ అవుతున్నాయి.

పక్కనే ఉంటూ వెన్నుపోటు..

Advertisement

తన పక్కనే ఉంటూ తన ఎదుగుదలను ఓర్చుకోలేక చేతబడి చేయించిన ఆ యాంకర్ ఎవరు? ఏంటి అనే విషయాలపై అభిమానులు ఎన్నో సందేహాలను వ్యక్తపరుస్తున్నారు. అయితే తను నాపై చేతబడి చేయించిన నేను మాత్రం స్వామీజీ వద్దకు వెళ్లి నాపై చేతబడి చేయించిన ఆమె క్షేమంగా, మంచిగా ఉండాలని కోరుకున్నాను అంటూ రవి ఈ సందర్భంగా తెలియజేశారు. ఇలా రవి క్షుద్ర పూజలు గురించి మాట్లాడటంతో ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అయితే రవితో ఎంతోమంది లేడీ యాంకర్లు ఎన్నో షోలను నిర్వహించారు. మరి ఈయనపై చేతబడి చేయించిన ఆ యాంకర్ ఎవరు? ఏంటి అనేది తెలియాలి అంటే రవి స్పందించాల్సి ఉంది.

Advertisement

ఒకానొక సమయంలో వరుస బుల్లితెర కార్యక్రమాల ద్వారా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్న రవి ఇటీవల కాలంలో బుల్లితెర కార్యక్రమాలను కూడా పూర్తిగా తగ్గించారు. ఇలా బుల్లితెర కార్యక్రమాలు లేకపోవడానికి కారణం కూడా ఇండస్ట్రీలో ఉన్న సిండికేట్ అంటూ ఈయన చెప్పకనే చెప్పేశారు. ఇలా కొంతమంది కెరియర్ కోసం ఇతరులను తొక్కేస్తూ ఉంటారు అలా తనకు కూడా అవకాశాలు లేకుండా పోయాయని ఈయన చెప్పకనే చెప్పేశారు.. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా రవి ఇంకా ఎలాంటి విషయాలను అభిమానులతో పంచుకున్నారు? అనేది తెలియాలి అంటే ఈ టాక్ షో పూర్తి ఎపిసోడ్ ప్రసారమయ్యే వరకు ఎదురు చూడాల్సిందే. ఇక ఈ ఎపిసోడ్ శని వారం రాత్రి 8 గంటలకు బిగ్ టీవీలో ప్రసారమవుతుంది.

Also Read: Dil Raju: టాక్సిక్ తెలుగు రైట్స్ రూ.120 కోట్లు ఫేక్… దిల్ రాజు రియాక్షన్ ఇదే!

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×